తెలుగు న్యూస్  /  Entertainment  /  Rakul Preet Singh Chhatriwali Movie To Stream On Zee Ott On This Date

Chhatriwali OTT Release Date: సెక్స్ ఎడ్యుకేష‌న్‌పై ర‌కుల్ సినిమా - డైరెక్ట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్‌

05 January 2023, 11:53 IST

  • Chhatriwali OTT Release Date:ర‌కుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ సినిమా ఛ‌త్రీవాలి డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కాబోతున్న‌ది. ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందంటే...

ర‌కుల్ ప్రీత్ సింగ్
ర‌కుల్ ప్రీత్ సింగ్

ర‌కుల్ ప్రీత్ సింగ్

Chhatriwali OTT Release Date: ర‌కుల్ ప్రీత్ సింగ్ ఛ‌త్రీవాలి సినిమా థియేట‌ర్ల‌లో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీ ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది. జ‌న‌వ‌రి 20న ఈ సినిమా జీ5 ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‌ను సోష‌ల్ మీడియా ద్వారా ర‌కుల్ ప్రీత్‌సింగ్ వెల్ల‌డించింది సెక్స్ ఎడ్యుకేష‌న్ క్లాస్ జ‌న‌వ‌రి 20 నుంచి మొద‌లు అంటూ ఆమె షేర్ చేసిన మోష‌న్ పోస్ట‌ర్ ఆస‌క్తిని పంచుతోంది.

ట్రెండింగ్ వార్తలు

DeAr OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన డియర్ సినిమా.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్

Pokiri Trending: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ‘పోకిరి’ సినిమా.. ఎందుకో తెలుసా?

Samantha Next Movie: పుట్టిన రోజున గుడ్‍న్యూస్ చెప్పిన సమంత.. రీఎంట్రీ సినిమా ఫిక్స్.. ఇంట్రెస్టింగ్‍గా టైటిల్, పోస్టర్

Agent OTT: ఏజెంట్ సినిమాకు సంవత్సరం: ఓటీటీలోకి ఇంకెప్పుడు?

బోల్డ్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో కండోమ్ ఫ్యాక్ట‌రీలో క్వాలిటీ కంట్రోల్ విభాగంలో ప‌నిచేసే యువ‌తిగా ర‌కుల్ ప్రీత్‌సింగ్ క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. సెక్స్ ఎడ్యుకేష‌న్‌ విష‌యంలో స‌మాజంలో నెల‌కొన్న అపోహ‌ల‌పై పోరాడే యువ‌తిగా ర‌కుల్ ప్రీత్ సింగ్ క్యారెక్ట‌ర్ విభిన్నంగా ఉంటుంద‌ని స‌మాచారం.

ఛ‌త్రీవాలి సినిమాకు తేజాస్ డియోస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నారు. తొలుత ఛ‌త్రీవాలి సినిమా థియేట‌ర్ల‌లోనే రిలీజ్ చేయాల‌ని భావించారు. కానీ క‌రోనా కార‌ణంగా షూటింగ్ ఆల‌స్యం కావ‌డం, స‌రైన విడుద‌ల తేదీ దొర‌క‌డంలో ఇబ్బందులు ఎదుర‌వ్వ‌డంతో డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేస్తోన్న‌ట్లు స‌మాచారం.

ఛ‌త్రీవాలి సినిమాలో సుమీత్ వ్యాస్ హీరోగా న‌టిస్తోన్నాడు. కాగా గ‌త కొంత‌కాలంగా టాలీవుడ్‌కు దూరంగా ఉంటోంది ర‌కుల్ ప్రీత్‌సింగ్‌. బాలీవుడ్ సినిమాలైనే ఎక్కువ‌గా ఫోక‌స్ పెడుతోంది. హిందీలో వ‌రుస‌గా సినిమాల్ని అంగీక‌రిస్తోంది. ఇటీవ‌లే ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టించిన థాంక్ గాడ్ సినిమా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

త‌మిళంలో క‌మ‌ల్‌హాస‌న్‌, శంక‌ర్ క‌ల‌యిక‌లో రూపొందుతోన్న ఇండియ‌న్ -2 సినిమాలో ర‌కుల్‌ప్రీత్‌సింగ్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ది. మ‌రోవైపు ర‌కుల్‌ప్రీత్‌సింగ్ ఈ ఏడాది పెళ్లిపీట‌లెక్క‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. బాలీవుడ్ నిర్మాత‌, ప్రియుడు జాకీ భ‌గ్నానీతో ఏడ‌డుగులు వేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.