తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ram Charan At Golden Globe: మార్వెల్‌లో అవకాశమొస్తే చేస్తా.. గోల్డెన్ గ్లోబ్ వేదికపై రామ్ చరణ్ స్పష్టం

Ram Charan at Golden Globe: మార్వెల్‌లో అవకాశమొస్తే చేస్తా.. గోల్డెన్ గ్లోబ్ వేదికపై రామ్ చరణ్ స్పష్టం

11 January 2023, 11:35 IST

    • Ram Charan at Golden Globe: రామ్ చరణ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా వెరైటీ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మార్వెల్‌లో అవకాశమొస్తే చేస్తానని స్పష్టం చేశారు.
రామ్ చరణ్
రామ్ చరణ్

రామ్ చరణ్

Ram Charan at Golden Globe: 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల(Golden Globe Awards) ప్రదానోత్సవం అమెరికాలోని కాలిఫోర్నియా బెవర్లీ హిల్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ఆర్ఆర్ చిత్రం బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌ను సొంతం చేసుకుంది. ఈ వేడుకకు ముందు రెడ్ కార్పెట్‌గా ఆర్ఆర్ఆర్ టీమ్ సందడి చేసింది. జూనియర్ ఎన్‌టీఆర్, రామ్ చరణ్, ఎస్ఎస్ రాజమౌళి, కీరవాణీ తమ కుటుంబ సమేతంగా విచ్చేశారు. ఇందులో భాగంగా జరిగిన ప్రీ డిజిటల్ షోలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ స్టైలిష్ లుక్‌లో కనిపించారు.

ట్రెండింగ్ వార్తలు

Prithviraj Sukumaran: ‘సలార్’పై ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన పృథ్విరాజ్ సుకుమారన్.. ఎగ్జైట్ అవుతున్న ఫ్యాన్స్

Janhvi Kapoor: తిరుపతిలో పహారియాతో జాన్వీ కపూర్ పెళ్లి అంటూ రూమర్.. స్పందించిన హీరోయిన్

Rajamouli: అలాంటి సినిమా తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా.. చేస్తా: రాజమౌళి.. ఆర్ఆర్ఆర్‌పై ఆ ప్రశ్నకు నో కామెంట్

Netflix OTT top movies: నెట్‍ఫ్లిక్స్‌లో టాప్‍కు దూసుకొచ్చేసిన హారర్ థ్రిల్లర్ సినిమా.. రెండో ప్లేస్‍లో కామెడీ మూవీ

ఈ వేడుకకు ముందు రామ్ చరణ్ వెరైటీ మ్యాగజైన్‌కు చెందిన మార్క్ మాల్కిన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. మార్వెల్ స్టూడియోస్ నుంచి కాల్ వస్తే చేస్తారా అని అడుగ్గా.. తప్పకుండా అంటూ రామ్ చరణ్ బదులిచ్చారు. ఇండియన్ సూపర్ హీరోగా చేయమంటే ఎందుకు చేయను? తప్పకుండా చేస్తాను? అని బదులిచ్చారు.

అంతేకాకుండా ఫేవరెట్ సూపర్ హీరో ఎవరు? అని అడిగిన ప్రశ్నకు టోనీ స్టార్క్ అంటూ బదులిచ్చారు చరణ్. ఇండియాలోనే ఎంతో అద్భుతమైన సూపర్ హీరోలు ఉన్నారని, వారిని ఇక్కడకు ఎందుకు తీసుకురాకూడదు అని అన్నారు.

నాటు నాటు పాట చిత్రీకరణలో ఎవరు ఎక్కువగా గాయపడ్డారు అనే ప్రశ్నకు రామ్ చరణ్ ఆసక్తికర సమాధానాన్ని ఇచ్చారు. "దాని గురించి ఇక్కడ మాట్లాడటానికి ఇప్పటికీ నా మోకాళ్లు వణుకుతున్నాయి. అయినా చేశాం. అది అందమైన టార్చర్. ఆ కష్టం, క్రమశిక్షణే మమ్మల్ని ఇక్కడ వరకు నడిపించాయి. ఇక్కడ అందరి ముందు నిలుచుని మాట్లాడతున్నామంటే అందుకు అదే కారణం." అని చరణ్ తెలిపారు.

ఆర్ఆర్ఆర్‌కు గోల్డెన్ గ్లోబ్ పురస్కారం రావడంతో పలువురు సినీ ప్రముఖులు చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా మెగాస్టార్ చిరంజీవీ స్పందిస్తూ.. "గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్న ఎంఎం కీరవాణిగారికి వందనాలు. చరిత్ర సృష్టించిన ఆర్ఆర్ఆర్ టీమ్, రాజమౌళికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నాటు నాటు పాటను చూసి ఇండియా గర్వపడుుతంది." అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. "ఇదో అద్భుతం.. నమ్మశక్యం కానిది.. ఇండియా తరఫున.. భారత అభిమానుల తరఫున కీరవాణి గారికి శుభాకాంక్షలు. అలాగే రాజమౌళి గారికి, ఆర్ఆర్ఆర్ టీమ్‌కు కంగ్రాట్స్" అంటూ ఏఆర్ రెహమాన్ పోస్ట్ పెట్టారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.