Tripti Dimri As Santoor Mom: ఒకప్పటి సంతూర్ మమ్మీనే యానిమల్ బ్యూటి తృప్తి దిమ్రి.. గుర్తు పట్టారా? (వీడియో)
Tripti Dimri About Santoor Ad: యానిమల్ బ్యూటి తృప్తి దిమ్రి ఒకప్పటి సంతూర్ మమ్మీ అని చాలా మందికి తెలియదు. సినిమాల్లోకి రాకముందు సంతూర్ సోప్ అడ్వర్టైజింగ్‌లో తృప్తి దిమ్రి నటించినట్లు విక్కీ విద్యా కా వో వాలా వీడియో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా చెప్పుకొచ్చింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Tripti Dimri About Santoor Ad: ఒక్క సినిమా చాలు సూపర్ క్రేజ్ తెచ్చుకోడానికి. అలాంటి ఒక్క మూవీలు ఎంతోమంది సెలబ్రిటీల జీవితాల్లో ఉన్నాయి. తాజాగా అలా ఒక్క చిత్రంతో నేషనల్ వైడ్‌గా ఎనలేని క్రేజ్ తెచ్చుకున్న బ్యూటి తృప్తి దిమ్రి. సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన యానిమల్ చిత్రంతో సూపర్ పాపలర్ అయింది తృప్తి దిమ్రి.
విక్కీ విద్యా కా వో వాలా వీడియో మూవీ
యానిమల్ సక్సెస్‌తో వరుస సినిమాలతో దూసుకుపోతోంది న్యూ నేషనల్ క్రష్ తృప్తి దిమ్రి. ఇటీవలే కామెడీ బోల్డ్ మూవీ బ్యాడ్ న్యూజ్‌తో అలరించిన ముద్దుగుమ్మ తృప్తి దిమ్రి ఆ వెంటనే మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమానే విక్కీ విద్యా కా వో వాలా వీడియో. రాజ్ కుమార్ రావు, తృప్తి దిమ్రి హీరో హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమా అక్టోబర్ 11న విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.
రూ. 30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన విక్కీ విద్యా కా వో వాలా వీడియో మూవీకి ఐఎమ్‌డీబీ నుంచి 7.2 రేటింగ్ అందుకుంది. అయితే, తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా 'మాషబుల్ ఇండియా ది బాంబే జర్నీ' అనే టాక్ షోకి గెస్ట్‌లుగా వెళ్లారు తృప్తి దిమ్రి, రాజ్ కుమార్ రావు. ది బాంబే జర్నీ టాక్ షో లేటెస్ట్ ఎపిసోడ్‌లో రాజ్ కుమార్ రావు కారు డ్రైవ్ చేస్తుంటే.. పక్కన తృప్తి దిమ్రి కూర్చుంది. వెనుక సీట్‌లో హోస్ట్ కూర్చుని ప్రశ్నలు అడిగారు.
2016లో షూటింగ్
ఈ క్రమంలోనే తాను సంతూర్ యాడ్‌లో నటించినట్లు తృప్తి దిమ్రి చెప్పుకొచ్చింది. "మీరు ముంబై ఎప్పుడు వచ్చారు?" అని తృప్తిని హోస్ట్ అడిగారు. "నేను ముంబైకి మొదటిసారిగా 2016లో వచ్చాను. అప్పుడు నేను సంతూర్ యాడ్ ఛాన్స్ వచ్చింది. అందుకే ముంబైకి వచ్చాను" అని తృప్తి దిమ్రి చెప్పింది. దాంతో "అంటే నువ్ ముందు తల్లిగా నటించావా" అని రాజ్ కుమార్ రావు అడిగాడు.
దానికి "అవును, నేను తల్లిగా చేశాను" అని నవ్వుతూ చెప్పింది తృప్తి దిమ్రి. ఆ తర్వాత షూటింగ్ గురించి చెప్పుకొచ్చింది తృప్తి దిమ్రి. "నేను షూటింగ్ గురించి చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నాను. నాకు సినీ పరిశ్రమలో ఎలాంటి పాత్రలో అయినా పని చేయడం సంతోషంగా ఉంది. నేను మాద్ ఐలాండ్, మెరైన్ డ్రైవ్‌లో కూడా యాడ్ కోసం షూటింగ్ చేశాను. ముంబైకి కొత్తగా వచ్చాను కాబట్టి ఎక్కువ తిరిగాను" అని తృప్తి దిమ్రి తెలిపింది.
సంతూర్ యాడ్ వీడియో
సంతూర్ యాడ్‌లో నటించినట్లు తృప్తి దిప్రి చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే, తృప్తి దిమ్రి సంతూర్ యాడ్ వీడియో సైతం నెట్టింట్లో గింగిరాలు తిరుగుతోంది. ఇకపోతే సంతూర్ యాడ్‌లో నటించే మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ తల్లిపాత్రలో నటిస్తారని తెలిసిందే. అలాగే, తల్లి అయిన అందంగా కనిపించే మహిళలను సంతూర్ మమ్మీ అని పొగడటం చాలా సార్లు వినే ఉంటాం.
అందంగా కనిపించే మహిళలకు సంతూర్ మమ్మీ అనేది పర్యాయపదంగా మారింది. ఇక ఒకప్పటి సంతూర్ మమ్మీగా తృప్తి దిమ్రి నటించడం ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్‌గా మారింది. బాలీవుడ్‌లో సినిమాలు చేయడానికి ముందు పలు యాడ్స్ చేసింది తృప్తి దిమ్రి. అందులో భాగంగానే సంతూర్ యాడ్ చేసినట్లుగా తెలుస్తోంది.
టాపిక్