OTT Release: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 19 సినిమాలు- 12 చాలా స్పెషల్, తెలుగులో 5- హారర్, యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్స్ జోనర్!
Today OTT Release Movies Telugu: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు నుంచి 19 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో 12 చాలా స్పెషల్‌గా ఉంటే, అందులో కేవలం ఐదు మాత్రమే తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అవన్నీ హారర్, క్రైమ్ థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్, యాక్షన్ థ్రిల్లర్ మూవీస్‌గా ఉన్నాయి.
OTT Movies Release Today Telugu: ఓటీటీలోకి ఇవాళ (డిసెంబర్ 6) ఒక్కరోజే 19 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. అందులో క్రైమ్ థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్, యాక్షన్, హారర్, రొమాంటిక్, డ్రామా వంటి అన్ని రకాల జోనర్ సినిమాలు, వెబ్ సిరీసులు ఉన్నాయి. మరి అవేంటీ, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో లుక్కేద్దాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
జిగ్రా (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం)- డిసెంబర్ 6
మేరీ (ఇంగ్లీష్ సినిమా)- డిసెంబర్ 6
బ్యూటిఫుల్ లైఫ్ సీజన్ 1 (జపనీస్ రొమాంటిక్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 6
విక్కీ విద్యా కా వో వాలా వీడియో (హిందీ రొమాంటిక్ కామెడీ మూవీ)- డిసెంబర్ 7
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
అగ్ని (హిందీ యాక్షన్ డ్రామా మూవీ)- డిసెంబర్ 6
ది స్టిక్కీ (హిస్టరీ వెబ్ సిరీస్)- డిసెంబర్ 6
మర్ఫీ (కన్నడ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ)- డిసెంబర్ 6
మొహ్రే సీజన్ 1 (హిందీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 6
ఇయర్ 10 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ)- డిసెంబర్ 6
జియో సినిమా ఓటీటీ
క్రియేచ్ కమాండోస్ (యానిమేటెడ్ మూవీ)- డిసెంబర్ 6
లాంగింగ్ (ఇంగ్లీష్ కామెడీ డ్రామా చిత్రం)- డిసెంబర్ 7
లయన్స్ గేట్ ప్లే ఓటీటీ
బ్లీడింగ్ స్టీల్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- డిసెంబర్ 6
వార్ ఆఫ్ ది వరల్డ్స్ సీజన్ 1 (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 6
నరుడి బ్రతుకు నటన (తెలుగు మూవీ)- ఆహా ఓటీటీ- డిసెంబర్ 6
సర్ (తెలుగు డబ్బింగ్ తమిళ చిత్రం)- ఆహా తమిళ్ ఓటీటీ- డిసెంబర్ 6
డోంట్ టర్న్ అవుట్ ది లైట్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ చిత్రం)- బుక్ మై షో ఓటీటీ- డిసెంబర్ 6
మైరీ (హిందీ రివేంజ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జీ5 ఓటీటీ- డిసెంబర్ 6
తానవ్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- సోనీ లివ్ ఓటీటీ- డిసెంబర్ 6
ఎమిలియా పెరెజ్ (ఇంగ్లీష్ మ్యూజిక్ థ్రిల్లర్ మూవీ)- ముబీ ఓటీటీ- డిసెంబర్ 6
ఫ్యామిలీ (మలయాళ డ్రామా చిత్రం)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- డిసెంబర్ 6
మ్యాట్నీ (కన్నడ రొమాంటిక్ హారర్ డ్రామా సినిమా)- సన్ ఎన్ఎక్స్‌టీ ఓటీటీ- డిసెంబర్ 6
అన్ని జోనర్స్‌లలో
ఇలా ఇవాళ ఒక్కరోజే ఓటీటీలోకి సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి 19 స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో అలియా భట్ తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ జిగ్రా, యాక్షన్ డ్రామా మూవీ అగ్ని, కన్నడ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ మర్ఫీ, తెలుగు డబ్బింగ్ సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్ ఇయర్, తెలుగు మూవీ నరుడి బ్రతుకు నటన, తెలుగు డబ్బింగ్ తమిళ మూవీ సర్ సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.
చూడాల్సినవిగా
అలాగే, తెలుగు డబ్బింగ్ హారర్ సినిమా డోంట్ టర్న్ అవుట్ ది లైట్స్, మలయాళ డ్రామా సినిమా ఫ్యామిలీ, కన్నడ రొమాంటిక్ హారర్ డ్రామా సినిమా మ్యాట్నీ, హిందీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ మొహ్రే సీజన్ 1, తెలుగు డబ్బింగ్ హిందీ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తానవ్ 2, జాకీ చాన్ నటించిన తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ చిత్రం బ్లీడింగ్ స్టీల్ చూడాల్సినవిగా ఉన్నాయి.
12 స్పెషల్-5 తెలుగులో
మొత్తంగా ఇవాళ ఓటీటీ రిలీజ్ అయిన వాటిలో 10 సినిమాలు, 2 వెబ్ సిరీస్‌లతో 12 చాలా స్పెషల్‌గా ఉన్నాయి. వాటిలో 5 మాత్రమే తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.