తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Anurag Thakur On Ott: రానా నాయుడు ఎఫెక్ట్ - వ‌ల్గారిటీని స‌హించేది లేద‌న్న‌ కేంద్ర మంత్రి

Anurag Thakur on OTT: రానా నాయుడు ఎఫెక్ట్ - వ‌ల్గారిటీని స‌హించేది లేద‌న్న‌ కేంద్ర మంత్రి

20 March 2023, 7:24 IST

  • Anurag Thakur on OTT: క్రియేటివిటీ ప‌రంగా ఓటీటీల‌కు స్వేచ్ఛ ఉంది త‌ప్పితే వ‌ల్గారిటీని పెంచేందుకు కాద‌ని కేంద్ర స‌మాచార ప్ర‌సార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నాడు. ఓటీటీలో పెరుగుతోన్న అశ్లీల‌త‌పై మంత్రి చేసిన కామెంట్స్ వైర‌ల్‌గా మారాయి.

రానా నాయుడు
రానా నాయుడు

రానా నాయుడు

Anurag Thakur on OTT: వెంక‌టేష్‌, రానా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన రానా నాయుడు వెబ్‌సిరీస్ ఇటీవ‌ల నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. ఈ సిరీస్‌లో బూతు డైలాగ్స్ అశ్లీల కంటెంట్ ఎక్కువ‌గా ఉండ‌టంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వినిపిస్తోన్నాయి. విజ‌య‌శాంతితో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు రానానాయుడు సిరీస్‌పై బ‌హిరంగంగానే విమ‌ర్శ‌లు చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Romeo OTT Release Date: విజయ్ ఆంటోనీ ‘రోమియో’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారు.. ఏ ప్లాట్‍ఫామ్‍లోకి వస్తుందంటే..

Manjummel Boys OTT Release: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మంజుమ్మల్ బాయ్స్: స్ట్రీమింగ్ వివరాలివే

Heeramandi OTT: 1920లో కరోనా వైరస్.. టీఆర్ఎస్: వెబ్ సిరీస్‍లో సంజయ్ లీలా భన్సాలీ పొరపాట్లు

Sundar C: దేశం గర్వించే చిత్రం అవుతుంది.. తెలుగు సినిమాపై తమిళ డైరెక్టర్ సుందర్ కామెంట్స్

బూతును న‌మ్ముకొని చేసిన సిరీస్ ఇదంటూ కామెంట్స్ చేశారు. సోష‌ల్ మీడియాలో రానానాయుడు సిరీస్‌ను నెటిజ‌న్లు ట్రోల్ చేస్తోన్నారు. ఓటీటీ కంటెంట్‌ను సెన్సార్‌షిప్ ప‌రిధిలోకి తీసుకురావాలంటూ ప్ర‌భుత్వాల‌కు సూచ‌న‌లు చేస్తోన్నారు. రానానాయుడుతో పాటు మ‌రికొన్ని వెబ్‌సిరీస్‌ల‌లో ఉప‌యోగించిన భాష‌, స‌న్నివేశాల‌పై ఫిర్యాదులు పెరుగుతోన్న‌ నేప‌థ్యంలో కేంద్ర స‌మాచార ప్ర‌సార శాఖ‌మంత్రి అనురాగ్ ఠాకూర్ ఓటీటీల‌పై కీల‌క‌మైన వ్యాఖ్య‌లు చేశాడు.

క్రియేటివిటీ పేరుతో వ‌ల్గారిటీని స‌హించేది లేద‌ని అనురాఠ్ ఠాకూర్ అన్నాడు. అశ్లీల‌త‌, అస‌భ్య‌క‌ర‌మైన కంటెంట్ పెరుగుతుంటే ప్ర‌భుత్వం చూస్తూ ఊరుకోద‌ని అన్నాడు. ఇందుకు సంబంధించి విధి విధానాల్లో మార్పులు చేయాల్సివ‌స్తే వాటిని ప‌రిగ‌ణ‌న లోకి తీసుకునేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని పేర్కొన్నాడు.

ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల‌కు క్రియేటివిటీ ప‌రంగా స్వేచ్ఛ ఇవ్వ‌బ‌డింది త‌ప్పితే అశ్లీల‌త పెంచేందుకు కాద‌ని కేంత్రి మంత్రి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు.ఆయ‌న కామెంట్స్ వైర‌ల్‌గా మారాయి.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.