తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kushi Re Release Trailer : పవన్ కల్యాణ్.. ఖుషి రీ రిలీజ్ ట్రైలర్ వచ్చేసిందోచ్

Kushi Re Release Trailer : పవన్ కల్యాణ్.. ఖుషి రీ రిలీజ్ ట్రైలర్ వచ్చేసిందోచ్

Anand Sai HT Telugu

25 December 2022, 21:48 IST

    • Pawan Kalyan Kushi Re Release: ప‌వ‌న్ క‌ల్యాణ్ ఖుషి థియేటర్లలో రీ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకు సంబంధించి రీ రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేశారు.
ఖుషి రీ రిలీజ్ ట్రైలర్
ఖుషి రీ రిలీజ్ ట్రైలర్ (twitter)

ఖుషి రీ రిలీజ్ ట్రైలర్

పవన్ కల్యాణ్ ఖుషి(Pawan Kalyan Kushi) సినిమా రీ రిలీజ్ కానుంది. దీనికి సంబంధించి.. రీ రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేశారు. 4కేలో సినిమాను విడుదల చేయనున్నారు. ఖుషి సూపర్ డూపర్ హిట్ సినిమా కావడంతో ఫ్యాన్స్ థియేటర్లో చూసేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఖుషి సినిమా డిసెంబ‌ర్ 31న రీ రిలీజ్ కానుంది. జ‌న‌వ‌రి 6 వ‌ర‌కు థియేటర్లలో ప్రదర్శించబోతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Anand Devarakonda: బొంబాయి చట్నీ చేసిన కుర్రాడిగానే తెలుసు, కానీ.. ఆనంద్ దేవరకొండ కామెంట్స్

Brahmamudi: ఆఫీస్ సీసీ కెమెరాలో రాజ్ సీక్రెట్.. చూసేసిన కావ్య, అప్పు- వసుధార కొత్త స్కెచ్- మీరా షాక్‌లో మురారి, కృష్ణ

Heeramandi OTT: ఓటీటీలో దూసుకుపోతున్న పీరియాడికి డ్రామా.. నెటిజన్ల ప్రశంసలు.. సిరీస్ ఎక్కడ చూస్తారంటే?

Adivi Sesh: అదే కొనసాగిస్తే గర్వపడే స్థాయికి వెళ్తుంది.. హీరోయిన్‌పై అడవి శేష్ కామెంట్స్ వైరల్

ఈ సినిమా రీ రిలీజ్(Re Release) థియేట్రికల్ రైట్స్ మూడు కోట్ల వరకు అమ్ముడుపోయినట్టుగా టాక్. 2001లో విడుదలై ఘనవిజయం సాధించింది ఖుషి. ఓ క్లాసిక్ సినిమాగా నిలిచిపోయింది. అభిమానులు ఎప్పటినుంచో విడుదల చేయాలని కోరుతున్నారు. దీంతో న్యూఇయర్ కానుకగా డిసెంబర్ 31న 4కేలో రీ రిలీజ్ అవుతుంది. దీనికి సంబంధించిన ట్రైలర్ విడుదల కావడంతో ఫ్యాన్స్(Fans) పండగ చేసుకుంటున్నారు.

శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ మీద ఏ.ఎం రత్నం సినిమాను నిర్మించారు. ఎస్.జె.సూర్య(SJ Surya) దర్శకత్వం వహించారు. ఇప్పుడు 4కే రిజల్యూషన్ లో 5.1 డాల్బీ ఆడియో క్వాలిటీతో ఖుషి వస్తుంది. దీంతో పవన్ ఫ్యాన్స్(Pawan Fans) ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వింటేజ్ పవర్ స్టార్ ను చూడటంతోపాటుగా.. భూమిక నడుము సీన్ కోసం తెగ ఎదురుచూస్తున్నారు. ఈ సీన్ కు ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు.

కొన్నిరోజులుగా పాత సినిమాలకు 4కే అప్డేట్ చేసి.. రీ రిలీజ్ చేస్తున్నారు. పోకిరి(Pokiri) సినిమాతో ఈ ట్రెండ్ మెుదలైంది. అయితే రీ రిలీజ్ కూడా మంచి బిజినెస్ చేస్తోంది. దీంతో మేకర్స్.. ఇప్పుడు రీ రిలీజ్ల మీద ఫోకస్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ జల్సా(Jalsa) మూవీ ఇప్పటికే రీ రిలీజ్ అయింది. అది కూడా మంచి కలెక్షన్స్ చేసింది. చెన్నకేశవ రెడ్డి, వర్షం సినిమాలు కూడా రీ రిలీజ్ అయ్యాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.