తెలుగు న్యూస్ / ఫోటో /
OTT Releases: రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన కల్కి 2898 ఏడీ.. ఆగస్ట్ చివరి 9 రోజుల్లో రిలీజ్ కాబోతున్న సినిమాలు, సిరీస్ ఇవే
OTT Releases: మోస్ట్ అవేటెడ్ కల్కి 2898 ఏడీ రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇక ఆగస్ట్ నెలలో మిగిలిన 8 రోజుల్లో ఓటీటీల్లోకి కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ రాబోతున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, జీ5, జియో సినిమాల్లాంటి ఓటీటీల్లోకి ఇవి రాబోతున్నాయి.
(1 / 7)
OTT Releases: మహా ఎపిక్ బ్లాక్ బస్టర్ కల్కి 2898 ఏడీ మూవీ గురువారం (ఆగస్ట్ 22) నుంచి ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ లలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. హిందీ వెర్షన్ మాత్రం నెట్‌ఫ్లిక్స్ లోకి రాగా.. తెలుగుతోపాటు మిగిలిన భాషల వెర్షన్లు ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.
(2 / 7)
OTT Releases: కల్కి 2898 ఏడీ మూవీగా వచ్చేయగా.. ఈ నెలలో మిగిలిన రోజుల్లో మరికొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ రాబోతున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం.
(3 / 7)
OTT Releases: ఈ మధ్యే జియో సినిమాలో శేఖర్ హోమ్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కే కే మేనన్.. ఇప్పుడు ముర్షిద్ పేరుతో మరో సిరీస్ చేశాడు. ఈ సిరీస్ జీ5 ఓటీటీలో ఆగస్ట్ 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
(4 / 7)
OTT Releases: బాలీవుడ్ నటి ఉర్ఫీ జావెద్ జీవితం ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ 'ఫాలో కర్ లో యార్' శుక్రవారం (ఆగస్టు 23)న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది.
(5 / 7)
OTT Releases: విజయ్ వర్మ నటించిన థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ఐసీ 814: ది కాందహార్ హైజాక్' ఆగస్టు 29 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
(6 / 7)
OTT Releases: ధనుష్ నటించిన రాయన్ మూవీ కూడా శుక్రవారం (ఆగస్ట్ 23) నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వస్తోంది.
ఇతర గ్యాలరీలు