తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Macherla Niyojakavargam Ott Release Date: థియేట‌ర్ల‌లో విడుద‌లైన 4 నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న నితిన్ సినిమా

Macherla Niyojakavargam OTT Release Date: థియేట‌ర్ల‌లో విడుద‌లైన 4 నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న నితిన్ సినిమా

26 November 2022, 6:58 IST

  • Macherla Niyojakavargam OTT Release Date: నితిన్ (Nithiin)మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం సినిమా ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. శుక్ర‌వారం ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ఈ సినిమా ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ కానుందంటే...

అంజ‌లి, నితిన్‌
అంజ‌లి, నితిన్‌

అంజ‌లి, నితిన్‌

Macherla Niyojakavargam OTT Release Date: థియేట‌ర్ల‌లో విడుద‌లైన నాలుగు నెల‌ల త‌ర్వాత నితిన్ మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. డిసెంబ‌ర్ 9 నుంచి జీ5 ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. పొలిటిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాతో ఎడిట‌ర్ ఎం.ఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు.

ట్రెండింగ్ వార్తలు

Anil Ravipudi: దర్శకరత్న దాసరి జయంతి వేడుకలు.. ఐపీఎల్‌పై అనిల్ రావిపూడి కాంట్రవర్సీ కామెంట్స్

Aha OTT: ఓటీటీలో ఆహా అనిపించే 3 సినిమాలు.. అన్ని ఒకేదాంట్లో ఒకే రోజు నుంచి స్ట్రీమింగ్.. మీరు చూశారా?

Anand Devarakonda: బొంబాయి చట్నీ చేసిన కుర్రాడిగానే తెలుసు, కానీ.. ఆనంద్ దేవరకొండ కామెంట్స్

Brahmamudi: ఆఫీస్ సీసీ కెమెరాలో రాజ్ సీక్రెట్.. చూసేసిన కావ్య, అప్పు- వసుధార కొత్త స్కెచ్- మీరా షాక్‌లో మురారి, కృష్ణ

కెరీర్‌లో తొలిసారి రాజ‌కీయ నేప‌థ్య క‌థాంశంతో నితిన్ చేసిన ఈ సినిమా భారీ అంచ‌నాల‌తో ఆగ‌స్ట్ నెల‌లో థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. క‌థ‌, క‌థ‌నాల్లో కొత్త‌ద‌నం లోపించ‌డం, రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ ఫార్ములాలో ద‌ర్శ‌కుడు ఈ సినిమాను తెర‌కెక్కించ‌డంతో మాచ‌ర్ల నిజ‌యోక‌వ‌ర్గం ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌లేక‌పోయింది.

మాచ‌ర్ల క‌థేమిటి?

మాచ‌ర్ల ప్రాంతంలో ముప్పై ఏళ్లుగా ఎన్నిక‌లు జ‌ర‌గ‌కుండా చేస్తాడు రాజ‌ప్ప అనే రౌడీ. రాజ‌ప్ప‌ను ఎదురించి ధైర్యంగా పోరాడుతాడు సిద్ధార్థ్‌రెడ్డి అనే యువ ఐఏఎస్ ఆఫీస‌ర్‌. మాచ‌ర్ల‌లో ఎన్నిక‌లు నిర్వ‌హిస్తాన‌ని శ‌ప‌థం చేస్తాడు. ఆ ల‌క్ష్యాన్ని సిద్ధార్థ్‌రెడ్డి ఎలా చేరుకున్నాడ‌న్న‌దే ఈ సినిమా క‌థ‌.

మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం సినిమాలో కృతిశెట్టి హీరోయిన్‌గా న‌టించింది. ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ ప‌తాకంపై నితిన్ తండ్రి సుధాక‌ర్‌రెడ్డి, సోద‌రి నిఖితారెడ్డి నిర్మించారు. త‌మిళ న‌టుడు స‌ముద్ర‌ఖ‌ని విల‌న్‌గా న‌టించాడు. అత‌డు డ్యూయ‌ల్ రోల్‌లో న‌టించ‌డం గ‌మ‌నార్హం. సునీల్‌, వెన్నెల కిషోర్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.