Chiranjeevi: హైదరాబాద్‌లో ఒకే పెళ్లికి చిరంజీవి, అల్లు అర్జున్.. కానీ ఫొటోలు మాత్రం విడివిడిగా.. ఫొటోలు వైరల్-actors chiranjeevi and allu arjun were spotted attending a wedding in hyderabad ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chiranjeevi: హైదరాబాద్‌లో ఒకే పెళ్లికి చిరంజీవి, అల్లు అర్జున్.. కానీ ఫొటోలు మాత్రం విడివిడిగా.. ఫొటోలు వైరల్

Chiranjeevi: హైదరాబాద్‌లో ఒకే పెళ్లికి చిరంజీవి, అల్లు అర్జున్.. కానీ ఫొటోలు మాత్రం విడివిడిగా.. ఫొటోలు వైరల్

Galeti Rajendra HT Telugu
Dec 08, 2024 07:22 PM IST

Chiranjeevi and Allu Arjun: మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపించింది. ఏపీ ఎన్నికల తర్వాత ఈ దూరం మరింత పెరగగా.. హైదరాబాద్‌లో ఇద్దరూ ఒకే పెళ్లికి హాజరయ్యారు. కానీ..?

ఒకే పెళ్లికి హాజరైన అల్లు అర్జున్, చిరంజీవి
ఒకే పెళ్లికి హాజరైన అల్లు అర్జున్, చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహానికి హాజరైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్ వధువుకాగా.. ఆమె పెళ్లికి చిరంజీవి, అల్లు అర్జున్‌తో పాటు కొంత మంది సెలెబ్రిటీలు హాజరయ్యారు. అయితే.. కేవలం మెగా, అల్లు ఫ్యామిలీ తన పెళ్లికి హాజరైన ఫొటోలను మాత్రమే సాధనా సింగ్ షేర్ చేశారు.

yearly horoscope entry point

గత 7 నెలలుగా కోల్డ్ వార్

పుష్ప 2 సినిమాతో బ్లాక్‌బాస్టర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్.. ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉన్నారు. మరోవైపు చిరంజీవి కూడా విశ్వంభర మూవీలో నటిస్తూనే వరుసగా కొత్త ప్రాజెక్ట్‌లకి గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చేస్తున్నారు. అయితే.. ఏపీ సార్వత్రిక ఎన్నికల నుంచి మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది.

పుష్ప2 రిలీజ్ ముంగిట కూడా ఈ వార్ కనిపించింది. దాంతో చిరంజీవి, అల్లు అర్జున్ ఒకే పెళ్లికి హాజరయ్యారనే విషయం వెలుగులోకి రావడంతో.. ఇద్దరూ కలిశారా? మాట్లాడుకున్నారా? అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

ఫ్యామిలీతో అల్లు అర్జున్

పెళ్లికి అల్లు అర్జున్ తన భార్య అల్లు స్నేహారెడ్డి, కుమార్తె అర్హతో కలిసి హాజరయ్యారు. అలానే అల్లు అరవింద్ దంపతులు- అల్లు శిరీష్‌ కూడా మరో ఫ్రేమ్‌లో కనిపించారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా వధూవరులను ఆశీర్వదిస్తూ కనిపించారు. కానీ.. ఫ్రేమ్‌లో అల్లు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ కనిపించలేదు.

అల్లు అర్జున్ ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా నంద్యాలకి వెళ్లారు. ఇక అక్కడి నుంచి వార్ మొదలైంది. మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య దూరం పెరిగింది. చివరికి ఒకరి పేరుని.. మరొకరు కనీసం ప్రస్తావించడానికి ఇష్టపడటం లేదు.

పవన్ కళ్యాణ్‌కి అల్లు అర్జున్ కృతజ్ఞతలు

పుష్ప 2: ది రూల్ మూవీ టికెట్ ధరలను పెంచుకోవడానికి అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసినందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి అల్లు అర్జున్ శనివారం కృతజ్ఞతలు తెలిపారు. కానీ.. మెగా ఫ్యామిలీ నుంచి సానుకూల స్పందన అయితే రాలేదు.

2023లో ఆఖరిగా భోళా శంకర్ సినిమాలో కనిపించిన చిరంజీవి.. వచ్చే ఏడాది విశ్వంభర మూవీతో థియేటర్లలోకి రానున్నారు. ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెల, బోయపాటి శ్రీనుతో సినిమాలను పట్టాలెక్కించున్నారు.

Whats_app_banner