Game Changer: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా పుష్ప 2 డైరెక్టర్
13 December 2024, 6:04 IST
Game Changer: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో డిసెంబర్ 21న జరుగనుంది. ఈ వేడుకకు పుష్ఫ 2 డైరెక్టర్ సుకుమార్ చీఫ్ గెస్ట్‌గా హాజరుకానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. శంకర్ దర్శకత్వం వహిస్తోన్న గేమ్ ఛేంజర్ మూవీ జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్
Game Changer: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో జరుగనుంది. యూఎస్ఏలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జరుపుకోనున్న ఫస్ట్ తెలుగు మూవీగా గేమ్ ఛేంజర్ నిలవనుంది. ఈ ఈవెంట్‌కు గెస్ట్ ఎవరన్నది కన్ఫామ్ అయ్యింది. పుష్ప 2తో బ్లాక్‌బస్టర్ అందుకున్న దర్శకుడు సుకుమార్ గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజరుకానున్నాడు. ఈ విషయాన్ని గేమ్ ఛేంజర్ టీమ్ ఆఫీషియల్‌గా ప్రకటించింది. డిసెంబర్ 21న అమెరికాలోని డల్లాస్ వేదికగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరునున్నట్లు తెలిపింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీ స్థాయిలో నిర్వహించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తోన్నారు.
పాన్ ఇండియన్ లెవెల్‌లో
గేమ్ ఛేంజర్ మూవీకి శంకర్ దర్శకత్వం వహిస్తోన్నాడు. పాన్ ఇండియన్ లెవెల్‌లో దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 10న గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తొలుత డిసెంబర్‌లోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. కానీ బడ్జెట్‌తో పాటు రామ్‌చరణ్, శంకర్ కాంబోకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని సంక్రాంతికి షిఫ్ట్ అయ్యారు. గేమ్ ఛేంజర్ కోసం సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన చిరంజీవి విశ్వంభర వాయిదాపడింది.
రెండు పాత్రల్లో...
పొలిటికల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న గేమ్ ఛేంజర్ మూవీలో రామ్‌చరణ్ రెండు పాత్రల్లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఐఏఎస్‌గా, పోరాట యోధుడిగా డిఫరెంట్ షేడ్స్‌లో చరణ్ క్యారెక్టర్ సాగుతుందని సమాచారం.
కార్తీక్ సుబ్బరాజు కథ...
గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్‌చరణ్‌కు జోడీగా కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. వినయ విధేయరామ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తోన్న సెకండ్ మూవీ ఇది. ఎస్‌జే సూర్య, నవీన్ చంద్ర, సముద్రఖని, శ్రీకాంత్, అంజలి ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ భారీ బడ్జెట్ మూవీకి డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కథను అందించాడు. దిల్‌రాజు, శిరీష్ గేమ్ ఛేంజర్ మూవీని ప్రొడ్యూస్ చేస్తోన్నారు.
మూడు సినిమాలు...
గేమ్ ఛేంజర్ మూవీకి తమన్ మ్యూజిక్ అందించాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి నానా హైరానా, రారా మచ్చ, జరగండి పాటలను రిలీజ్ చేశారు. ఈ మూడు పాటలు మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోన్నాయి.
సంక్రాంతికి రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్‌తో పాటు బాలకృష్ణ డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ మూడు సినిమాల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.
రంగస్థలం తర్వాత...
రంగస్థలం తర్వాత రామ్‌చరణ్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో మరో మూవీ రాబోతోంది. ప్రస్తుతం ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో రామ్‌చరణ్ ఓ మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే చరణ్, సుకుమార్ మూవీ మొదలయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ రామ్‌చరణ్, సుకుమార్ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప 2 మూవీ ఆరు రోజుల్లోనే 1000 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.