Manjummel Boys OTT release date: ఈ వారమే ఓటీటీలోకి అడుగుపెడుతున్న మలయాళ సూపర్ హిట్ సర్వైవల్ థ్రిల్లర్-malayalam survival thriller majummel boys to stream in ott this weekend disney plus hotstar to stream the movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Manjummel Boys Ott Release Date: ఈ వారమే ఓటీటీలోకి అడుగుపెడుతున్న మలయాళ సూపర్ హిట్ సర్వైవల్ థ్రిల్లర్

Manjummel Boys OTT release date: ఈ వారమే ఓటీటీలోకి అడుగుపెడుతున్న మలయాళ సూపర్ హిట్ సర్వైవల్ థ్రిల్లర్

Hari Prasad S HT Telugu
Apr 29, 2024 10:40 AM IST

Manjummel Boys OTT release date: మలయాళం సూపర్ డూపర్ హిట్ సర్వైవల్ థ్రిల్లర్ మంజుమ్మల్ బాయ్స్ ఈ వారమే ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది. వచ్చే ఆదివారం ఈ సినిమాను ఓటీటీలో చూడొచ్చు.

ఈ వారమే ఓటీటీలోకి అడుగుపెడుతున్న మలయాళ సూపర్ హిట్ సర్వైవల్ థ్రిల్లర్
ఈ వారమే ఓటీటీలోకి అడుగుపెడుతున్న మలయాళ సూపర్ హిట్ సర్వైవల్ థ్రిల్లర్

Manjummel Boys OTT release date: ఈ ఏడాది రిలీజై మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచిన మంజుమ్మల్ బాయ్స్ మూవీ మొత్తానికి ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది. ఈ విషయాన్ని గత శనివారమే (ఏప్రిల్ 26) డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అధికారికంగా వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే అందరూ ఊహించినట్లు మే 3 నుంచి కాకుండా మే 5 నుంచి మూవీ స్ట్రీమింగ్ కానుంది.

మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ డేట్

మంజుమ్మల్ బాయ్స్ ప్రపంచవ్యాప్తంగా రూ.235 కోట్లకుపైగా వసూళ్లతో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మలయాళం ఇండస్ట్రీలో తొలి రూ.200 కోట్ల వసూళ్ల సినిమా కూడా ఇదే. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం తెలుగు ప్రేక్షకులు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తెలుగులోనూ ఏప్రిల్ 6న రిలీజైన ఈ సినిమా రూ.12 కోట్లపైనే వసూలు చేసింది.

ఇక ఇప్పుడు వచ్చే ఆదివారం (మే 5) నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఆ మధ్య త్వరలోనే ఈ సినిమా రాబోతోందని చెప్పిన హాట్‌స్టార్.. గత శనివారం తేదీని కూడా అనౌన్స్ చేసింది. తెలుగు, మలయాళంతో మిగతా భాషల స్ట్రీమింగ్ కూడా ఇదే ఓటీటీలో కానుంది. గతంలో ప్రేమలు మూవీ తెలుగు వెర్షన్ మాత్రం ఆహాలో స్ట్రీమింగ్ అయిన విషయం తెలిసిందే.

హాట్‌స్టార్ మలయాళం మూవీస్

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్ ఓటీటీలో ఎన్నో సూపర్ హిట్ మలయాళం సినిమాలు ఇప్పటికే ఉన్నాయి. ఈ మధ్యే వచ్చిన ప్రేమలు కూడా అందులో ఒకటి. ఇదే కాకుండా అబ్రహం ఓజ్లర్, కన్నూరు స్క్వాడ్, కింగ్ ఆఫ్ కొత్త, ఫలిమి, నేరు, రోమాంచంలాంటి సినిమాలు కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు మంజుమ్మల్ బాయ్స్ కూడా రాబోతోంది.

నిజానికి ఈ సినిమా ఓటీటీ విషయంలో చాలా రోజులపాటు గందరగోళం నెలకొంది. ఓటీటీ హక్కుల కోసం మేకర్స్ భారీ మొత్తం డిమాండ్ చేయడంతో ఎవరూ ముందుకు రాలేదు. బాక్సాఫీస్ సక్సెస్ తో ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం రూ.20 కోట్లు డిమాండ్ చేసినా.. రూ.10 కోట్ల కంటే ఎక్కువ ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు.

చివరికి హాట్‌స్టారే ఈ సినిమా హక్కులను దక్కించుకుంది. దీంతో ఈ ఏడాది రిలీజైన టాప్ మలయాళం సినిమాల్లో ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్ రెండూ హాట్‌స్టార్ ఖాతాలోకే చేరాయి. ఇక అన్వేషిప్పిన్ కండెతుమ్ మూవీ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకోగా.. భ్రమయుగం మూవీ సోనీలివ్ ఓటీటీలో ఉంది. మలయాళం సినిమాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులు కూడా ఓటీటీల్లో ఈ సినిమాలను చూస్తున్నారు.

ఏంటీ మంజుమ్మల్ బాయ్స్?

మంజుమ్మల్ బాయ్స్ మూవీ ఓ రియల్ స్టోరీ. 2006లో జరిగిన నిజ జీవిత ఘటన ఆధారంగా తెరకెక్కించారు. ఆ ఏడాది కేరళకు చెందిన కొందరు యువకులు తమిళనాడులోని గుణ గుహలకు విహారయాత్రకు వస్తారు. అందులో ఒకరు ప్రమాదవశాత్తూ ఓ గుహలోకి పడిపోతారు. అతన్ని కాపడటానికి మిగిలిన స్నేహితులు చేసే ప్రయత్నాన్ని ఈ సినిమాలో చూపించారు. ఈ సర్వైవల్ థ్రిల్లర్ ను డైరెక్టర్ చిదంబరం తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంది.

IPL_Entry_Point