తెలుగు న్యూస్  /  Entertainment  /  Rashmika Clarity On Rumours With Vijay Deverakonada

Rashmika Mandanna: అందరికీ నా పర్సనల్ లైఫ్ గురించే చర్చ.. రూమర్లపై రష్మిక స్పందన

10 August 2022, 6:02 IST

    • టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మికా మందన్నా.. విజయ్ దేవరకొండతో డేటింగ్ చేస్తుందని వస్తున్న వార్తలపై సదరు నటి స్పందించింది. తాను ఏడాదికి ఐదు సినిమాలు చేస్తున్నప్పటికీ ప్రజలు ఇంకా తన వ్యక్తిగత జీవితం గురించే మాట్లాడుతున్నారని తెలిపింది.
రష్మిక మందన్నా
రష్మిక మందన్నా (HT_PRINT)

రష్మిక మందన్నా

నేషనల్ క్రష్ రష్మికా మందన్నా క్రేజ్ ప్రస్తుతం మాములుగా లేదు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ భాష ఏదైనా ఈ ముద్దుగుమ్మ వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. తన సూపర్ స్మైల్, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫోకస్ అంతా కెరీర్‌పైనే పెట్టింది. అయితే రష్మిక వ్యక్తిగత జీవితం గురించి మాత్రం తరచూ ప్రశ్నలు వినిపిస్తూనే ఉన్నాయి. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో డేటింగ్ చేస్తుందని బయట సోషల్ మీడియా వేదికగా రూమర్లు గుప్పుమంటున్నప్పటికీ.. ఈ బ్యూటీ మాత్రం వాటిని అంగీకరించలేదు అలా అని ఖండించనూ లేదు. దీంతో నెటిజన్లు వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని ఫిక్స్ అయిపోతున్నారు. తాజాగా ఈ విషయంపై రష్మిక స్పందించింది.

"కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది. అరే యార్.. నేను ఏడాదికి ఐదు సినిమాలు చేస్తున్నా. కానీ ప్రజలు ఇప్పటికీ నువ్వు ఎవరితో డేటింగ్ చేస్తున్నావ్? మీ వ్యక్తిగత జీవితం గురించి చెప్పండి? అనే ప్రశ్నలనే అడుగుతున్నారు. అయితే మేము నటులమని, అందరి కళ్లు మా పైనే నేను అర్థం చేసుకున్నారు. ప్రజలు మా గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారు. అయితే వెనక్కి తిరిగి చూసుకుంటే నా కెరీర్ ప్రారంభం నుంచి ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. నటీ నటులు లైమ్ లైట్‌లో ఉన్నారు కాబట్టి మీరు వారి గురించి మాట్లాడవచ్చు. అయితే నా వరకు వస్తే నేనుగా చెప్పేంత వరకు ఎలాంటి నిర్ధారణకు వెళ్లవద్దని అందరికీ చెప్పాలనుకుంటున్నాను" అని రష్మిక స్పష్టం చేసింది.

విజయ్ దేవరకొండతో రష్మికా లవ్ ఎఫైర్ గురించి ఇటీవల కాలంలో వార్తలు వేగంగా వ్యాపిస్తున్నాయి. కాఫీ విత్ కరణ్ షోలోనూ విజయ్.. ఈ అంశంపై స్పందించిన విజయ్ కూడా ఖండిస్తున్నట్లు బలంగా చెప్పలేదు. ఇదే విషయంపై రష్మికా కూడా తనదైన శైలిలో స్పందించింది.

"ఈ విషయం నాకు చాలా నవ్వు తెప్పిస్తుంది. నేను ఆ ఎపిసోడ్‌లో సంభాషణలను చూశాను. ఆ సమయంలో అయ్యో ఏంటి ఆశ్చర్యపోయినప్పటికీ అది కేవలం ఓ సంభాషణే కదా అని భావించాను. అంతేకానీ పెళ్లి చేసుకోవాల్సిన విషయం కాదు. ఓకే ఇది వారు సరదాగా మాట్లాడుకునే విషయం కాబట్టి అలాగే మాట్లాడుకోనిద్దాం" అని రష్మిక తెలిపింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.