తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pranaya Vilasam Ott Release Date: ఓటీటీలోకి ప్రేమలు హీరోయిన్ నటించిన మరో సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడాలంటే..

Pranaya Vilasam OTT Release Date: ఓటీటీలోకి ప్రేమలు హీరోయిన్ నటించిన మరో సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడాలంటే..

Hari Prasad S HT Telugu

29 April 2024, 11:37 IST

    • Pranaya Vilasam OTT Release Date: ఓటీటీలోకి మరో సూపర్ హిట్ మలయాళం మూవీ రాబోతోంది. ప్రేమలు హీరోయిన్ మమితా బైజు నటించిన ప్రణయ విలాసం మూవీ ఈ వారమే స్ట్రీమింగ్ కానుంది.
ఓటీటీలోకి ప్రేమలు హీరోయిన్ నటించిన మరో సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడాలంటే..
ఓటీటీలోకి ప్రేమలు హీరోయిన్ నటించిన మరో సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడాలంటే..

ఓటీటీలోకి ప్రేమలు హీరోయిన్ నటించిన మరో సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడాలంటే..

Pranaya Vilasam OTT Release Date: ఓటీటీలోకి మరో సూపర్ హిట్ మలయాళం మూవీ రానుంది. గతేడాది రిలీజైన ప్రణయ విలాసం మూవీని ఈ వారంలోనే స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈటీవీ విన్ (ETV win) ఓటీటీ సోమవారం (ఏప్రిల్ 29) అనౌన్స్ చేసింది. ఈ సినిమాలో ప్రేమలు హీరోయిన్ మమితా బైజు నటించడం విశేషం.

ట్రెండింగ్ వార్తలు

NNS May 15th Episode: బెడిసికొట్టిన మనోహరి ప్లాన్​- ఒక్కటైన అమర్​, భాగీ- తప్పించుకున్న సరస్వతి- నిజం తెలుసుకున్న అరుంధతి

Sudigali Sudheer: బుల్లితెర‌పైకి సుడిగాలి సుధీర్ రీఎంట్రీ - కొత్త షోకు గ్రీన్‌సిగ్న‌ల్ - టైటిల్ ఇదే!

Vazhakku: హీరోతో గొడవ.. సినిమాను నేరుగా వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‍ఫామ్‍లో రిలీజ్ చేసిన డైరెక్టర్

Sharathulu Varthisthai OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

ప్రణయ విలాసం ఓటీటీ రిలీజ్ డేట్

ప్రణయ విలాసం మూవీని వచ్చే గురువారం (మే 2) నుంచి తమ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈటీవీ విన్ వెల్లడించింది. చాలా రోజులుగా మీరు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఇదే అంటూ ఈ విషయాని చెప్పింది. "మీ డైరెక్ట్ మెసేజ్‌లు, ప్రశ్నలకు ఇదే మా సమాధానం. తొలి ప్రేమనే ప్రతి ఒక్కరి మనసుల్లో చిరకాలం నిలిచిపోయే ప్రేమగా చెబుతారు. ప్రణయ విలాసం మే 2 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది" అనే క్యాప్షన్ తో ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

ప్రేమలు మూవీతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న నటి మమితా బైజు ఈ సినిమాలో హీరోయిన్ కావడం విశేషం. గతేడాది ఫిబ్రవరి 24న థియేటర్లలో ఈ సినిమా రిలీజైంది. చాలా తక్కువ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా పది రోజుల్లోనే కేరళ బాక్సాఫీస్ దగ్గర రూ.2.05 కోట్లు వసూలు చేసింది. ఈ మూవీలో అర్జున్ అశోక్ మేల్ లీడ్ గా నటించాడు.

ఏంటీ ప్రణయ విలాసం మూవీ?

భిన్నమైన కథలతో సినిమా ప్రేక్షకులను అలరించే మలయాళ మూవీ మేకర్స్ నుంచి వచ్చిన మూవీ ప్రణయ విలాసం. తొలి ప్రేమే నిజమైన ప్రేమ.. ఆ ప్రేమే శాశ్వతంగా నిలిచిపోతుంది అన్న సందేశాన్ని ఓ భిన్నమైన కథతో ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం ఈ సినిమా ద్వారా దర్శకుడు నిఖిల్ మురళీ చేశాడు. ఈ మూవీకి స్టోరీని జ్యోతిష్, సును ఏవీ అందించారు.

సూరజ్ (అర్జున్ అశోకన్), గోపికా (మమితా బైజు)ల లవ్ స్టోరీతోపాటు సూరజ్ తల్లిదండ్రుల తొలి ప్రేమలను ఈ సినిమాలో చూడొచ్చు. తన తల్లి తొలి ప్రేమను అర్థం చేసుకొని ఆమె మరణానంతరం తన చివరి కోరికను నెరవేర్చడానికి ప్రయత్నించే పాత్రలో అర్జున్ అశోకన్ నటించగా.. అతనికి అన్ని వేళలా తోడుగా ఉండే ప్రేయసి పాత్రలో మమితా కనిపించింది.

ప్రేమలు మూవీతో..

మమితా బైజు ఈ మధ్యే ప్రేమలు మూవీతో తెలుగు వారికి బాగా దగ్గరైన విషయం తెలిసిందే. ఈ సినిమా తెలుగులో రిలీజై అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ డబ్బింగ్ మూవీగా నిలిచింది. తర్వాత హాట్‌స్టార్, ఆహా ఓటీటీల్లోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆహాలో తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది.

మమితా క్యూట్ లుక్స్, ఆమె నటన ఎంతగానో నచ్చేసింది. రానున్న రోజుల్లో ఆమె నేరుగా తెలుగు తెరపైనా అడుగు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అంతకంటే ముందే ఆమె ప్రేమలు సీక్వెల్ ప్రేమలు 2 తో రానుంది. ఈ సీక్వెల్ ను కూడా మేకర్స్ ఈ మధ్యే అనౌన్స్ చేశారు. ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం