OTT Releases: ఈ వారం ఓటీటీలోకి 2 బ్లాక్ బస్టర్ సినిమాలు.. రెండూ డిఫరెంట్ జోనర్స్.. మొత్తంగా 16 స్ట్రీమింగ్.. ఎక్కడంటే?-ott movies releases on this week manjummel boys ott shaitaan ott streaming netflix disney plus hotstar amazon prime ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Releases: ఈ వారం ఓటీటీలోకి 2 బ్లాక్ బస్టర్ సినిమాలు.. రెండూ డిఫరెంట్ జోనర్స్.. మొత్తంగా 16 స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

OTT Releases: ఈ వారం ఓటీటీలోకి 2 బ్లాక్ బస్టర్ సినిమాలు.. రెండూ డిఫరెంట్ జోనర్స్.. మొత్తంగా 16 స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu
Published Apr 29, 2024 10:31 AM IST

OTT Movies Releases On This Week: ఎప్పటిలాగే కొత్త వారం వచ్చేసింది. అయితే ఈ వారంలో ఏప్రిల్ ముగుస్తుండగా.. మే నెల ప్రారంభం కానుంది. ఈ వారం రోజుల్లో ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏంటీ? వాటిలోని ప్రత్యేకతలేంటీ? వాటి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఏంటనే వివరాలు చూద్దాం.

ఈ వారం ఓటీటీలోకి 2 బ్లాక్ బస్టర్ సినిమాలు.. రెండూ డిఫరెంట్ జోనర్స్.. మొత్తంగా 16 స్ట్రీమింగ్.. ఎక్కడంటే?
ఈ వారం ఓటీటీలోకి 2 బ్లాక్ బస్టర్ సినిమాలు.. రెండూ డిఫరెంట్ జోనర్స్.. మొత్తంగా 16 స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

OTT Movies This Week: మళ్లీ కొత్త వారం వచ్చింది. సరికొత్తగా సినిమాలు, వెబ్ సిరీసులను తీసుక రానుంది. అయితే ఈ వారంతో ఏప్రిల్ ముగుస్తుండగా.. మే నెల ప్రారంభం కానుంది. ఈ వారంలో అటు థియేటర్, ఇటు ఓటీటీల్లలో సినిమాలు సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. థియేటర్లలో సుహాస్ నటించిన ప్రసన్నవదనం, సత్యదేవ్ కృష్ణమ్మ, జితెందర్ రెడ్డి వంటి చిన్న సినిమాలు విడుదల కానున్నాయి.

ఇక ఓటీటీలో ఈ ఏడు రోజుల్లో అంటే ఏప్రిల్ 22 నుంచి మే 5 వరకు సినిమాలు, సిరీసులు కలుపుకుని మొత్తంగా 16 స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో బ్లాక్ బస్టర్ హిట్ హారర్ మూవీ, మలయాళంలో కలెక్షన్ల సునామీ సృష్టించిన సర్వైవల్ థ్రిల్లర్ తదితర జోనర్ సినిమాలు ఆసక్తిగా ఉండనున్నాయి. మరి ఆ సినిమాలు.. వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో చూద్దాం.

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ

ది వెయిల్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 30

మంజుమ్మల్ బాయ్స్ (తెలుగు డబ్బింగ్ మూవీ)- మే 5

మాన్‌స్టర్స్ ఎట్ వర్క్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 5

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

అంబర్ గర్ల్స్ స్కూల్ (హిందీ వెబ్ సిరీస్)- మే 1

ది ఐడియా ఆఫ్ యూ (ఇంగ్లీష్ సినిమా)- మే 2

క్లార్క్ సన్ ఫార్మ్ సీజన్ 3 (ఇంగ్లీష్ మూవీ)- మే 3

ఉమన్ ఆఫ్ మై బిలియన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ మూవీ)- మే 3

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ఫియాస్కో (ఫ్రెంచ్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 30

టీ పీ బన్ (జపనీస్ వెబ్ సిరీస్)- మే 2

సైతాన్ (హిందీ చిత్రం)- మే 3

ది అటిపికల్ ఫ్యామిలీ (కొరియన్ వెబ్ సిరీస్)- మే 4

జియో సినిమా ఓటీటీ

మైగ్రేషన్ (ఇంగ్లీష్ చిత్రం)- మే 1

వోంకా (ఇంగ్లీష్ సినిమా)- మే 3

ది టాటూయిస్ట్ ఆఫ్ అస్విట్జ్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 3

హ్యాక్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 3

ఆపిల్ ప్లస్ టీవీ

అకాపుల్కో సీజన్ 3 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 1

2 మాత్రమే

ఇలా ఈ వారం మొత్తం 16 ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో ఒక్క స్ట్రైట్ తెలుగు సినిమా లేకపోవడం గమనార్హం. కానీ, బాలీవుడ్‌లో బాక్సాఫీస్ కలెక్షన్స్ భారీగా కొల్లగొట్టిన బ్లాక్ బస్టర్ హారర్ సినిమా సైతాన్, మలయాళంలో సూపర్ హిట్ కొట్టిన సర్వైవల్ థ్రిల్లర్ సినిమా మంజుమ్మల్ బాయ్స్ రెండు మాత్రమే స్పెషల్ కానున్నాయి. మంజుమ్మల్ బాయ్స్ హాట్‌స్టార్‌లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ కానుంది. ఇక మే 3 శుక్రవారం 6 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి.

Whats_app_banner