Allu Arjun Next Movie: పుష్ప -2 త‌ర్వాత అల్లు అర్జున్ నెక్స్ట్‌ మూవీ ఇదే - క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూస‌ర్‌-allu arjun to team up with director trivikram fourth time details here ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Allu Arjun Next Movie: పుష్ప -2 త‌ర్వాత అల్లు అర్జున్ నెక్స్ట్‌ మూవీ ఇదే - క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూస‌ర్‌

Allu Arjun Next Movie: పుష్ప -2 త‌ర్వాత అల్లు అర్జున్ నెక్స్ట్‌ మూవీ ఇదే - క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూస‌ర్‌

HT Telugu Desk HT Telugu
May 24, 2023 12:16 PM IST

Allu Arjun Next Movie: పుష్ప -2 త‌ర్వాత అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ ఏ డైరెక్ట‌ర్‌తో చేయ‌బోతున్నాడ‌న్న‌దానిపై క్లారిటీ వ‌చ్చేసింది. అల్లు అర్జున్ త‌దుప‌రి సినిమాపై బ‌న్నీ వాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

అల్లు అర్జున్
అల్లు అర్జున్

Allu Arjun Next Movie: టాలీవుడ్‌లో అల్లు అర్జున్‌, ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌ల‌ది స‌క్సెస్‌ఫుల్ కాంబినేష‌న్‌గా చెప్ప‌వ‌చ్చు. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తితో పాటు అల వైకుంఠ‌పుర‌ముల‌తో సినిమాలు బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్స్‌గా నిలిచాయి. అలా వైకుంఠ‌పుర‌ములో ఇండ‌స్ట్రీ రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. తాజాగా అల్లు అర్జున్‌, త్రివిక్ర‌మ్ క‌ల‌యిక‌లో నాలుగో సినిమా రాబోతున్న‌ట్లు నిర్మాత బ‌న్నీ వాస్ ప్ర‌క‌టించారు.

2018 మూవీ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంట‌ర్శ్యూలో అల్లు అర్జున్‌, త్రివిక్ర‌మ్ మూవీపై బ‌న్నీవాస్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. పుష్ప‌-2 షూటింగ్ పూర్త‌యిన వెంట‌నే బ‌న్నీ, త్రివిక్ర‌మ్ మూవీ సెట్స్‌పైకి వెళుతుంద‌ని ప్ర‌క‌టించారు. 2024లో ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌ల‌వుతుంద‌ని బ‌న్నీవాస్ పేర్కొన్నాడు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్‌తో క‌లిసి సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మించ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించాడు.

ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఫ్యామిలీ ఎమోష‌న్స్‌కు మించి ఈ సినిమా ఉండ‌బోతున్న‌ట్లు స‌మాచారం. బ‌న్నీవాస్ ప్ర‌క‌ట‌న‌తో అల్లు అర్జున్ అభిమానుల్లో జోష్ నెల‌కొంది.

అల్లు అర్జున్ హీరోగా న‌టించ‌నున్న 22వ మూవీ ఇదే అని ప్ర‌చారం జ‌రుగుతోంది. . ప్ర‌స్తుతం పుష్ప -2 షూటింగ్‌తో అల్లు అర్జున్ బిజీగా ఉన్నాడు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ మూవీ తెర‌కెక్కుతోంది.

పుష్ప పార్ట్ వ‌న్ పెద్ద విజ‌యాన్ని సాధించిన‌ నేప‌థ్యంలో ఈ సీక్వెల్ కోసం పాన్ ఇండియ‌న్ లెవ‌ల్‌లో సినీ ల‌వ‌ర్స్ ఎదురుచూస్తోన్నారు. ఈ సీక్వెల్‌లో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోంది. మ‌ల‌యాళ న‌టుడు ఫ‌హాద్ ఫాజిల్ విల‌న్ క్యారెక్ట‌ర్‌ను చేస్తోన్నాడు. పుష్ప -2 డిసెంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

IPL_Entry_Point