Rajamouli: రాజమౌళి కోపాన్ని బయటపెట్టిన కమెడియన్ సత్య.. మైక్ విరగొట్టారంటూ కామెంట్స్
Comedian Satya About Rajamouli Angry In Mathu Vadalara 2: మత్తు వదలరా 2 సినిమా ప్రమోషన్స్‌లో కమెడియన్ సత్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మత్తు వదలరా 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ రాజమౌళి కోపం గురించి బయటపెట్టాడు కమెడియన్ సత్య. ఈ సమయంలో రాజమౌళి భార్య రమా రాజమౌళి కూడా ఉన్నారు.
Comedian Satya About Rajamouli Angry: మత్తు వదలరా, మత్తు వదలరా 2 సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న కమెడియన్ సత్య. అమృతం సీరియల్‌తో అసిస్టెంట్ డైరెక్టర్‌గా, నటుడుగా కెరీర్ స్టార్ట్ చేసిన సత్య ఇప్పుడు క్రేజీ స్టార్ కమెడియన్‌గా ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నాడు.
మత్తు వదలరా 2 ప్రమోషన్స్
స్వామి రారా, రంగబలి, గద్దలకొండ గణేష్ వంటి ఇతర చిత్రాలతో మంచి కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న సత్య మత్తు వదలరా 2 సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. సెప్టెంబర్ 13న విడుదలైన మత్తు వదలరా 2 సినిమా మంచి హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, మత్తు వదలరా 2 సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దర్శక దిగ్గజం రాజమౌళి, ఆయన భార్య రమా హాజరయ్యారు.
యాంకర్ సుమ పంచ్‌లు
యాంకర్ సుమ హోస్ట్‌గా చేసిన మత్తు వదలరా 2 ట్రైలర్ లాంచ్‌కు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో సినిమాలోని ప్రధాన పాత్రధారుల్లో ఒకరైన కమెడియన్ సత్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సత్య స్పీచ్‌కు యాంకర్ సుమ మధ్య మధ్యలో పంచ్‌లు వేయడంతో ఫన్ జెనరేట్ అయింది. ఇప్పుడు ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అవకాశం చాలా ముఖ్యం
"అందరికీ నమస్కారం. రాజమౌళి గారికి, కీరవాణికి నమస్కారం. యాక్ట్ చేయడమంటే ఓకే కానీ ఇలా మాట్లడటం అంటేనే కష్టం. సినిమా ఇండస్ట్రీలో ఎంత టాలెంట్ ఉన్న అవకాశం అనేది చాలా ముఖ్యం నా దృష్టిలో. మాది అమలాపురం దగ్గర జనపల్లి అని చిన్న ఊరు. అక్కడ సినిమాల్లోకి వెళ్తానని కలలు కనేవాన్ని. కచ్చితంగా సినిమాల్లోకి వెళ్తానని తెలుసు" అని సత్య చెప్పాడు.
యాక్ట్ చేస్తున్నాను
"సినిమాల్లో చేద్దాం అని ఊరు నుంచి పారిపోయి వచ్చేశాను. ఆ తర్వాత ఇక్కడి వచ్చేశాను. ఇప్పుడు అదంతా కథ చెప్పలేను. నన్ను సినిమాల్లో చూసి గుర్తు పట్టేస్తారు అనేంత అమాయకంగా వచ్చేశాను. నాకు ఏం తెలియదు సినిమా ఇండస్ట్రీ గురించి" అని సత్య అంటే.. "ఇప్పుడు కూడా ఏం తెలియదు" అని సుమ నవ్వింది. "అవును, ఇప్పుడు కొంచెం పర్లేదు యాక్ట్ చేస్తున్నాను" అని సత్య అన్నాడు.
డబ్బులిచ్చి మరి
"యమదొంగ షూటింగ్ జరుగుతుంటే.. ఒక జూనియర్ ఆర్టిస్ట్‌కు డబ్బులిచ్చి నేను షూటింగ్‌కు వెళ్లా జూనియర్ ఆర్టిస్ట్‌గా. నేను ఫస్ట్ షూటింగ్ చూసింది సార్‌ది (రాజమౌళి). అక్కడ జూనియర్ ఆర్టిస్ట్‌లకు ఒక గ్లాస్ ఇచ్చారు. సాంగ్ జరుగుతుందండి. మీరు ఆరోజు మైక్ కూడా పగులగొట్టేశారు ఒకటేదో" అని నవ్వుకుంటూ కమెడియన్ సత్య చెప్పాడు. దాంతో రాజమౌళి, రమా రాజమౌళితోపాటు అంతా నవ్వేశారు.
నల్ల శ్రీను ద్వారా
"ఫస్ట్ టైమ్ చూశాను షూటింగ్ ఇలా జరుగుతుందా అని. తర్వాత మా అమ్మ ఏడ్చేసి నన్ను ఇంటికి తీసుకెళ్లింది. ఆ తర్వాత మేకప్ మ్యాన్ నల్ల శీను గారి ద్వారా అమృతం సీరియల్‌కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాను" అని కమెడియన్ సత్య తెలిపాడు. ఇలా యమదొంగ షూటింగ్ సమయంలో రాజమౌళి కోపం గురించి సత్య అనుకోకుండా బయటపెట్టాడు.