తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dulquer Salmaan - Samantha Movie: దుల్క‌ర్ స‌ల్మాన్ డ్రీమ్ ప్రాజెక్ట్‌లో స‌మంత హీరోయిన్‌

Dulquer Salmaan - Samantha Movie: దుల్క‌ర్ స‌ల్మాన్ డ్రీమ్ ప్రాజెక్ట్‌లో స‌మంత హీరోయిన్‌

27 September 2022, 6:13 IST

  • Dulquer Salmaan - Samantha Movie: పాన్ ఇండియ‌న్ సినిమాలో హీరో దుల్క‌ర్ స‌ల్మాన్‌తో రొమాన్స్ చేయ‌బోతున్న‌ది స‌మంత‌. దుల్క‌ర్ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ సినిమా ఏదంటే...

స‌మంత‌
స‌మంత‌ (Twitter)

స‌మంత‌

Dulquer Salmaan - Samantha Movie: ఈ ఏడాది సీతారామంతో(Seetharamam) పాటు బాలీవుడ్ సినిమా చుప్‌తో క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌ల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు దుల్క‌ర్ స‌ల్మాన్‌. పాన్ ఇండియ‌న్ స్థాయిలో హీరోగా చ‌క్క‌టి క్రేజ్‌ను సొంతం చేసుకున్న అత‌డితో సినిమాలు వివిధ భాష‌ల‌కు చెందిన అగ్ర ద‌ర్శ‌కులు ఆస‌క్తిని చూపుతున్నారు. ప్ర‌స్తుతం దుల్క‌ర్ స‌ల్మాన్ కింగ్ ఆఫ్ కోతా పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

ట్రెండింగ్ వార్తలు

Guppedantha Manasu Serial: వ‌సుధార ప్లాన్ రివ‌ర్స్ - రాజీవ్ కుట్ర‌ల‌ను క‌నిపెట్టిన రిషి వైఫ్ - మ‌ను క‌ళ్ల‌లో భ‌యం

Krishna mukunda murari serial today: సరోగసి మథర్ గురించి నిజం దాచిన మురారి.. మీరాతో తిరగొద్దని మురారికి చెప్పిన కృష్ణ

Alia Bhatt Saree: ఆలియా భట్ మెట్ గాలా 2024 చీర వెనుక 163 మంది కళాకారులు, 1905 గంటల శ్రమ

Brahmamudi May 7th Episode: తండ్రి త‌ప్పుకు రాజ్‌కు శిక్ష‌- దుగ్గిరాల ఇంటికి కావ్య దూరం - రాజ్ బిడ్డ‌కు తండ్రి ఎవ‌రంటే?

కెరీర్‌లో తొలిసారి దుల్క‌ర్ పూర్తిస్థాయి మాస్ పాత్ర‌లో న‌టిస్తున్న సినిమా ఇది. కింగ్ ఆఫ్ కోతా(King of Kotha) త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ అని దుల్క‌ర్ ప‌లు మార్లు వెల్ల‌డించాడు. సోమ‌వారం నుంచి త‌మిళ‌నాడులోని క‌రైకుడిలో ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైంది. కాగా ఈ సినిమాలో దుల్క‌ర్ స‌ల్మాన్‌కు జోడీగా స‌మంత హీరోయిన్‌గా న‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం.

చాలా రోజుల క్రిత‌మే స‌మంత‌ను క‌లిసిన ద‌ర్శ‌కుడు క‌థ‌ను వినిపించిన‌ట్లు తెలిసింది. స‌మంత కూడా ఈ సినిమాలో న‌టించ‌డానికి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమార‌న్ ఓ కీల‌క పాత్ర‌ను పోషించ‌నున్న‌ట్లు తెలిసింది. అత‌డితో పాటు శోభిత ధూలిపాళ్ల‌, మ‌నోజ్ బాజ్‌పాయ్ న‌టిస్తున్న‌ట్లు చెబుతున్నారు.

పాన్ ఇండియ‌న్ స్థాయిలో మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సమంత తెలుగులో యశోద, శాకుంతల తో పాటు విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా చేస్తోంది. హిందీలో సిటాడెల్ సిరీస్‌లో న‌టిస్తోంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.