తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rashmika Mandanna Pushpa 2: పుష్ప సీక్వెల్ షూటింగ్‌లో ర‌ష్మిక మంద‌న్న జాయిన్ అయ్యేది ఎప్పుడంటే

Rashmika Mandanna Pushpa 2: పుష్ప సీక్వెల్ షూటింగ్‌లో ర‌ష్మిక మంద‌న్న జాయిన్ అయ్యేది ఎప్పుడంటే

22 January 2023, 17:03 IST

  • Rashmika Mandanna Pushpa 2: పుష్ప‌ -2 షూటింగ్‌లో ర‌ష్మిక మంద‌న్న అడుగుపెట్టిది ఎప్పుడో తెలిసిపోయింది. అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తోన్న ఈ సీక్వెల్‌కు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్న‌
అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్న‌

అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్న‌

Rashmika Mandanna Pushpa 2: ద‌క్షిణాదితో పాటు బాలీవుడ్‌లో వ‌రుస‌గా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ర‌ష్మిక మంద‌న్న‌(Rashmika Mandanna). గ‌త కొన్నాళ్లుగా హిందీ సినిమాల షూటింగ్స్‌, ప్ర‌మోష‌న్స్‌తో తీరిక లేకుండా గ‌డిపిన ఈ ముద్దుగుమ్మ త్వ‌ర‌లోనే పుష్ప- 2 సినిమా షూటింగ్ మొద‌లుపెట్ట‌బోతున్న‌ది.

ట్రెండింగ్ వార్తలు

Devara Release: దేవర సినిమా రిలీజ్ డేట్ మళ్లీ మారనుందా?

Geethanjali Malli Vachindi OTT: ఎట్టకేలకు స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషణ్ అందుకునేందుకు ముహూర్తం ఖరారు.. హాజరుకానున్న రామ్‍చరణ్

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో ఆవేశం మూవీ రికార్డు.. ఎన్ని కోట్లంటే.. మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్!

ఫిబ్ర‌వ‌రిలో ఈ సీక్వెల్ షూటింగ్‌లో జాయిన్ కానున్న‌ట్లు ఇటీవ‌ల ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో ర‌ష్మిక మంద‌న్న చెప్పింది. పుష్ప పార్ట్‌ వ‌న్‌లో శ్రీవ‌ల్లీగా ర‌ష్మిక మంద‌న్న క్యారెక్ట‌ర్ అభిమానుల‌ను ఆక‌ట్టుకొంది. కంప్లీట్ డీ గ్లామ‌ర్ లుక్‌లో మెప్పించింది. సీక్వెల్‌లో ర‌ష్మిక‌ను ద‌ర్శ‌కుడు సుకుమార్ ఎలా చూపించ‌బోతున్నార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ప్ర‌స్తుతం పుష్ప -2 షూటింగ్ వైజాగ్‌లో జ‌రుగుతోంది.

వైజాగ్ హార్బ‌ర్ ఏరియాలో హీరో అల్లు అర్జున్‌పై (Allu Arjun) ద‌ర్శ‌కుడు సుకుమార్ కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తోన్నారు. ఇటీవ‌లే ప్రారంభ‌మైన ఈ షెడ్యూల్ దాదాపు ప‌ది రోజుల పాటు కొన‌సాగ‌నున్న‌ట్లు స‌మాచారం.

ఈ సీక్వెల్‌లో జ‌గ‌ప‌తిబాబు న‌టించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఫ‌హాద్ ఫాజిల్‌తో పాటు జ‌గ‌ప‌తిబాబు క్యారెక్ట‌ర్ నెగెటివ్ షేడ్స్‌లో సాగ‌నున్న‌ట్లు చెబుతున్నారు. 2021లో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన పుష్ప పార్ట్ వ‌న్ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద 400 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. దాంతో ఈ సీక్వెల్‌పై భారీగా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

పాన్ ఇండియ‌న్ లెవ‌ల్‌లో సినీ అభిమానులు పుష్ప -2 కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తోన్నారు. ఇందులో పుష్ప‌రాజ్ అనే ఎర్ర‌చంద‌నం అక్ర‌మ‌ర‌వాణా చేసే సిండికేట్ నాయ‌కుడిగా అల్లు అర్జున్ న‌టిస్తున్నారు. . పుష్ప -2 సినిమాకు దేవిశ్రీప్ర‌సాద్ సంగీతాన్ని అందిస్తోన్నాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.