తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns September 12th Episode: భాగీని పేరు పెట్టి పిలిచిన అమర్​.. కూతురు కోసం మనోహరి ఆరా.. మానవత్వం లేదన్న బాబ్జి​!

NNS September 12th Episode: భాగీని పేరు పెట్టి పిలిచిన అమర్​.. కూతురు కోసం మనోహరి ఆరా.. మానవత్వం లేదన్న బాబ్జి​!

Sanjiv Kumar HT Telugu

12 September 2024, 10:50 IST

google News
  • Nindu Noorella Saavasam September 12th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 12వ తేది ఎపిసోడ్‌‌లో భాగీని పేరు పెట్టి పిలుస్తాడు అమర్. దాంతో సంతోషంగా పరుగెత్తుకెళ్తుంది భాగీ. తర్వాత వినాయక చవితి సెలబ్రేషన్స్‌కు రామ్మూర్తి ఇంటికి వెళ్లి పిలుస్తారు అమర్, మిస్సమ్మ. 

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 12వ తేది ఎపిసోడ్‌‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 12వ తేది ఎపిసోడ్‌‌

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 12వ తేది ఎపిసోడ్‌‌

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 12th September Episode) ఈ ఇంటి కోడలు తల్లిదండ్రుల గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు కదా.. ఏమైంది మీ ఆయన వాళ్ల గురించి తెలుసుకున్నారా? అని అడుగుతుంది అరుంధతి.

నిజం తెలుసుకోవాలి

లేదంట అక్క అని భాగీ చెప్పగానే నాకెందుకో ఆయన అన్ని తెలుసుకుని ఉంటాడని అనిపిస్తుంది అంటుంది అరుంధతి. అవును అక్కా ఆయన ఆశ్రమానికి వెళ్లి వచ్చినప్పటి నుంచి ఏదోలా ఉన్నాడని చెప్తుంది భాగీ. అయితే నువ్వు ఆయన నుంచి నిజం తెలుసుకోవాలని అరుంధతి చెప్పడంతో అవునని భాగీ అంటుంది.

రణవీర్‌ కారుకు ఎదురుగా వెళ్తుంది మనోహరి. ఏంటి మనోహరి చావాలని అంత ఆశగా ఉందా? బతుకు మీద విరక్తి వచ్చిందా? నాకే ఎదురొస్తున్నావు అంటాడు రణ్​వీర్​. ఏం కావాలి నీకు చెప్పు ఏం కావాలి నీకు. ఎందుకు నన్ను ఇలా హింసిస్తున్నావు. మన పెళ్లిలో ప్రేమ లేదు నాకు నీతో బతకాలని లేదు. ఆ ఇంట్లో నాకు సంతోషమే లేదు అంటుంది మనోహరి.

దుర్గ.. తనతో నేను కోల్పోయిన జీవితం కావాలి. చెప్పు తిరిగి తెచ్చి ఇవ్వగలవా? నువ్వు చేసిన తప్పులకు నేను పాత రణవీర్‌ అయ్యుంటే నిన్ను ఎప్పుడో చంపేవాణ్ని అంటాడు రణ్​వీర్​. ఏంటి రణవీర్‌ నీ గురించి నాకు తెలిసి కూడా నీ కూతురుని నీకు అప్పగిస్తానని ఎలా అనుకున్నావు. నేను నీ కూతురును నీకు అప్పగించిన మరుక్షణం నువ్వు నన్ను ప్రాణాలతో వదలవని నాకు తెలుసు అంటుంది మనోహరి.

షాక్‌లో మనోహరి

ఏయ్‌ ఇన్ని సార్లు దుర్గ గురించి మాట్లాడావు కదా.. ఒక్కసారి కూడా నా కూతురు అని పలకవా? అని రణవీర్‌ అడగ్గానే పలకనని మన పెళ్లి సరిగ్గా జరగలేదని చెప్తుంది. దీంతో తిన్నింటి వాసాలు లెక్కపెట్టే నువ్వు.. నీ ఫ్రెండును చంపి తన జీవితాన్ని నీకు కావాలని తిరుగుతున్నావు చూడు అని రణవీర్‌ అనగానే మనోహరి షాక్‌ అవుతుంది. ఇంతలో తేరుకుని అమర్‌తో నా జీవితం సెట్‌ అయ్యేదాకా నీ కూతురు గురించి నీకు చెప్పను అంటుంది.

