Sudheer Varma on Ravanasura: 'రావణాసుర'లో హీరోయిన్ లేదు.. సినిమా చూసి ఆడియెన్స్ షాక్ అవుతారు.. డైరెక్టర్ సుధీర్ స్పష్టం-sudheer varma says audience will shock after watching ravanasura movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Sudheer Varma Says Audience Will Shock After Watching Ravanasura Movie

Sudheer Varma on Ravanasura: 'రావణాసుర'లో హీరోయిన్ లేదు.. సినిమా చూసి ఆడియెన్స్ షాక్ అవుతారు.. డైరెక్టర్ సుధీర్ స్పష్టం

Maragani Govardhan HT Telugu
Apr 05, 2023 05:55 AM IST

Sudheer Varma on Ravanasura: మాస్ మహారాజా రవితేజతో టాలీవుడ్ దర్శకుడు సుధీర్ వర్మ రావణాసుర అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధీర్ వర్మ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

డైరెక్టర్ సుధీర్ వర్మ
డైరెక్టర్ సుధీర్ వర్మ

Sudheer Varma on Ravanasura: మాస్ మహారాజా మూవీ రవితేజ హీరోగా నటించిన థ్రిల్లర్ చిత్రం రావణాసుర. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుశాంత్ కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ విడుదలై ప్రేక్షకుల్లో అంచనాలను భారీగా పెంచేశాయి. వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియజేశారు దర్శకుడు సుధీర్ వర్మ.

"ఈ సినిమా కథ గురించి కొంచెం కూడా బయటకు రివీల్ చేయదలచుకోలేదు. ఎందుకంటే ఇందులో ఎన్నో షాకింగ్స్, థ్రిల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. థియేటర్లలో ఆడియెన్స్ మంచి సర్‌ప్రైజ్‌గా ఉంటుంది. ఆ ఎక్సయిట్మెంట్‌ను ప్రేక్షకులకు దూరం చేయకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ కారణంతోనే తమిళం, మలయాళంలోనూ ఒకే సారి విడుదల చేయట్లేదు. ఎందుకంటే రిలీజ్‌కు 15 రోజుల ముందే వారికి కాపీ పంపించాలి. సర్‌ప్రైజ్‌లు రివీల్ అవుతాయని తెలుగులో విడుదలైన ఓ వారం తర్వాత ఆ భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాం." అని సుధీర్ తెలిపారు.

హీరో గ్రే షేడ్ పాత్ర గురించి మాట్లాడుతూ.. "మన సినిమాల్లో కథానాయకుడు నెగిటివ్ క్యారెక్టర్‌లో కనిపించడం కొత్తేమి కాదు. అంతంలో నాగార్జున, సత్యలో జేడీ ఇవ్వన్నీ గ్రే షేడ్ పాత్రలే కదా. కాకపోతే ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ లేదు. కానీ చాలా మంది నటించారు. ప్రతి పాత్ర కథలో కీలకంగా ఉంటుంది. రవితేజ పర్ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నా విజన్‌కు బెటర్‌గానే ఆయన నటించారు. ఇది కంప్లీట్‌గా రవితేజగారి సినిమా." అని స్పష్టం చేశారు.

పవన్ కల్యాణ్‌తో సినిమా చేస్తున్నారనే వార్తలపై సుధీర్ వర్మ సానుకూలంగా స్పందించారు. ఆ సినిమా త్రివిక్రమ్ కథతో ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయంపై త్వరలోనే తెలుస్తుందని సమాధానమిచ్చారు.

అభిషేక్ పిక్చర్స్, రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్లపై తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. హర్షన్ వర్ధన్ రామేశ్వర్-భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూరుస్తున్నారు. సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రావణాసుర సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం ప్రణాళికను సిద్ధం చేస్తోంది.

WhatsApp channel

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.