తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2 Collection: ఒక్కరోజులో 55 శాతం తగ్గిన పుష్ప 2 కలెక్షన్స్- 5 రోజుల్లో 900 కోట్లు- ప్రభాస్ కల్కి, స్త్రీ 2 అవుట్!

Pushpa 2 Collection: ఒక్కరోజులో 55 శాతం తగ్గిన పుష్ప 2 కలెక్షన్స్- 5 రోజుల్లో 900 కోట్లు- ప్రభాస్ కల్కి, స్త్రీ 2 అవుట్!

Sanjiv Kumar HT Telugu

10 December 2024, 10:48 IST

google News
  • Pushpa 2 The Rule 5 Days Worldwide Box Office Collection: అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కలెక్షన్లలో అరాచకం సృష్టిస్తోంది. ఇప్పటికే పుష్ప ది రూల్ నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ. 829 కోట్లు కలెక్ట్ చేయగా.. 5వ రోజు చేరేసరికి రూ. 900 కోట్లు దాటే అవకాశం ఉందని అంచనా వేశారు.

ఒక్కరోజులో 55 శాతం తగ్గిన పుష్ప 2 కలెక్షన్స్- 5 రోజుల్లో 900 కోట్లు- ప్రభాస్ కల్కి, స్త్రీ 2 అవుట్!
ఒక్కరోజులో 55 శాతం తగ్గిన పుష్ప 2 కలెక్షన్స్- 5 రోజుల్లో 900 కోట్లు- ప్రభాస్ కల్కి, స్త్రీ 2 అవుట్! (X (Twitter))

ఒక్కరోజులో 55 శాతం తగ్గిన పుష్ప 2 కలెక్షన్స్- 5 రోజుల్లో 900 కోట్లు- ప్రభాస్ కల్కి, స్త్రీ 2 అవుట్!

Pushpa 2 The Rule Box Office Collection Day 5: అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన సినిమా 'పుష్ప 2: ది రూల్'. 2021లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన 'పుష్ప: ది రైజ్'కు సీక్వెల్‌గా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 మూవీ తెరకెక్కింది. ఎన్నో అంచనాలతో డిసెంబర్ 5న విడుదలైన పుష్ప 2 మూవీ నాలుగు రోజుల్లో రూ. 829 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది.

54.56 శాతం తగ్గిన కలెక్షన్స్

ఇక ఐదో రోజు అయిన సోమవారం అన్ని సినిమాల మాదిరగానే పుష్ప 2 మూవీ కలెక్షన్స్ తగ్గాయి. ఇండియాలో ఆదివారంతో పోల్చుకుంటే సోమవారం (డిసెంబర్ 9) పుష్ప 2 నెట్ కలెక్షన్స్ 54.56 శాతం తగ్గినట్లు ప్రముఖ ట్రేడ్ సంస్థ సక్నిల్క్ తెలిపింది. అంటే, సుమారుగా 55 శాతం తగ్గినట్లు. అయితే, మొదటి ఆదివారం ఇండియాలో రూ. 141.05 కోట్లు వసూలు కాగా సోమవారం మాత్రం రూ. 64.1 కోట్లు మాత్రమే వచ్చాయి.

హిందీలోనే ఎక్కువగా

సోమవారం పుష్ప 2 సినిమా అన్ని భాషల్లో కలిపి రూ. 64.1 కోట్లు నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. వాటిలో తెలుగు నుంచి రూ. 14 కోట్లు, హిందీ బెల్ట్ ద్వారా రూ. 46 కోట్లు, తమిళం ద్వారా రూ. 3 కోట్లు, కన్నడలో రూ. 50 లక్షలు, మలయాళంలో రూ. 60 లక్షలుగా ఉన్నాయి. అంటే, తెలుగు కంటే హిందీ భాషలోనే ఎక్కువ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

ఇండియాలో 600 కోట్లకు దగ్గరిగా

ఇక ఇండియాలో ఈ యాక్షన్ డ్రామా మూవీ పుష్ప 2 ది రూల్ 5వ రోజు నాటికి సుమారు రూ. 593.1 కోట్లుగా నమోదయ్యాయి. అంటే, రూ. 600 కోట్లకు చేరువలో కలెక్షన్స్ ఉన్నాయి. పుష్ప 2కు వచ్చిన ఐదు రోజుల ఇండియా నెట్ కలెక్షన్స్‌లో తెలుగులో రూ. 211.7 కోట్లు, హిందీల నుంచి రూ. 331.7 కోట్లు, తమిళ వెర్షన్‌కు రూ. 34.45 కోట్లు, కన్నడలో రూ. 4.05 కోట్లు, మలయాళంలో రూ. 11.2 కోట్లు వసూలు అయింది.

వరల్డ్ వైడ్‌గా 900 కోట్లు

పుష్ప 2 5 డేస్ ఇండియా నెట్ కలెక్షన్స్‌లో కూడా తెలుగు కంటే హిందీలోనే ఎక్కువ ఉండట విశేషం. ఇక ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 ది రూల్ నాలుగు రోజుల్లో రూ. 829 కోట్లు కొల్లగొట్టగా.. ఐదో రోజు చేరుకునేసరికి వరల్డ్ వైడ్‌గా 900 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టినట్లు సినీ క్రిటిక్, ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా తన ఎక్స్ అకౌంట్‌లో ట్వీట్ చేశారు.

కల్కి ఫస్ట్ వీక్ కలెక్షన్స్

ఇలా ఐదు రోజుల్లో 900 కోట్లు కొల్లగొట్టిన పుష్ప 2 సినిమా వారం కాకముందే వెయ్యి కోట్లకుపైగా కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ మూవీ 2024లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటి. కల్కి మొదటి వారం ముగిసేసరికి రూ. 494.5 కోట్లు కలెక్ట్ చేసింది.

కల్కి 2898 ఏడీ, స్త్రీ 2 రికార్డ్స్ బ్రేక్

కానీ, పుష్ప 2 విడుదలైన నాలుగు రోజుల్లోనే 500 కోట్లకు మైలురాయిని దాటేసింది. ఇప్పుడున్న ట్రెండ్ ఇలాగే కొనసాగితే వారం రోజుల్లోనే పుష్ప 2 సినిమా రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది. ఇంకా, పుష్ప 2 ది రూల్ సినిమా 5వ రోజు నాటికి రూ. 900 కోట్లను అధిగమించినందున హిందీ భారీ బ్లాక్ బస్టర్ హారర్ కామెడీ మూవీ స్త్రీ 2 లైఫ్ టైమ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్‌ (రూ. 874.58 కోట్లు)ను అధిగమించింది. మరో రికార్డ్ ఖాతాలో వేసుకుంది.

తదుపరి వ్యాసం