తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Samantha: అతనితో 15 ఏళ్ల బంధం.. వీళ్లంతా నా జిగ్రాలు.. పెళ్లయింది కాబట్టి బ్రదర్ అనొచ్చు.. సమంత కామెంట్స్ వైరల్

Samantha: అతనితో 15 ఏళ్ల బంధం.. వీళ్లంతా నా జిగ్రాలు.. పెళ్లయింది కాబట్టి బ్రదర్ అనొచ్చు.. సమంత కామెంట్స్ వైరల్

Sanjiv Kumar HT Telugu

09 October 2024, 14:04 IST

google News
  • Samantha Comments In Jigra Pre Release Event: స్టార్ హీరోయిన సమంత జిగ్రా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ హీరోయిన్ అలియా భట్ మెయిన్ లీడ్ రోల్ చేసిన జిగ్రా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన సమంత రూత్ ప్రభు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

అతనితో 15 ఏళ్ల బంధం.. వీళ్లంతా నా జిగ్రాలు.. పెళ్లయింది కాబట్టి బ్రదర్ అనొచ్చు.. సమంత కామెంట్స్ వైరల్
అతనితో 15 ఏళ్ల బంధం.. వీళ్లంతా నా జిగ్రాలు.. పెళ్లయింది కాబట్టి బ్రదర్ అనొచ్చు.. సమంత కామెంట్స్ వైరల్

అతనితో 15 ఏళ్ల బంధం.. వీళ్లంతా నా జిగ్రాలు.. పెళ్లయింది కాబట్టి బ్రదర్ అనొచ్చు.. సమంత కామెంట్స్ వైరల్

Samantha Ruth Prabhu Comments: ఆర్ఆర్ఆర్‌లో సీతగా అలరించిన బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఆలియా భ‌ట్ మెయిన్ లీడ్ రోల్ పోషించిన సినిమా జిగ్రా. ఇందులో వేదాంగ్ రైనా మరో ప్ర‌ధాన పాత్ర‌లో నటించాడు. జిగ్రా సినిమా అక్టోబర్ 11న రిలీజ్ కానుంది. అయితే, ఈ సినిమాను తెలుగులో ఏషియ‌న్ సురేష్‌ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ద్వారా హీరో దగ్గుబాటి రానా విడుద‌ల చేస్తున్నారు.

అతిథులు వీళ్లే

పాన్ ఇండియా డైరెక్ట‌ర్ ఎస్ఎస్ రాజమౌళి, గ్లోబ‌ల్ స్టార్ రామ్ చరణ్‌లు విడుద‌ల చేసిన జిగ్రా తెలుగు ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. ప్రమోషన్స్‌లో భాగంగా మంగళవారం (అక్టోబర్ 8) జిగ్రా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. యాంకర్ సుమ హోస్ట్‌గా వ్యవహరించిన ఈ కార్యక్రమానికి స్టార్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ త్రివిక్రమ్, అగ్ర హీరో రానా దగ్గుబాటి, రాహుల్ రవీంద్రన్ అతిథులుగా విచ్చేశారు.

సమంత కామెంట్స్

అలాగే, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్, సమంత చేతుల మీదుగా జిగ్రా బిగ్ టికెట్‌ను లాంచ్ చేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. దీంతో జిగ్రా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సమంత చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.

ఇలాంటి కథలు చెప్పాలి

"అలియా నటన అంటే నాకు చాలా ఇష్టం. హీరోయిన్లుగా మాపై కొంత బాధ్యత ఉంటుంది. అమ్మాయిలు వారి జీవితాలకు వాళ్లే హీరోలు అని చెప్పేందుకు అప్పుడప్పుడు ఇలాంటి కథలు చెప్పాల్సి వస్తుంది. ఆలియా ఒకవైపు నటిస్తూనే.. మరో వైపు సినిమాలు నిర్మిస్తూ ఉన్నారు" అని అలియా భట్‌పై సమంత ప్రశంసలు కురిపించింది.

నాకు 15 ఏళ్ల బంధం

"రాహుల్‌తో నాకు 15 ఏళ్ల బంధం.. త్రివిక్రమ్ గారితో మూడు చిత్రాలు చేశాను. సురేష్ ప్రొడక్షన్స్ నుంచి నాకు మంచి చిత్రాలు వచ్చాయి. వీళ్లంతా నా జిగ్రాలు. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. వాసన్ బాలా అద్భుతంగా తీశారు. వేదాంగ్‌కు మంచి సక్సెస్ రావాలి. రాహుల్ ప్రతీ ప్రయాణంలో నేను ఉన్నాను" అని సమంత తెలిపింది.

మై బ్రదర్ రానా..

"రానా.. మై బ్రదర్.. అంటే రానా గత నెలలోనే ఓ ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రాన్ని ఇచ్చారు. అది చాలా సక్సెస్ ఇచ్చింది. ఇప్పుడు నెల కాకముందే మరో ఫీమెల్ సెంట్రిక్ సినిమా జిగ్రాను ఇస్తున్నారు. నాకు తెలిసి ప్రతీ అమ్మాయికి రానా లాంటి బ్రదర్ ఉండాలేమో. ఫైనల్లీ పెళ్లి చేసుకున్నారు కాబట్టి.. అందరికీ బ్రదర్ అనొచ్చు కదా" అని నవ్వుతూ సమంత చెప్పింది. దానికి అవును అన్నట్లుగా తల ఊపాడు రానా.

ఎంతగా ప్రేమిస్తారనేది

"తెలుగు ప్రేక్షకులు ఎంతగా ప్రేమిస్తారు అనేది జిగ్రాతో ఆలియాకు మరింత తెలుస్తుంది. తెలుగు ప్రేక్షకులు ప్రేమ వల్లే నేను ఈ రోజు ఇలా ఈ స్థాయిలో ఉన్నాను. అక్టోబర్ 11న ఈ చిత్రాన్ని అందరూ చూడండి" అని హీరోయిన్ సమంత రూత్ ప్రభు కోరింది.

జిగ్రాతో మరింతగా

అనంతరం రానా మాట్లాడుతూ.. "బాహుబలి కోసం ధర్మ ప్రొడక్షన్ ముందడుగు వేసింది. ఆలియా సేన జిగ్రాతో మరింత ఎక్కువ అవ్వాలని కోరుకుంటున్నాను. సమంత గారితో ఓ బేబీ చేశాం. వాసన్ బాలాకు ఆల్ ది బెస్ట్. అక్టోబర్ 11న ఈ చిత్రం రానుంది. అందరూ చూడండి" అని కోరాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం