తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Movies: ఓటీటీలో 21 సినిమాలు- 6 చాలా స్పెషల్- తెలుగులో 2- బోల్డ్, హారర్, రివేంజ్, యాక్షన్ థ్రిల్లర్స్ ఇంట్రెస్టింగ్!

OTT Movies: ఓటీటీలో 21 సినిమాలు- 6 చాలా స్పెషల్- తెలుగులో 2- బోల్డ్, హారర్, రివేంజ్, యాక్షన్ థ్రిల్లర్స్ ఇంట్రెస్టింగ్!

Sanjiv Kumar HT Telugu

02 December 2024, 15:28 IST

google News
    • OTT Releases This Week: ఓటీటీల్లోకి ఈ వారం 21 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో చూసేందుకు కేవలం 6 మాత్రమే స్పెషల్‌గా ఉన్నాయి. అవన్నీ హారర్, బోల్డ్ అండ్ రొమాంటిక్, యాక్షన్ థ్రిల్లర్, రివేంజ్ డ్రామా జోనర్స్‌తో ఉన్నాయి. ఇక వీటిలో రెండు మాత్రమే తెలుగు భాషలో అందుబాటులో ఉండనున్నాయి.
ఓటీటీలో 21 సినిమాలు- 6 చాలా స్పెషల్- తెలుగులో 2- బోల్డ్, హారర్, రివేంజ్, యాక్షన్ థ్రిల్లర్స్ ఇంట్రెస్టింగ్!
ఓటీటీలో 21 సినిమాలు- 6 చాలా స్పెషల్- తెలుగులో 2- బోల్డ్, హారర్, రివేంజ్, యాక్షన్ థ్రిల్లర్స్ ఇంట్రెస్టింగ్!

ఓటీటీలో 21 సినిమాలు- 6 చాలా స్పెషల్- తెలుగులో 2- బోల్డ్, హారర్, రివేంజ్, యాక్షన్ థ్రిల్లర్స్ ఇంట్రెస్టింగ్!

OTT Movies This Week: ఓటీటీలోకి ఈ వారం (డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 8) 21 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో యాక్షన్ థ్రిల్లర్స్, రివేంజ్ క్రైమ్ డ్రామా, హారర్, బోల్డ్ అండ్ రొమాంటిక్ జోనర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. మరి ఆ సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో లుక్కేద్దాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

చర్చిల్ ఎట్ వార్ (హాలీవుడ్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 4

దట్ క్రిస్మస్ (యానిమేటెడ్ ఫాంటసీ మూవీ)- డిసెంబర్ 4

ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ చిత్రం)- డిసెంబర్ 4

ది అల్టిమేటమ్ మ్యారీ ఆర్ మూవ్ ఆన్ సీజన్ 3 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 4

బ్లాక్ డన్జ్ (హాలీవుడ్ సినిమా)- డిసెంబర్ 5

ఏ నాన్సెన్స్ క్రిస్మస్ విత్ సబరినా కార్‌పేంటర్ (ఇంగ్లీష్ చిత్రం)- డిసెంబర్ 5

బిగ్గెస్ట్ హైస్ట్ ఎవర్ (ఇంగ్లీష్ బ్యాంక్ రాబరీ మూవీ)- డిసెంబర్ 5

జిగ్రా (అలియా భట్ హిందీ చిత్రం)- డిసెంబర్ 6

విక్కీ విద్యా కా వో వాలా వీడియో (హిందీ రొమాంటిక్ కామెడీ మూవీ)- డిసెంబర్ 6

మేరీ (ఇంగ్లీష్ సినిమా)- డిసెంబర్ 6

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

జాక్ ఇన్‌టైమ్ ఫర్ క్రిస్మస్ (ఇంగ్లీష్ మూవీ)- డిసెంబర్ 3

పాప్ కల్చర్ జియోపార్డీ (హాలీవుడ్ టీవీ షో)- డిసెంబర్ 4

స్మైల్ 2 (ఇంగ్లీష్ హారర్ మూవీ) (రెంటల్ విధానంలో)- డిసెంబర్ 4

అగ్ని (హిందీ యాక్షన్ డ్రామా మూవీ)- డిసెంబర్ 6

ది స్టిక్కీ (హిస్టరీ వెబ్ సిరీస్)- డిసెంబర్ 6

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ

ది ఒరిజినల్ (కొరియన్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 3

లైట్ షాప్ (కొరియన్ మిస్టరీ వెబ్ సిరీస్)- డిసెంబర్4

జియో సినిమా ఓటీటీ

క్రియేచ్ కమాండోస్ (యానిమేటెడ్ మూవీ)- డిసెంబర్ 6

లాంగింగ్ (ఇంగ్లీష్ కామెడీ డ్రామా చిత్రం)- డిసెంబర్ 7

స్మైల్ 2 (ఇంగ్లీష్ హారర్ సినిమా)- డిసెంబర్ 4

మైరీ (హిందీ రివేంజ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జీ5 ఓటీటీ- డిసెంబర్ 6

తానవ్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- సోనీ లివ్ ఓటీటీ- డిసెంబర్ 6

ఓటీటీలో 21 సినిమాలు

ఇలా ఈ వారం ఓటీటీలోకి 21 సినిమాలు, వెబ్ సిరీస్‌లు కలిపి డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో అలియా భట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ జిగ్రా, యాక్షన్ డ్రామా అగ్ని, హారర్ మూవీ స్మైల్ 2, రివేంజ్ థ్రిల్లర్ సిరీస్ మైరీ, తెలుగు డబ్బింగ్ హిందీ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తానవ్ 2, తృప్తి దిమ్రి బోల్డ్ అండ్ రొమాంటిక్ మూవీ విక్కీ విద్యా కా వో వాలా వీడియో చాలా స్పెషల్‌గా ఉన్నాయి.

6 మాత్రమే స్పెషల్

అయితే, వీటిలో ఒక తానవ్ 2, విక్కీ విద్యా కా వో వాలా రెండు మాత్రమే తెలుగులో అందుబాటులో ఉండగా.. హారర్ చిత్రం స్మైల్ 2 రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ వారం స్ట్రైట్ తెలుగు సినిమాల ఓటీటీలో రిలీజ్ లేనట్లుగా తెలుస్తోంది. ఏవైనా సడెన్ ఓటీటీ ఎంట్రీలు ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఇదిలా ఉంటే, ఈ వారం 21 సినిమాల్లో నాలుగు సినిమాలు, రెండు వెబ్ సిరీస్‌లతో 6 మాత్రమే స్పెషల్‌గా ఉన్నాయి.

తదుపరి వ్యాసం