తెలుగు న్యూస్  /  Entertainment  /  Rashmika Mandanna And Vijay Deverakonda Return To Mumbai From Maldives

Rashmika Vijay return to Mumbai: మాల్దీవుల నుంచి తిరిగొచ్చిన రష్మిక, విజయ్‌

HT Telugu Desk HT Telugu

11 October 2022, 21:24 IST

    • Rashmika Vijay return to Mumbai: మాల్దీవుల నుంచి తిరిగొచ్చింది టాలీవుడ్‌ ప్రేమజంట రష్మిక మందన్నా, విజయ్‌ దేవరకొండ. ఈ లవ్‌ కపుల్‌ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో మంగళవారం (అక్టోబర్‌ 11) ల్యాండయ్యారు.
ముంబై ఎయిర్ పోర్ట్ లో విజయ్ దేవరకొండ
ముంబై ఎయిర్ పోర్ట్ లో విజయ్ దేవరకొండ

ముంబై ఎయిర్ పోర్ట్ లో విజయ్ దేవరకొండ

Rashmika Vijay return to Mumbai: నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా, పాన్‌ ఇండియా స్టార్‌ విజయ్‌ దేవరకొండ ఎంతో కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలుసు కదా. ఈ వార్తలను వాళ్లు ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదు. అలాగని తమ మధ్య అలాంటిదేమీ లేదని చెప్పనూ లేదు. అయితే తొలిసారి ఈ రిలేషన్‌షిప్‌ నిజమే అనిపించేలా ఇద్దరూ కలిసి మాల్దీవుల టూర్‌కు వెళ్లారు.

ట్రెండింగ్ వార్తలు

NNS 29th April Episode: ​​మిస్సమ్మను క్షమించేదే లేదంటున్న పిల్లలు.. భాగీని ఆశీర్వదించిన అమర్​.. షాక్​లో మనోహరి!

Pranaya Vilasam OTT Release Date: ఓటీటీలోకి ప్రేమలు హీరోయిన్ నటించిన మరో సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడాలంటే..

Dhanraj: ఆ దర్శకులందరూ నా గురువులే.. అతను లేకుంటే డైరెక్టర్ అయ్యేవాన్ని కాదు: జబర్దస్త్ ధన్‌రాజ్

Manjummel Boys OTT release date: ఈ వారమే ఓటీటీలోకి అడుగుపెడుతున్న మలయాళ సూపర్ హిట్ సర్వైవల్ థ్రిల్లర్

ఇద్దరూ కలిసి కనిపించకపోయినా.. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఒకరి తర్వాత మరొకరు కెమెరాకు చిక్కారు. ఆ వీడియోలు తెగ వైరల్‌ అయ్యాయి. ఇక ఇప్పుడు ఆ టూర్‌ను ముగించుకొని తిరిగి వచ్చారు. మంగళవారం (అక్టోబర్‌ 11) మరోసారి ముంబై ఎయిర్‌పోర్ట్‌లోనే వీళ్లు కనిపించారు. ఈసారి కూడా వేర్వేరుగానే ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటకు వచ్చారు.

వైట్‌ ట్రాక్‌సూట్‌లో రష్మిక కనిపించగా.. విజయ్‌ తనదైన స్టైల్లో ఓ వెరైటీ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ప్రింటెడ్‌ షర్ట్‌, బ్లాక్‌ బ్యాగీ ట్రౌజర్‌లో దర్శనమిచ్చాడు. ముంబైలో విజయ్‌ బుధవారం ఓ ఈవెంట్‌లో పాల్గొనాల్సి ఉంది. ఈ ఇద్దరూ ఒకే సమయానికి ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించడంతో మాల్దీవ్స్‌ టూర్‌ను కలిసే ఎంజాయ్‌ చేశారన్న సందేహం మరింత బలపడింది.

వీళ్లు కలిసి దిగిన ఫొటోలను షేర్‌ చేయకపోయినా.. రష్మిక మాత్రం మాల్దీవులకు వెళ్లిన తొలి రోజు నుంచే ప్రతి రోజూ ఇన్‌స్టాలో ఫొటోలు షేర్‌ చేస్తూనే ఉంది. మంగళవారం కూడా ఓ ఫ్లోరల్‌ డ్రెస్‌లో ఉన్న ఫొటో పోస్ట్‌ చేసింది. "అత్యవసరమైన బ్రేక్‌ ముగింపుకు వచ్చేసింది. ఈ ప్లేస్‌కు గుడ్‌బై చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు" అని రష్మిక చెప్పింది. అటు విజయ్‌ మాత్రం ఈ టూర్‌కు సంబంధించిన ఎలాంటి ఫొటోలను బయటపెట్టలేదు.

ప్రస్తుతం రష్మిక వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈ మధ్యే బాలీవుడ్‌లో ఆమె నటించిన గుడ్‌బై మూవీ రిలీజైనా అది నిరాశ పరిచింది. ఇక ఆమె మిషన్‌ మజ్నూ, యానిమల్‌ సినిమాలతోపాటు దళపతి విజయ్‌ నటిస్తున్న వారసుడులోనూ నటిస్తోంది. అటు విజయ్‌ తన తర్వాతి మూవీ ఖుషీలో సమంతతో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది డిసెంబర్‌ 26న మూవీ రిలీజ్‌ కానుంది.

<p>ముంబై ఎయిర్ పోర్ట్ లో రష్మిక మందన్నా</p>
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.