తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Salman Khan : హాలీవుడ్ సినిమా కోసం రంగంలోకి దిగిన సల్మాన్ ఖాన్

Salman Khan : హాలీవుడ్ సినిమా కోసం రంగంలోకి దిగిన సల్మాన్ ఖాన్

Anand Sai HT Telugu

03 May 2023, 8:02 IST

    • Guardians Of The Galaxy : ఇండియాలో మరో హాలీవుడ్ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. మార్వెల్ యూనివర్స్ కి చెందిన గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ సినిమా వాల్యూమ్ 3 రిలీజ్ కాబోతోంది. దీనిని బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రమోట్ చేస్తున్నాడు.
సల్మాన్ ఖాన్
సల్మాన్ ఖాన్ (Girish Srivastav)

సల్మాన్ ఖాన్

బాక్సాఫీస్ వద్ద తన సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి తడబడుతుండగా, సల్మాన్ ఖాన్(Salman Khan) హాలీవుడ్ సినిమాలను ప్రమోట్ చేయడానికి దిగాడు. బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ లాగే సల్మాన్ ఖాన్ కూడా వరుస పరాజయాలను చవిచూశాడు. ఆయన సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి ఐదేళ్లకు పైగా అయ్యింది. తన సొంత సినిమాలు బాక్సాఫీస్ వద్ద మునిగిపోతున్న తరుణంలో సల్మాన్ ఖాన్ ఓ హాలీవుడ్ సినిమా(Hollywood) ప్రమోషన్ లో అడుగుపెట్టాడు.

ట్రెండింగ్ వార్తలు

Anand Devarakonda: బొంబాయి చట్నీ చేసిన కుర్రాడిగానే తెలుసు, కానీ.. ఆనంద్ దేవరకొండ కామెంట్స్

Brahmamudi: ఆఫీస్ సీసీ కెమెరాలో రాజ్ సీక్రెట్.. చూసేసిన కావ్య, అప్పు- వసుధార కొత్త స్కెచ్- మీరా షాక్‌లో మురారి, కృష్ణ

Heeramandi OTT: ఓటీటీలో దూసుకుపోతున్న పీరియాడికి డ్రామా.. నెటిజన్ల ప్రశంసలు.. సిరీస్ ఎక్కడ చూస్తారంటే?

Adivi Sesh: అదే కొనసాగిస్తే గర్వపడే స్థాయికి వెళ్తుంది.. హీరోయిన్‌పై అడవి శేష్ కామెంట్స్ వైరల్

మార్వెల్(Marvel) పాపులర్ మూవీ సిరీస్‌లలో ఒకటైన గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ మూడో చిత్రం విడుదలవుతోంది. సల్మాన్ ఖాన్ ఈ చిత్రాన్ని భారతదేశంలో ప్రమోట్ చేస్తున్నాడు. సల్మాన్ ఖాన్ దీని గురించి ఒక వీడియోను పంచుకున్నాడు. గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3కి స్వాగతం పలికాడు. ఈ సినిమాకు సంబంధించి ఓ యాడ్ లో సల్మాన్ నటించాడు.

గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ(Guardians Of The Galaxy) చిత్రం తరపున ప్రమోషనల్ వీడియోను షేర్ చేశాడు సల్మాన్ ఖాన్. ఈ సినిమా సిరీస్‌లోని పాపులర్ క్యారెక్టర్ గ్రూట్ నుండి ప్రేరణ పొందినట్టుగా ఓ వీడియో చేశాడు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అడిగే ప్రశ్నలన్నింటికీ గ్రూట్ లాగే సమాధానమిస్తాడు సల్మాన్. ఐయామ్ సల్మాన్ ఖాన్ అని చెబుతుంటాడు. గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ సినిమాలో గ్రూట్ కూడా ఇలాగే ఐయామ్ గ్రూట్ అని చెబుతాడు. వీడియోలో ప్రెస్ కాన్ఫరెన్స్ ముగిశాక, సల్మాన్ ఖాన్ వెళ్లేటప్పుడు జాకెట్ తీస్తే, అతని టీ-షర్ట్ వెనుక గ్రూట్(Groot) చిత్రం ఉంటుంది. గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ 3లో సల్మాన్ ఖాన్ వాయిస్ ఇచ్చి ఉండవచ్చనే సందేహాలు ఉన్నాయి.

మార్వెల్ యూనివర్స్ కి చెందిన గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ సినిమా మొదటి వాల్యూమ్ 2014లో విడుదలైంది. రెండో వాల్యూమ్ 2017లో రిలీజైంది. ఇండియా(India)లో కూడా వీటికి ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 రిలీజ్ కాబోతుంది. మే 5న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవనుంది.

భారతదేశంలోనూ మార్వెల్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. సల్మాన్ యాడ్ తో ఇండియాలో ఈ సినిమా భారీ మార్కెట్ మీద కన్నేసినట్టుగా అర్థమవుతోంది. మార్వెల్ స్టూడియోస్ గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 మే 5న ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషలలో రిలీజ్ చేస్తున్నారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.