Kanguva: కంగువా సినిమా ఎఫెక్ట్.. తమిళులకి టార్గెట్‌గా మారిన దేవిశ్రీ ప్రసాద్
DSP: కంగువా సినిమా తర్వాత దేవిశ్రీ ప్రసాద్‌పై ట్రోలింగ్ పెరిగిపోయింది. మూవీలో చాలా సీన్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోరు సరిగా లేకపోవడంతో తేలిపోయాయని సూర్య అభిమానులు ఫిర్యాదు చేస్తున్నారు. దాంతో..?
సూర్య నటించిన కంగువా సినిమా అంచనాల్ని అందుకోలేకపోయింది. నవంబరు 14న ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో రిలీజైన కంగువా సినిమా.. తొలిరోజే మిక్సెడ్ టాక్‌కి సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో ఈ సినిమాపై పెద్ద ఎత్తున జోక్‌లు, మీమ్స్ పేలుతున్నాయి. సినిమా ఇలా అవ్వడానికి కారణం దేవిశ్రీ ప్రసాద్ అంటూ తమిళులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.
భారీ బడ్జెట్
రూ.350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ కంగువా సినిమాకి శివ దర్శకత్వం వహించగా.. సూర్య సరసన దిశా పటాని నటించింది. అలానే విలన్‌గా బాబీ డియోల్ యాక్ట్ చేశాడు. అలానే ఒక హీరో గెస్ట్ రోల్ చేశారు. అయితే.. భారీ తారగణంతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసింది.
రూ.1000 కోట్ల ఆశలు ఆవిరి
వాస్తవానికి సినిమా రిలీజ్‌కి 2-3 వారాల ముందు నుంచే కంగువా రూ.1000 కోట్లు కలెక్ట్ చేస్తుందని ప్రొడ్యూసర్, తమిళ్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఇది తమిళ్ బాహుబలి అని ఆకాశానికెత్తేశారు. కానీ.. సినిమా కథలో కొత్తదనం ఉన్నా.. ప్రేక్షకులకి అర్థమయ్యేలా చెప్పడంలో దర్శకుడు విఫలమయ్యారనే విమర్శ వినిపిస్తోంది.
దేవిశ్రీపై ఫిర్యాదు
కంగువా సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా.. బ్యాగ్రౌండ్ స్కోర్, రీ-రికార్డింగ్ మరీ నాసిరకంగా ఉందని సూర్య అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలో చాలా సీన్స్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సెట్ అవ్వకపోడంతో తేలిపోయాయని సూర్య అభిమానులు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేస్తున్నారు.
సీక్వెల్ సంగతేంటి?
కంగువా సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందని ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే.. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులోనూ ఆశించిన మేర వసూళ్లు ఈ సినిమాకి రావడం లేదు. దాంతో సీక్వెల్ ఉంటుందా? ఉంటే మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎవరు ఉంటారు? అనే చర్చ జరుగుతోంది. అనిరుధ్ లేదా జీవీ ప్రకాశ్‌లో ఒకరిని మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంచుకోవాలని అభిమానులు సూచిస్తున్నారు.