తెలుగు న్యూస్  /  Entertainment  /  Rc16 Shelved Revealed Ramcharan Pr Team

RC16 shelved: జెర్సీ డైరెక్టర్‌తో రామ్‌చరణ్‌ మూవీ అటకెక్కినట్లే!

HT Telugu Desk HT Telugu

01 November 2022, 17:38 IST

    • RC16 shelved: జెర్సీ డైరెక్టర్‌తో రామ్‌చరణ్‌ మూవీ అటకెక్కినట్లేనని అతని పీఆర్‌ టీమ్‌ స్పష్టం చేసింది. ఆర్సీ16గా పిలుస్తున్న ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని అప్పట్లో వార్తలు రాగా.. ఇప్పుడీ సినిమా పూర్తిగా ఆగిపోయినట్లేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అటకెక్కిన రామ్ చరణ్, గౌతమ్ తిన్ననూరి మూవీ ఆర్సీ16
అటకెక్కిన రామ్ చరణ్, గౌతమ్ తిన్ననూరి మూవీ ఆర్సీ16

అటకెక్కిన రామ్ చరణ్, గౌతమ్ తిన్ననూరి మూవీ ఆర్సీ16

RC16 shelved: ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీతో పాన్‌ ఇండియా సక్సెస్‌ అందుకున్న మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ మరో బిగ్‌ హిట్‌ కోసం ఎదురు చూస్తున్నాడు. తండ్రి చిరంజీవితో కలిసి నటించిన ఆచార్య దారుణంగా బోల్తా పడింది. ఇక ఇప్పుడు శంకర్‌తో ఆర్సీ15 మూవీ చేస్తున్నాడు. ఇదే సమయంలో శంకర్ అటు ఇండియన్‌ 2 షూటింగ్‌ కూడా చేస్తుండటంతో ఆర్సీ15 షూటింగ్‌ సజావుగా సాగడం లేదు.

ట్రెండింగ్ వార్తలు

Asura Guru Telugu OTT: తెలుగులో నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతోన్న కోలీవుడ్ యాక్ష‌న్ మూవీ అసుర గురు

Guppedantha Manasu Today Episode: వ‌సుధార‌పై మ‌న‌సు ప‌డ్డ మ‌ను - శైలేంద్రకు మ‌హేంద్ర ప‌నిష్‌మెంట్ - రాజీవ్ చ‌నిపోలేదా?

Krishna mukunda murari april 30th: మురారి బిడ్డ ముకుంద కడుపులో.. కృష్ణ నెల తప్పిందని భవానీ ఆనందం, ఆదర్శ్ జలస్

Karthika deepam 2: కార్తీకదీపం 2 సీరియల్..జ్యోత్స్నకి ఘోరమైన అవమానం.. దీపని గెంటేసిన పారిజాతం, అడ్డుపడిన సుమిత్ర

ఇక ఇప్పుడు ఆర్సీ16 కూడా ఆగిపోయింది. జెర్సీ ఫేమ్‌ డైరెక్టర్‌ గౌతమ్‌ తిన్ననూరితో రామ్‌చరణ్‌ తన 16వ సినిమా చేయబోతున్నాడని అప్పట్లో చెప్పారు. అయితే ఇప్పుడు మాత్రం ఈ సినిమా కూడా ఆగిపోయినట్లు చరణ్‌ పీఆర్‌ వెల్లడించారు. అయితే దీనికి కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు. ప్రస్తుతానికైతే ఈ సినిమాను పక్కన పెట్టినట్లు ట్విటర్‌ ద్వారా రామ్‌చరణ్‌ పీఆర్‌ తెలిపారు.

భవిష్యత్తులో ఈ ప్రాజెక్ట్‌ మళ్లీ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా చెప్పారు. ఆర్సీ15 తర్వాత చరణ్‌ ఏ సినిమా చేయబోతున్నాడన్నది త్వరలోనే వెల్లడిస్తామని పీఆర్‌ తెలిపారు. "ఇంతకుముందు చెప్పినట్లు మన మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్ తర్వాతి ప్రాజెక్ట్‌ ఆర్సీ16 గౌతమ్‌తో చేయడం లేదు. భవిష్యత్తులో ఇది ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నాం. రామ్‌చరణ్‌ తర్వాతి ప్రాజెక్ట్‌ను అతి త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తాం" అని పీఆర్‌ శివచెర్రీ ట్వీట్‌ చేశాడు.

గతేడాది దసరా సందర్భంగా జెర్సీ డైరెక్టర్‌ గౌతమ్‌ తిన్ననూరి ఈ ప్రాజెక్ట్‌ను అనౌన్స్‌ చేశాడు. మీతో పనిచేసే అవకాశం ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదు.. థ్యాంక్యూ సర్‌ అంటూ రామ్‌చరణ్‌ను ఉద్దేశించి గౌతమ్‌ ట్వీట్‌ చేశాడు. ఈ సినిమాను ఎన్‌వీఆర్‌ సినిమా, యూవీ క్రియేషన్స్‌ బ్యానర్ల కింద నిర్మించాల్సి ఉంది. అయితే ఇప్పుడీ సినిమా అటకెక్కడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. అయితే ఈ సినిమా ఆగిపోయిన విషయాన్ని గౌతమ్‌ టీమ్‌ మాత్రం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.