తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2 Cast Salary: పుష్ప 2లో నటించిన వాళ్లలో.. ఎవరెవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారంటే?

Pushpa 2 Cast Salary: పుష్ప 2లో నటించిన వాళ్లలో.. ఎవరెవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారంటే?

Galeti Rajendra HT Telugu

03 December 2024, 17:07 IST

google News
  • Allu Arjun remuneration For Pushpa 2: పుష్ప 2 సినిమా రిలీజ్‌కి ముందే దాదాపు రూ.1,000 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. రూ.500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో నటించిన వాళ్లలో ఎవరెంత రెమ్యూనరేషన్ తీసుకున్నారంటే? 

పుష్ప 2లో ఎవరి రెమ్యూనరేషన్ ఎంత?
పుష్ప 2లో ఎవరి రెమ్యూనరేషన్ ఎంత?

పుష్ప 2లో ఎవరి రెమ్యూనరేషన్ ఎంత?

పుష్ప 2 మూవీ మరో 2 రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది. సుకుమార్ దర్శకత్వంలో రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ.. రూ.1,000 కోట్ల వరకూ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. 2021లో విడుదలైన పుష్ప 1 మూవీ రూ.350 కోట్లపైనే వసూళ్లు రాబట్టిన విషయ తెలిసిందే.

పుష్ప 2 మూవీ డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా 12,500 థియేటర్లలో విడుదలకాబోతోంది. ఆరు భాషల్లో వస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు మూవీపై అంచనాల్ని మరింత పెంచేశాయి. పుష్ప 2లో అల్లు అర్జున్ సరసన రష్మిక మంధాన నటించగా.. శ్రీలీల స్పెషల్ సాంగ్ చేసింది. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, అనసూయ, సునీల్ తదితరులు కూడా నటించారు.

పుష్ప 2లో ఎవరెవరు.. ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారంటే?

హీరో అల్లు అర్జున్ రూ.300 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. మూడేళ్ల పాటు ఈ మూవీ కోసం డేట్స్ కేటాయించిన అల్లు అర్జున్.. ఏ ప్రాజెక్ట్‌కీ పని చేయలేదు. దాంతో రూ.300 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ తీసుకున్న అల్లు అర్జున్.. దేశంలోనే అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా రికార్డ్ నెలకొల్పాడు. ఇప్పటి వరకూ తమిళ్ హీరో విజయ్ రూ.275 కోట్లతో టాప్‌లో ఉన్నారు.

రష్మిక మంధాన డబుల్

రష్మిక మంధాన ఈ మూవీ కోసం దాదాపు ఆరు నెలలు పనిచేసింది. దాంతో ఆమె కూడా రూ.10 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే? పుష్ప 1 కోసం ఆమె తీసుకున్న పారితోషికం రూ.5 కోట్లు. అయితే.. యానిమల్ సినిమాతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ భారీగా పెరిగిపోవడంతో.. రూ.10 కోట్లు తీసుకున్నట్లు సమాచారం.


భారీగా ఛార్జ్ చేసిన ఫాహద్ ఫాజిల్

ఫాహద్ ఫాజిల్ రూ.8 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ తీసుకున్నాడట. పుష్ప 1లో ఫాహద్ ఫాజిల్ రోల్ తక్కువే అయినప్పటికీ.. రూ.3.5 కోట్లు తీసుకున్న ఈ మలయాళం హీరో.. సీక్వెల్ కోసం రూ.8 కోట్లు ఛార్జ్ చేశారట.ఈ మూడేళ్లలో హీరోగా పలు సినిమాలు తీసిన హద్ ఫాజిల్.. హిట్స్ కూడా అందుకున్న విషయం తెలిసిందే.

వారం రోజులకే రూ.2 కోట్లు

పుష్ప 2లో కిస్సిక్‌ అనే ఐటెం సాంగ్ చేసిన శ్రీలీల..వారం రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొంది. టాలీవుడ్‌లో ప్రస్తుతం క్రేజీ హీరోయిన్‌గా ఉన్న శ్రీలీల.. ఈ సాంగ్ కోసం రూ.2 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

వెయ్యి కోట్లు దాటిన ప్రీ-రిలీజ్ బిజినెస్

డైరెక్టర్ సుకుమార్ రూ.15 కోట్లు, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ రూ.5 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓవరాల్‌గా ఈ మూవీ బడ్జెట్ రూ.500 కోట్లు దాటిపోగా.. ప్రీ-రిలీజ్ బిజినెస్ రూ.1,085 కోట్లు జరిగినట్లు సమాచారం.

తదుపరి వ్యాసం