తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Salaar Update: జేమ్స్ బాండ్ మూవీ లొకేష‌న్‌లో స‌లార్ షూటింగ్ - హాలీవుడ్ లెవెల్ యాక్ష‌న్ సీక్వెన్స్ తో పూన‌కాలే

Salaar Update: జేమ్స్ బాండ్ మూవీ లొకేష‌న్‌లో స‌లార్ షూటింగ్ - హాలీవుడ్ లెవెల్ యాక్ష‌న్ సీక్వెన్స్ తో పూన‌కాలే

31 March 2023, 7:48 IST

  • Salaar Update: ప్ర‌భాస్ స‌లార్ మూవీ షూటింగ్ ప్ర‌స్తుతం ఇట‌లీలో జ‌రుగుతోంది. జేమ్స్ బాండ్ మూవీ నో టైమ్ టూ డై షూటింగ్ చేసిన లొకేష‌న్‌లో ప్ర‌భాస్‌పై యాక్ష‌న్ ఎపిసోడ్‌ను చిత్రీక‌రిస్తోన్నారు.

ప్ర‌భాస్ స‌లార్
ప్ర‌భాస్ స‌లార్

ప్ర‌భాస్ స‌లార్

Salaar Update: ప్ర‌భాస్ (Prabhas) స‌లార్ మూవీ షూటింగ్ ప్ర‌స్తుతం ఇట‌లీలో జ‌రుగుతోంది. గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. స‌లార్ షూటింగ్ ప్ర‌జెంట్‌ ఇట‌లీలో జ‌రుగుతోంది. ఇట‌లీలోని పుర‌తాన న‌గ‌రాల్లో ఒక‌టైన మ‌తేరాలో కీల‌క‌మైన యాక్ష‌న్ ఎపిసోడ్‌ను చిత్రీక‌రిస్తోన్న‌ట్లు స‌మాచారం.

ట్రెండింగ్ వార్తలు

Hansika Guardian Review: గార్డియన్ రివ్యూ - హ‌న్సిక లేటెస్ట్ హార‌ర్ మూవీ ఎలా ఉందంటే?

Vidya Vasula Aham OTT: ఓటీటీలోకి నేరుగా వస్తున్న శివానీ రాజశేఖర్ ‘విద్యా వాసుల అహం’ సినిమా

Rajamouli: అందుకోసం మీడియా ముందుకు రానున్న రాజమౌళి.. మహేశ్‍తో సినిమా గురించి ఏమైనా చెబుతారా?

Premalu Telugu OTT: ఓటీటీలో మరో మైల్‍స్టోన్ దాటిన ప్రేమలు సినిమా తెలుగు వెర్షన్

ప‌ర్వ‌తాలు, గుహ‌ల‌తో నిండి ఉండే ఈ న‌గ‌రంలో గ‌తంలో జేమ్స బాండ్ నో టైమ్ టూ డై సినిమాలోని యాక్ష‌న్ ఎపిసోడ్స్‌ను షూట్ చేశారు. అదే సిటీలో స‌లార్ షూటింగ్ జ‌రుగుతోండటం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. మ‌తేరాలో ప్ర‌భాస్‌తో పాటు ఫారిన్ ఫైట‌ర్స్‌పై కీల‌క‌మైన యాక్ష‌న్ ఎపిసోడ్‌ను డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌ చిత్రీకరిస్తోన్నట్లు తెలిసింది. ఈ యాక్ష‌న్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తోంద‌ని చిత్ర యూనిట్ చెబుతోంది.

మ‌తేరాతో పాటు నాప్‌లెస్ పోర్ట్ ఏరియా, రోమ్‌, బుడాపెస్ట్‌ల‌లో స‌లార్ షూటింగ్ జ‌రుప‌బోతున్న‌ట్లు తెలిసింది. ఈ షెడ్యూల్‌లో ప్ర‌భాస్‌తో పాటు పృథ్వీరాజ్ సుకుమార‌న్ (Prithviraj Sukumaran)పాల్గొన‌నున్న‌ట్లు స‌మాచారం. ఇట‌లీ షెడ్యూల్‌తో స‌లార్ షూటింగ్ దాదాపు తుది ద‌శ‌కు చేరుకున్న‌ట్లేన‌ని అంటున్నారు. స‌లార్ సినిమాలో ప్ర‌భాస్ డ్యూయ‌ల్ రోల్‌లో క‌నిపించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇందులో కేజీఎఫ్ ఫేమ్ య‌శ్ (Yash) కీల‌క‌మైన అతిథి పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ యాక్ష‌న్ సినిమాలో మ‌ల‌యాళ న‌టుడు పృథ్వీరాజ్‌సుకుమార‌న్ విల‌న్‌గా న‌టిస్తోన్నాడు. శృతిహాస‌న్ హీరోయిన్‌గా క‌నిపించ‌బోతున్న‌ది. హోంబ‌లే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమా పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో సెప్టెంబ‌ర్ 28న రిలీజ్ కానుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.