దీంతో కోపంగా నా కూతురు గురించి నీతోనే చెప్పిస్తానని వెళ్లిపోతాడు రణవీర్‌. ఫోన్‌ మాట్లాడుతున్న అమర్‌ మిస్సమ్మను భాగీ అని పేరు పెట్టి పిలుస్తాడు. కిచెన్‌‌లో ఉన్న భాగీ పరుగెత్తుకువెళ్తుంది. చూశావా ఒక్క పిలుపునకే ఇంతలా పరుగెడుతుంది అంటే ఇంక ప్రేమ పంచితే ఇంకెంత ఆనందిస్తుందో.. అంటాడు శివరామ్​. అవునండి అమర్‌ మిస్సమ్మను ప్రేమతో స్వీకరించే రోజు కోసం కోటి కళ్లతో ఎదురుచూస్తున్నానండి అంటుంది నిర్మల.

మిస్సమ్మ.. ఎంతసేపు.. అని అమర్‌ తిరిగి చూడగానే మిస్సమ్మ ఎదురుగా నిలబడి చూస్తుండిపోతుంది. హలో ఏంటి వచ్చి కూడా పలకవేంటి? అంటాడు అమర్​. మీరు నా పేరు పలుకుతుంటే బాగుంది. అందుకే పలకలేకపోయా? అనగానే అదేంటి ఎప్పుడు నీ పేరుతోనే కదా పిలుస్తాను అంటాడు అమర్​. ఎప్పుడూ మిస్సమ్మా అనేవారు. ఇప్పుడు భాగీ అన్నారు కదా? అంటుంది మిస్సమ్మ. నేను భాగీ అన్నానా? నేను మిస్సమ్మ అనే.. అంటూ తాను భాగీ అని పిలిచింది గుర్తు చేసుకుంటాడు అమర్‌.

ఇంటికెళ్లి పిలుద్దాం

దీంతో భాగీ హ్యాపీగా ఫీలవుతుంది. మిస్సమ్మ అని పిలవడం అలవాటైపోయింది. భాగీ అని పిలవడానికి కొంచెం టైం పడుతుంది. అని భాగీ చెప్పగానే వినాయకచవితి వస్తుంది కదా మీ నాన్న, పిన్నిని రమ్మని చెప్పు అందరం కలిసి సెలబ్రేట్‌ చేసుకుందాం అంటాడు అమర్. నేను పిలిస్తే రారని.. అదే మీరు పిలిస్తే వస్తారు అని భాగీ చెప్పగానే నువ్వు రెడీ అవ్వు మీ ఇంటికే వెళ్లి పిలుద్దాం అని అమర్‌ అంటాడు. దానికి మరింత హ్యాపీగా ఫీల్ అవుతుంది భాగీ.

మనోహరి, బాబ్జీని కలిసి రణవీర్‌ను ఏదో ఒకటి చేయాలని చెప్తుంది. చంపేద్దామా అని బాబ్జీ అనగానే మీ అందరికీ రణ్​వీర్​ గురించి తెలియదు. వాడిని చంపడం అంత తేలిక కాదు. ముందు వాడి కూతురు ఎక్కడ ఉందో తెలుసుకుని దాన్ని నా ఆధీనంలోకి తీసుకోవాలి. నువ్వు వెంటనే కలకత్తా వెళ్లి మథర్​ థెరిస్సా అనాథాశ్రమానికి వెళ్లి ఆ పాప ఏమైందో కనుక్కో అంటుంది మనోహరి.

మీరూ ఒక అనాథ అయ్యుండి మీ కన్నకూతురికి అలాంటి జీవితం ఎందుకు ఇవ్వాలనుకున్నారు. మీకసలు మానవత్వం లేదా? అని అడుగుతాడు బాబ్జీ. నా పగ, ప్రేమ, ప్రతీకారం ముందు ఏదైనా నా లెక్కలోకి రాదంటుంది మనోహరి. దాంతో ఏం మాట్లాడలేక అక్కడ నుంచి వెళ్లిపోతాడు బాబ్జీ. రామ్మూర్తి పడుకుని ఉంటే మంగళ తిడుతుంది. ఏం సాధించావని ప్రశాంతంగా ఉన్నావని అడుగుతుంది.

వినాయక చవితి సంబురాలు

ఇద్దరూ గొడవపడుతుంటే ఇంతలో భాగీ, అమర్‌ వస్తారు. వినాయకచవితికి రమ్మని పిలవగానే రామ్మూర్తి మొహమాట పడుతుంటాడు. వినాయక చవితి సంబరాల్లో ఏం జరగనుంది? మనోహరి తన కూతురు ఎవరో కనుక్కుంటుందా? అనే విషయాలు తెలియాలంటే సెప్టెంబర్​ 13న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!

తదుపరి వ్యాసం