Sushmita Sen: ఐపీఎల్ మాజీ ఛైర్మన్‌తో పీకల్లోతు ప్రేమలో సుష్మితా సేన్-sushmita sen love with businessman lalit modi ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sushmita Sen: ఐపీఎల్ మాజీ ఛైర్మన్‌తో పీకల్లోతు ప్రేమలో సుష్మితా సేన్

Sushmita Sen: ఐపీఎల్ మాజీ ఛైర్మన్‌తో పీకల్లోతు ప్రేమలో సుష్మితా సేన్

Maragani Govardhan HT Telugu
Jul 14, 2022 10:51 PM IST

బాలీవుడ్ నటి సుష్మితా సేన్.. ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్‌ మోదీతో ప్రేమలో పడింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విటర్ వేదికగా తెలియజేశారు. ఒక్కరోజులో తాము ప్రేమలో పడిపోయినట్లు స్పష్టం చేశారు.

<p>లలిత్ మోదీతో ప్రేమలో సుష్మిత్ సేన్</p>
లలిత్ మోదీతో ప్రేమలో సుష్మిత్ సేన్ (Twitter)

Sushmita Sen and Lalil modi in Love: బాలీవుడ్ నటి, మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ మరోసారి ప్రేమలో పడిందా.. అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే ఈ ముద్దుగుమ్మ ఐపీఎల్ మాజీ ఛైర్మన్, వ్యాపారవేత్త లలిత్ మోదీతో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. స్వయాన ఆయనే ఈ విషయాన్ని ఖరారు చేశారు. ట్విటర్ వేదికగా సుష్మితాతో తాను రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఆమెను తన భాగస్వామిగా పరిచయం చేస్తూ.. డేటింగ్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

yearly horoscope entry point

"ప్రపంచ పర్యటనలో భాగంగా మాల్దీవుల్లో టూర్ అయిపోయిన తర్వాత లండన్‌లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నా. ఎట్టకేలకు నా జీవిత భాగస్వామి సుష్మితా సేన్‌తో కొత్త జీవితం ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది." అని ట్విటర్ వేదికగా లలిత్ మోదీ రాసుకొచ్చారు. దీంతో ఆయనకు మైక్రో బ్లాగింగ్ సైట్‌లో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. హార్ట్ ఎమోజీలతో విషెస్ నెటిజన్లు చెప్పారు. ఆ కాసేపటికే లలిత్ మోదీ తన పెళ్లి గురించి క్లారిటీనిస్తూ మరో ట్వీట్ చేశారు.

"ప్రస్తుతానికి తామింకా డేటింగ్‌లోనే ఉన్నాం, ఒక్కరోజులోనే ఒకరితో ఒకరం ప్రేమలో పడిపోయాం" అని మరో ట్వీట్ ద్వారా లలిత్ మోదీ వివాహంపై స్పష్టత నిచ్చారు. అంతేకాకుండా వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫొటోలను కూడా ఆయన షేర్ చేశారు. పాత పిక్చర్ల దగ్గర నుంచి లేటెస్ట్‌గా కలిసి దిగిన ఫొటోల్లో కొన్నింటిని పంచుకున్నారు.

సుష్మితా సేన్ మొదట్లో పాక్ క్రికెటర్ వసీం అక్రమ్‌తో ప్రేమాయణం నడిపింది. వీరిద్దరూ చాలా రోజుల పాటు సహజీవనం చేశారు. అయితే ఇద్దరి మధ్య పరస్ఫర విభేదాలు తలెత్తడంతో విడిపోయారు. అనంతరం రోహ్‌మన్ షాల్ అనే మోడల్‌తో సుష్మితా డేటింగ్ చేసింది. అతడితో కొన్ని నెలల క్రితమే విడిపోయింది. ఈ లోపే లలిత్ మోదీతో ప్రేమ వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పడం గమనార్హం.

Whats_app_banner