తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rrr Re Release Date: థియేట‌ర్ల‌లో రీ రిలీజ్ కానున్న ఆర్ఆర్ఆర్ - అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్‌

RRR Re Release Date: థియేట‌ర్ల‌లో రీ రిలీజ్ కానున్న ఆర్ఆర్ఆర్ - అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్‌

18 January 2023, 7:54 IST

  • RRR Re Release Date: ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా న‌టించిన ఆర్ఆర్ఆర్ సినిమా మ‌రోసారి తెలుగులో రీ రిలీజ్ కానుంది. బుధ‌వారం నుంచి ఈ సినిమా అడ్వాన్స్‌ బుకింగ్స్ ఓపెన్ చేశారు.

ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్
ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్

ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్

RRR Re Release Date: ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ క్రేజ్ మారుమోగిపోతుంది. నాటు నాటు పాట‌కు ఇటీవ‌లే ప్ర‌తిష్టాత్మ‌క గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకొని ఈ సినిమా చ‌రిత్ర‌ను సృష్టించింది. జేమ్స్ కామెరూన్, స్టీవెన్ స్పిల్‌బ‌ర్గ్ లాంటి హాలీవుడ్ దిగ్గ‌జ ద‌ర్శ‌కులు సైతం ఈ సినిమాపై ప్ర‌శంస‌లు కురిపించారు.

ట్రెండింగ్ వార్తలు

Romeo OTT Release Date: విజయ్ ఆంటోనీ ‘రోమియో’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారు.. ఏ ప్లాట్‍ఫామ్‍లోకి వస్తుందంటే..

Manjummel Boys OTT Release: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మంజుమ్మల్ బాయ్స్: స్ట్రీమింగ్ వివరాలివే

Heeramandi OTT: 1920లో కరోనా వైరస్.. టీఆర్ఎస్: వెబ్ సిరీస్‍లో సంజయ్ లీలా భన్సాలీ పొరపాట్లు

Sundar C: దేశం గర్వించే చిత్రం అవుతుంది.. తెలుగు సినిమాపై తమిళ డైరెక్టర్ సుందర్ కామెంట్స్

ఇప్ప‌టికే బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌కు షార్ట్ లిస్ట్ అయిన ఈ సినిమా మ‌రికొన్ని విభాగాల్లోనూ పోటీప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్‌గా ఆర్ఆర్ఆర్ ఆస్కార్‌ను ద‌క్కించుకోవ‌చ్చున‌ని హాలీవుడ్ ఫిల్మ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

కాగా వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఆర్ఆర్ఆర్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా మ‌రోసారి ఈ సినిమా తెలుగులో రీ రిలీజ్ కానుంది. జ‌న‌వ‌రి 20న ఈ సినిమా మ‌రోసారి థియేట‌ర్ల ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్‌ను బుధ‌వారం నుంచి ఓపెన్ చేశారు. ప్ర‌స్తుతం బుక్ మై షో యాప్‌లో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ దేవి థియేట‌ర్ బుకింగ్స్ మొద‌ల‌య్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ప‌లు థియేట‌ర్ల‌లో ఈ సినిమా రీ రిలీజ్ కానున్న‌ట్లు తెలిసింది. ఐదు రోజుల పాటు ఈ సినిమా స్క్రీనింగ్ ఉండ‌బోతున్న‌ట్లు తెలిసింది.

బ్రిటీష్ టైమ్ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను తెర‌కెక్కించాడు. ఇందులో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామ‌రాజుగా రామ్‌చ‌ర‌ణ్ న‌టించారు. ఇద్ద‌రు పోరాట యోధులు క‌లిసి బ్రిటీష‌ర్ల‌పై సాగించిన పోరాటాన్ని ఎమోష‌న‌ల్‌గా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఈ సినిమాలో ఆవిష్క‌రించారు.

ఆర్ఆర్ఆర్ సినిమాలో బాలీవుడ్ అగ్ర న‌టి అలియాభ‌ట్ హీరోయిన్‌గా న‌టించింది. తెలుగులో ఆమెకు ఇదే తొలి సినిమా కావ‌డం గ‌మ‌నార్హం. హాలీవుడ్ న‌టి ఒలివియా మోరీస్ మ‌రో హీరోయిన్‌గా క‌నిపించింది. కాగా ఈ ఏడాది మార్చి 25న థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా 1200 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. టాలీవుడ్‌, బాలీవుడ్‌తో పాటు ప‌లు ఇండ‌స్ట్రీల‌లో హ‌య్యెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్‌గా ఆర్ ఆర్ ఆర్ నిలిచింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.