OTT: అఫీషియల్.. తెలుగులో ఓటీటీలోకి వచ్చేస్తున్న ఫాహద్ ఫాజిల్ చిత్రం.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు-fahadh faasil malayalam thriller movie dhoomam set to stream in telugu on aha ott platform from july 11 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott: అఫీషియల్.. తెలుగులో ఓటీటీలోకి వచ్చేస్తున్న ఫాహద్ ఫాజిల్ చిత్రం.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు

OTT: అఫీషియల్.. తెలుగులో ఓటీటీలోకి వచ్చేస్తున్న ఫాహద్ ఫాజిల్ చిత్రం.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 06, 2024 09:57 PM IST

Dhoomam Telugu OTT Release Date: ధూమం సినిమా తెలుగు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. మలయాళంలో థియేటర్లలో రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వస్తోంది. ఓటీటీ రిలీజ్ డేట్‍పై అధికారిక ప్రకటన వచ్చింది.

OTT: అఫీషియల్.. తెలుగులో ఓటీటీలోకి వచ్చేస్తున్న ఫాహద్ ఫాజిల్ చిత్రం.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు
OTT: అఫీషియల్.. తెలుగులో ఓటీటీలోకి వచ్చేస్తున్న ఫాహద్ ఫాజిల్ చిత్రం.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు

మలయాళ స్టార్ నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్ర పోషించిన ధూమం సినిమా గతేడాది జూన్‍లో థియేటర్లో రిలీజ్ అయింది. ఈ మూవీతోనే కేజీఎఫ్ మేకర్స్ హొంబాలే ఫిల్మ్స్ మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ట్రైలర్ ఆకట్టుకోవడంతో ఈ థ్రిల్లర్ చిత్రంపై మంచి బజ్ వచ్చింది. అయితే, ధూమం సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో తెలుగులో థియేటర్లలో రిలీజ్ చేసే ప్లాన్‍ను మూవీ టీమ్ విరమించుకుంది. అయితే, ఇప్పుడు ఏడాది తర్వాత తెలుగులో ధూమం సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్ అయింది.

ఓటీటీ రిలీజ్ డేట్

ధూమం సినిమా తెలుగులో ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి రానుంది. జూలై 11న ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఈ విషయాన్ని ఆహా ఓటీటీ నేడు (జూలై 6) అధికారికంగా ప్రకటించింది. “ఎంతో గ్రిప్పింగ్‍గా ఉండే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మిమ్మల్ని ఊహించని రైడ్‍లోకి తీసుకెళుతుంది. జూలై 11న ధూమం మూవీ ఆహాలో ప్రీమియర్ కానుంది” అంటూ ఆహా నేడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ధూమం మూవీకి పవన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఫాహద్ ఫాజిల్, అపర్ణ బాలమురళి, రోషన్ మాథ్యూ ప్రధాన పాత్రలు పోషించగా.. వినీత్, అనుమోహన్, అచ్యుత్ కుమార్, వినయ్ మీనన్, జోయ్ మాథ్యూ, నందు, భానుమతి ఈ చిత్రంలో కీరోల్స్ చేశారు. హోంబాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మించిన ఈ మూవీకి పూర్ణచంద్ర తేజస్వి సంగీతం అందించారు.

ధూమం సినిమాకు మొదటి నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ చిత్రానికి రూ.5కోట్ల లోపు వసూళ్లే వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. దీంతో తెలుగులో థియేటర్లలో రిలీజ్ చేసే నిర్ణయాన్ని మేకర్స్ వెనక్కి తీసుకున్నారు.

రెండు భాషల్లో యూట్యూబ్‍లో..

ధూమం సినిమా ఇటీవలే యూట్యూబ్‍లో రెండు భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా మే 31వ తేదీన మలయాళం, కన్నడ భాషల్లో యూట్యూబ్‍లో అడుగుపెట్టింది. ఇప్పుడు తెలుగులో ఆహా ఓటీటీలో జూలై 11 నుంచి స్ట్రీమింగ్‍కు రానుంది. ఇలా.. తెలుగు డబ్బింగ్‍లో నేరుగా ఆహాలోకి ఈ చిత్రం వస్తోంది.

ధూమం స్టోరీ లైన్

పొగాకు వాడకం ప్రజల ఆరోగ్యానికి, జీవితాలకు ఎంత హానికరమో తెలియజేయడం చుట్టూ ధూమం సినిమా స్టోరీ తిరుగుతుంది. సిధ్ (రోషన్ మాథ్యూస్)కు చెందిన పొగాకు ఉత్పత్తుల కంపెనీలో అవినాశ్ (ఫాహద్ ఫాజిల్) ఉద్యోగిగా ఉంటాడు. అవినాశ్‍కు తమ ప్రొడక్టులను ఎలా బాగా అమ్మాలో తెలిసి ఉంటుంది. తమ బ్రాండ్ సిగరెట్లను అత్యధికంగా మార్కెట్ చేయాలని అవినాశ్‍ను సిద్ ఒత్తిడి చేస్తుంటాడు. అవినాశ్ కూడా తన మార్కెటింగ్ స్కిల్‍తో సేల్స్ పెంచుతుంటాడు. అయితే ఓ రోజు అవినాశ్, అతడి భార్య దియా (అపర్ణ బాలమురళి) కిడ్నాప్ అవుతారు. కిడ్నాపర్లు తమను విడిపెట్టేందుకు 24 గంటల్లో రూ.కోటి ఇవ్వాలని అడుగుతారు. దీంతో డబ్బును సిద్‍, ప్రవీణ్‍ను అవినాశ్ అడుగుతాడు. అయితే, పొగాకు కంపెనీలో తన జీవితాన్ని, తన కార్పొరెట్ లైఫ్‍ను ఆ 24 గంటల్లో ఫాహద్ అవలోకనం చేసుకుంటాడు. తనను తానే ప్రశ్నించుకుంటాడు.

పొగాకు వల్ల జనాల జీవితాలను ఎలా ముప్పు జరుగుతుందో అవినాశ్‍కు జ్ఞానోదయం అవుతుంది. దీంతో ఓ దశలో తన ఉద్యోగాన్ని వదిలేసేందుకు డిసైడ్ అవుతాడు. అయితే అతడు ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత పరిస్థితులు మరింత కఠినంగా మారతాయి. అవినాశ్, దివ్య ప్రాణాలు రిస్కులో పడతాయి. ఈ ప్రమాదం నుంచి వారు బయటపడ్డారా.. వారిని బెదిరించింది ఎవరు అనేది ధూమం చిత్రంలో ప్రధాన అంశాలుగా ఉంటాయి.

WhatsApp channel