తెలుగు న్యూస్  /  Entertainment  /  Ravi Teja Ravanasura Ott Date Release Advanced When And Where To Watch

Ravanasura OTT Release date: రావణాసుర ఓటీటీ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్.. ఓ వారం ముందుగానే రానున్న సినిమా

16 April 2023, 19:17 IST

    • Ravanasura OTT Release date: మాస్ మహారాజా రవితేజ నటించిన రావణాసుర మూవీ అనుకున్న సమయం కంటే ఓ వారం ముందుగానే రానుంది. తొలుత మే రెండో వారంలో విడుదల చేయాలని భావించగా.. అంతకంటే ఓ వారం ముందుగానే ఈ సినిమా రానుంది.
రావణాసుర ఓటీటీ అప్డేట్
రావణాసుర ఓటీటీ అప్డేట్

రావణాసుర ఓటీటీ అప్డేట్

Ravanasura OTT Release date: మాస్ మాహారాజా రవితేజ నటించిన రావణాసుర సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ నెగెటివ్ పర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులు పడుతున్నప్పటికీ మూవీపై మాత్రం మిక్స్‌డ్ టాక్ వచ్చింది. విడుదలైన మొదటి వారంలో ఓ మాదిరి వసూళ్లతో ఫర్వాలేదనిపించినప్పటికీ.. రెండో వారానికి వచ్చేసరికి కలెక్షన్లు బాగా దిగజారాయి. దీంతో నష్టం నుంచి పూడ్చుకునేందుకు నిర్మాతలు ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగా సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

HHVM Director: క్రిష్‌ను ప‌క్క‌న‌పెట్టేశారు - హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు కొత్త డైరెక్ట‌ర్ ఇత‌డే - అనౌన్స్‌చేసిన మేక‌ర్స్‌

Pradeep Ranganathan: లవ్ టుడే కాంబో రిపీట్.. దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా కొత్త మూవీ.. మరి డైరెక్టర్ ఎవరంటే?

Pawan Kalyan Hhvm Teaser: దొంగ దొర‌ల లెక్క‌ల‌ను స‌రిచేసే యోధుడు - ప‌వ‌న్ క‌ళ్యాణ్ హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు టీజ‌ర్ రిలీజ్‌

OTT: ఓటీటీలోకి 3 రోజుల్లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ.. 5 భాషల్లో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

రావణాసుర చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మంచి ఫ్యాన్సీ ధరకు ఈ మూవీ డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. అంతేకాకుండా మేకర్స్ సినిమా విడుదలైన ఆరు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేయాలని భావించారు. దీంతో మే రెండో వారంలో ఓటీటీలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే మూవీకి మిక్స్‌డ్ టాక్ రావడంతో సినిమాను అనుకున్న సమయం కంటే ముందుగానే ఓటీటీలో అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు ఫిల్మ్ వర్గాల సమాచారం.

ఇండస్ట్రీ వర్గాల ప్రకారం రావణాసుర మూవీని ఓటీటీలో అనుకున్న సమయం కంటే ఓ వారం ముందుగానే తీసుకురానున్నారట. మే మొదటి వారంలోనే ఈ చిత్రాన్ని ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ విషయంపై చిత్రబృందం నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

తొలిసారిగా రవితేజ నెగెటివ్ రోల్‌ చేసిన ఈ సినిమాలో అతడి నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందాయి. కానీ మాస్ మహారాజా తరహా వినోదాన్ని మాత్రం ఆడియెన్స్ మిస్ కావడంతో సినిమాపై ప్రతీకూల ప్రభావం చూపింది. ధమాకా లాంటి సూపర్ సక్సెస్ తర్వాత ఈ సినిమా కూడా ఆ స్థాయిలో ఉంటుందని ఆశించిన వారికి నిరాశే మిగిలింది.

అభిషేక్ పిక్చర్స్, రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్లపై తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హర్షన్ వర్ధన్ రామేశ్వర్-భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూర్చారు. సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో అను ఇమ్మాన్యూయేల్, ఫరియా అబ్దుల్లా, దక్ష నాగర్కర్, పూజిత పొన్నాడ, మేఘ ఆకాష్ కీలక పాత్రలు పోషించారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.