తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Lalit Modi Break Up With Suhmita Sen: లలిత్ మోదీ-సుష్మితా సేన్ బ్రేకప్ అయ్యారా.. కారణం అదేనా?

Lalit Modi Break up with Suhmita Sen: లలిత్ మోదీ-సుష్మితా సేన్ బ్రేకప్ అయ్యారా.. కారణం అదేనా?

07 September 2022, 8:21 IST

    • Lalit Modi broke up with Sushmita Sen: మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్.. ఐపీఎల్ వ్యవస్థాపకులు విడిపోయారనే ఊహాగానాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపిస్తున్నాయి. ఆయన.. సుష్మితాతో ఉన్న డీపీని తొలగించడంతో వార్తలు ఎక్కువగా వస్తున్నాయి.
లలిత్ మోదీ-సుష్మితా సేన్
లలిత్ మోదీ-సుష్మితా సేన్ (Instagram)

లలిత్ మోదీ-సుష్మితా సేన్

Lalit Modi and Sushmita Sen Broke up: మాజీ విశ్వ సుందరి సుష్మితా సేన్.. ఐపీఎల్ వ్యవస్థాపకులు లలిత్ మోదీ రిలేషన్‌లో ఉన్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తామిద్దరం ప్రేమలో ఉన్నామంటూ లలిత్ మోదీనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అంతేకాకుండా ఆమెతో కలిసి దిగిన ఫొటోలను కూడా షేర్ చేశారు. అవి నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో వీరిపై విస్తృతంగా ఊహాగానాలు వచ్చాయి. తాజాగా వీరిద్దరూ విడిపోయారనే ఊహాగానాలు వ్యాప్తి చెందుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

The 100 Movie: థియేట‌ర్ల‌లో రిలీజ్ కావ‌డానికి ముందే మొగ‌లి రేకులు సాగ‌ర్ మూవీకి అవార్డ్‌

Barbie Telugu OTT: ఎనిమిది ఆస్కార్ నామినేష‌న్స్ ద‌క్కించుకున్న హాలీవుడ్ మూవీని తెలుగులో చూడొచ్చు - ఏ ఓటీటీలో అంటే?

Kannappa: కన్నప్పలో ముగిసిన అక్షయ్ కుమార్ పార్ట్.. మిగిలింది ప్రభాస్? చాలా నేర్చుకున్నానంటూ మంచు విష్ణు

Krishna mukunda murari serial may 4th episode: మురారికి నిజం చెప్పేసిన మీరా.. ముకుంద, ఆదర్శ్ కి పెళ్లి చేద్దామన్న భవానీ

లలిత్ మోదీ.. సుష్మితా సేన్‌తో పీకల్లోతూ ప్రేమలో ఉండి ఆమె పేరును తన ఇన్‌స్టాలో జోడించాడు. అంతేకాకుండా ఆమెతో కలిసి ఉన్న డీపీని కూడా పెట్టారు. అయితే తాజాగా ఆయన సుష్మితా పేరును ఇన్‌స్టాలో తీసివేయడమే కాకుండా డీపీని కూడా తొలగించారు. ఇన్‌స్టా ప్రొఫైల్‌లో మార్పులు చేయడంతో లలిత్ మోదీ సుష్మితా సేన్‌తో విడిపోయారని నెటిజన్లు భావిస్తున్నారు.

అయితే లలిత్ మోదీ- సుష్మితా సేన్ విడిపోవడానికి ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ కారణమని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా సుష్మితా.. తన మాజీ ప్రియుడు రోహమన్‌తో కలిసి సనినిమాలకు, షాపింగ్ మాల్స్‌కు వెళ్తోంది. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని బాహాటంగానే తిరగుతుండటంతో లలిత్ మోదీ.. సుష్మితాకు బ్రేకప్ చెప్పారని స్పష్టమవుతోంది. మరి ఈ వార్తల్లో ఎంత మేరకు వాస్తవముందో తెలియాల్సి ఉంది.

నాలుగు పదుల వయస్సు దాటినా సుష్మితా సేన్ ఇంత వరకు పెళ్లి చేసుకోలేదు. వివాహం చేసుకోనప్పటికీ సింగిల్‌గా మాత్రం ఈ విశ్వసుందరి లేదు. ఇంతకుముందు పలువురు క్రికెట్, వ్యాపార ప్రముఖలతో ప్రేమాయాణం నడిపింది. గతేడాది తన మాజీ బాయ్ ఫ్రెండ్ రోహమన్‌తో బ్రేకప్ చెప్పిన తర్వాత ఖాళీగానే ఉంది. అయితే ఇటీవల కాలంలో లలిత్ మోదీ తాను సుష్మితాతో రిలేషన్‌లో ఉన్నానని ప్రకటించడంతో ఆమె వ్యక్తిగత జీవితం గురించి మళ్లీ చర్చ మొదలైంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.