తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2 Artists Injured: పుష్ప 2 యూనిట్‌కు ప్ర‌మాదం - బ‌స్ యాక్సిడెంట్‌లో ఆర్టిస్టుల‌కు గాయాలు

Pushpa 2 Artists Injured: పుష్ప 2 యూనిట్‌కు ప్ర‌మాదం - బ‌స్ యాక్సిడెంట్‌లో ఆర్టిస్టుల‌కు గాయాలు

HT Telugu Desk HT Telugu

31 May 2023, 10:36 IST

  • Pushpa 2 Actors Bus Accident: పుష్ప‌-2 యాక్ట‌ర్స్ ప్ర‌యాణిస్తోన్న బ‌స్ నార్క‌ట్‌ప‌ల్లి వ‌ద్ద ప్ర‌మాదానికి గురైన‌ట్లు తెలిసింది. ఈ యాక్సిడెంట్‌లో ప‌లువురు న‌టులు గాయ‌ప‌డ్డ‌ట్టు స‌మాచారం.

బ‌స్ యాక్సిడెంట్‌
బ‌స్ యాక్సిడెంట్‌

బ‌స్ యాక్సిడెంట్‌

Pushpa 2 Actors Bus Accident: పుష్ప 2 ఆర్టిస్టులు ప్ర‌యాణిస్తోన్న బ‌స్ ప్ర‌మాదానికి గురైంది. ఈ ఘ‌ట‌న‌లో ప‌లువురు న‌టులు గాయ‌ప‌డిన‌ట్లు స‌మాచారం. పుష్ప -2 షూటింగ్‌ను పూర్తిచేసుకున్న కొంద‌రు న‌టీన‌టులు విజ‌య‌వాడ నుంచి హైద‌రాబాద్‌కు బ‌స్‌లో బ‌య‌లుదేరిన‌ట్లు తెలిసింది. నార్క‌ట్ ప‌ల్లి వ‌ద్ద వీరు ప్ర‌యాణిస్తోన్న బ‌స్‌ను మ‌రో ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బ‌స్ బ‌లంగా ఢీకొట్టిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Chitram Choodara OTT Release Date: నేరుగా ఓటీటీలోకి వస్తున్న వరుణ్ సందేశ్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Aditya Kapur Ananya Panday: బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆదిత్య కపూర్, అనన్య పాండే బ్రేకప్ చేసుకున్నారా? వివరాలివే

Aa Okkati Adakku Collections: బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్కటి అడక్కు మూవీ జోరు.. తొలి రోజు కంటే రెండో రోజు ఎక్కువగా..

Geethanjali Malli Vachindi OTT: ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే! ఎక్కడ చూడొచ్చంటే..

ఈ ప్ర‌మాదంలో ప‌లువురు న‌టుల‌కు గాయాలు అయిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. గాయ‌ప‌డ్డ న‌టీన‌టుల్ని పోలీసులు స్థానిక ఆసుప‌త్రిలో చేర్పించార‌ని అంటున్నారు. ఈ యాక్సిడెంట్ కార‌ణంగా హైద‌రాబాద్ - విజ‌య‌వాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయిన‌ట్లు తెలిసింది. బ‌స్ యాక్సిడెంట్‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తోన్నారు.

ఈ బ‌స్ ప్ర‌మాదం ఘ‌ట‌న టాలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కాగా పుష్ప -2 తాజా షెడ్యూల్ మారేడుమిల్లి ఆట‌వీ ప్రాంతంలో జ‌రిగిన‌ట్లు తెలిసింది. . అల్లు అర్జున్‌తో (Allu Arjun) పాటు ప్ర‌ధాన తారాగ‌ణంపై సుకుమార్(Sukumar) కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించిన‌ట్లుచెబుతోన్నారు. ఎర్ర‌చంద‌నం అక్ర‌మ ర‌వాణా నేప‌థ్యంలో రియ‌లిస్టిక్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా పుష్ప‌-2 సినిమాను డైరెక్ట‌ర్ సుకుమార్ తెర‌కెక్కిస్తోన్నారు.

ఇందులో అల్లు అర్జున్‌కు జోడీగా ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోంది. మ‌ల‌యాళ న‌టుడు ఫ‌హాద్ ఫాజిల్ విల‌న్ పాత్ర‌ను పోషిస్తోన్నాడు. ఈ ఏడాది డిసెంబ‌ర్‌లో పుష్ప‌-2 మూవీ రిలీజ్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.