తెలుగు న్యూస్  /  Entertainment  /  Ram Charan Attends Sharwanand Engagement Photos Viral On Social Media

Sharwanand Engagement: వైర‌ల్ అవుతోన్న శ‌ర్వానంద్ ఎంగేజ్‌మెంట్ ఫొటోలు - వేడుక‌కు హాజ‌రైన రామ్‌చ‌ర‌ణ్‌

26 January 2023, 12:09 IST

  • Sharwanand Engagement: టాలీవుడ్ యంగ్ హీరో శ‌ర్వానంద్ నిశ్చితార్థం ర‌క్షితా రెడ్డితో గురువారం జ‌రిగింది. శ‌ర్వానంద్ ఎంగేజ్‌మెంట్‌కు టాలీవుడ్ అగ్ర హీరో రామ్‌చ‌ర‌ణ్ హాజ‌ర‌య్యాడు.

రామ్‌చ‌ర‌ణ్‌, శ‌ర్వానంద్‌, ర‌క్షితా రెడ్డి, ఉపాస‌న‌
రామ్‌చ‌ర‌ణ్‌, శ‌ర్వానంద్‌, ర‌క్షితా రెడ్డి, ఉపాస‌న‌

రామ్‌చ‌ర‌ణ్‌, శ‌ర్వానంద్‌, ర‌క్షితా రెడ్డి, ఉపాస‌న‌

టాలీవుడ్ యంగ్ హీరో శ‌ర్వానంద్ త్వ‌ర‌లోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. గురువారం ర‌క్షితారెడ్డితో అత‌డి నిశ్చితార్థం జ‌రిగింది. ఈ ఎంగేజ్‌మెంట్ వేడుక‌కు రామ్‌చ‌ర‌ణ్ హాజ‌ర‌య్యాడు. భార్య ఉపాస‌న‌తో పాటు నిశ్చితార్థ వేడుక‌లో రామ్‌చ‌ర‌ణ్ పాల్గొన్నాడు. కాబోయే నూత‌న దంప‌తులు శ‌ర్వానంద్‌, ర‌క్షితారెడ్డిల‌తో రామ్‌చ‌ర‌ణ్, ఉపాస‌న దిగిన ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ట్రెండింగ్ వార్తలు

Hollywood Thrillers on OTT: ఓటీటీల్లోని ఈ హాలీవుడ్ థ్రిల్లర్స్ చూశారా? అసలు థ్రిల్ అంటే ఏంటో తెలుస్తుంది

Panchayat 3 OTT Release Date: సస్పెన్స్‌కు తెరపడింది.. పంచాయత్ 3 ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే

Pushpa 2 first single: యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్న పుష్ప 2 ఫస్ట్ సింగిల్.. వరల్డ్ వైడ్ నంబర్ వన్

SS Rajamouli's Bahubali: ఓటీటీలోకి బాహుబలి సరికొత్త కథ.. కట్టప్పే విలన్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

సినిమాల్లోకి రాక‌ముందు నుంచి రామ్‌చ‌ర‌ణ్, శ‌ర్వానంద్ మ‌ధ్య స్నేహం ఉంది. ఆ స్నేహ బంధాన్ని దృష్టిలో పెట్టుకొని శ‌ర్వానంద్ ఎంగేజ్‌మెంట్‌కు రామ్‌చ‌ర‌ణ్ హాజ‌ర‌య్యాడు.

కాగా శ‌ర్వానంద్‌కు కాబోయే భార్య ర‌క్షితారెడ్డి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ప‌నిచేస్తున్న‌ట్లు స‌మాచారం. హైకోర్ట్ లాయ‌ర్‌ మ‌ధుసూద‌న్ రెడ్డి కూతుర‌ని స‌మాచారం. ఏపీ మాజీ మంత్రి బొజ్జ‌ల గోపాల‌కృష్ణ‌రెడ్డికి ర‌క్షితారెడ్డి మ‌న‌వ‌రాలు అవుతుంద‌ని చెబుతున్నారు.

చాలా రోజులుగా ర‌క్షితా రెడ్డితో శ‌ర్వానంద్‌కు ప‌రిచ‌యం ఉన్న‌ట్లు చెబుతున్నారు. వీరిది పెద్ద‌లు కుదిర్చిన ప్రేమ వివాహ‌మ‌ని చెబుతున్నారు. త్వ‌ర‌లోనే శ‌ర్వానంద్‌, ర‌క్షితారెడ్డి పెళ్లి జ‌రుగ‌నున్న‌ట్లు తెలిసింది. ఇటీవ‌లే ఒకే ఒక జీవితం సినిమా క‌మ‌ర్షియ‌ల్ హిట్‌ను అందుకున్నాడు శ‌ర్వానంద్‌.

ప్ర‌స్తుతం ద‌ర్శ‌కుడు కృష్ణ చైత‌న్య‌తో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే శ్రీరామ్ ఆదిత్య శ‌ర్వానంద్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్క‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.