NNS August 29th Episode: భర్తను కొడతానన్న మిస్సమ్మ- పిల్లలను కాపాడిన అమర్ జేడీ- మనోహరికి మంగళ ఎదురుదెబ్బ- అరుంధతితో భాగీ
Nindu Noorella Saavasam August 29th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఆగస్ట్ 29వ తేది ఎపిసోడ్‌లో పిల్లల కోసం తీవ్రవాదుల దగ్గరికి వెళ్తున్న అమర్‌ను ప్రేమగా హగ్ చేసుకుంటుంది మిస్సమ్మ. వస్తానో రానో అన్న అమర్‌ను హీరోలా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడితే కొడతానని అంటుంది.
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 29th August Episode) అమర్, జేడీ ప్లాన్ ప్రకారం అంజుకి అస్తమా అని నమ్మించి లోపలకు ఒక ఇన్హేలర్ పంపిస్తారు. అంజు సిగ్నల్ ఇవ్వడంతో అమర్ లోపలకు వెళ్లేందుకు సిద్ధమవుతాడు. మిస్సమ్మను లోపలికి తీసుకురమ్మని రాథోడ్‌కు చెప్తాడు. మిస్సమ్మ లోపలికి వస్తుంది.
హగ్ చేసుకున్న మిస్సమ్మ
నేను లోపలికి వెళ్తున్నాను మిస్సమ్మ. నేను తిరిగి వస్తానో రానో తెలియదు కానీ పిల్లలు మాత్రం కచ్చితంగా తిరిగి వస్తారు. నేను ఉన్నా లేకున్నా అమ్మా నాన్న పిల్లలను నువ్వు చూసుకుంటావన్న ధైర్యంతోనే నేను వెళ్తున్నాను. ఆరు తర్వాత నాకా ధైర్యం ఇచ్చింది నువ్వే. ఇది చెప్పడానికే పిలిపించాను జాగ్రత్త… వెళ్దామా? అని అంటాడు అమర్. ఏవండి అంటూ వచ్చి అమర్‌ను హగ్ చేసుకుంటుంది మిస్సమ్మ.
ఏంటి పెద్ద హీరో లాగా మీ ఇష్టం వచ్చినట్టు చెప్పి వెళ్లిపోతున్నారు. అనవసరంగా ఏడిపించారు. ఇంకోసారి నేను రాను నువ్వే చూసుకోవాలి అంటే నిజంగా కొడతాను అంటుంది మిస్సమ్మ. అది కాదు నేను చెప్పేది అంటూ అమర్ నచ్చజెప్పాలని చూస్తాడు. అయినా మీరు రాకపోతే ఎవర్ని టార్చర్ పెట్టాలి. ఎవరితో గొడవ పెట్టుకోవాలి. ఇంకా ఏం చూస్తున్నారు వెళ్లి పిల్లల్ని తీసుకుని రండి అని మిస్సమ్మ అనగానే అమర్ వెళ్లిపోతాడు.
లైట్ వేసి సిగ్నల్
జేడీ, అమర్ వెళ్లి తీవ్రవాదులు ఉన్న రూం దగ్గర ఇన్ హేలర్ పెడతాడు. ఒక తీవ్రవాది వచ్చి అది తీసుకుని లోపలికి వెళ్లిపోతాడు. ఇన్ హేలర్ తీసుకున్న అంజు అందులో ఇన్ఫర్మేషన్ చూసి రిప్లై ఇస్తుంది. తర్వాత జేడీ సిగ్నల్ లైట్ వేస్తుంది. దీంతో అంజు అమ్మో ఎలుక అని అరుస్తుంది. అదే సరైన సమయం అని జేడీ, అమర్ తమ ప్లాన్ అమలు చేస్తారు.
లోపల ఫైరింగ్ జరిగినా ఎవరికీ ఏం జరగకుండా జాగ్రత్తగా చూసుకోమని రాథోడ్‌కి చెప్పి లోపలకు వెళ్తాడు అమర్. చాలాసేపు పోరాడిన జేడీ, అమర్ ఉగ్రవాదులను ఎదుర్కొని పిల్లల్ని కాపాడతారు. మరోవైపు మంగళ బట్టలు ఇస్త్రీ చేసి పెట్టి రామ్మూర్తిని కాకా పట్టాలని చూస్తుంది. అనుకోని మార్పుకు ఆశ్చర్యపోతాడు రామ్మూర్తి.
కొట్టబోయిన రామ్మూర్తి
అనాథ శరణాలయానికి వెళ్లి నీ పెద్దకూతురు వివరాలు కనుక్కుని రమ్మని రామ్మూర్తిని పంపిచాలని చూస్తుంది మంగళ. ఉన్నట్టుండి నా కూతురు గురించి ఎందుకు ఆరా తీస్తున్నావు అని నిలదీస్తాడు రామ్మూర్తి. ఏం చెప్పాలో అర్థంకాక హాస్పిటల్‌లో ఉన్నప్పుడు వచ్చిన ఫోన్‌కాల్ గురించి చెబుతుంది. మంగళ కావాలనే చేస్తుందని కోపంతో కొట్టబోతాడు రామ్మూర్తి. మెల్లిగా నచ్చజెప్పి రామ్మూర్తిని ఆశ్రమానికి పంపిస్తుంది మంగళ.
తన ప్లాన్ ప్రకారం అరుంధతి గురించిన నిజం రామ్మూర్తికి తెలియబోతోందని, ఆ మనోహరి ప్లాన్లన్నీ ఇక బూడిదలో పోసిన పన్నీరే అని సంబరపడిపోతుంది మంగళ. తనవల్లే అందరూ క్షేమంగా బయటపడ్డారంటూ అతి చేయాలని చూస్తుంది అంజు. కానీ, ఎవరూ పట్టించుకోకపోవడంతో గట్టిగా అరిచి హడావిడి చేస్తుంది. మీతోపాటు స్కూల్ పిల్లల్ని కాపాడి టెర్రరిస్ట్‌లని పట్టుకునేలా చేశాను అని బడాయి పోతుంది.
చిరాకు పడిన మనోహరి
మరీ ఎక్కువ చేస్తున్నావంటూ పిల్లలందరూ అంజుని ఏడిపిస్తారు. పిల్లల్ని పిక్నిక్ తీసుకెళ్లేలా ఒప్పించమని భాగీని పంపిస్తాడు శివరామ్. ఉన్నట్లుండి ఇప్పుడు పిక్నిక్ ఎందుకు అని చిరాకు పడుతుంది మనోహరి.
శివరామ్ పిక్నిక్ ప్లాన్‌తో అమర్, భాగీ దగ్గరవుతారా? భాగీ అడ్డు తప్పించుకునేందుకు మనోహరి ఏం చేయబోతోంది? అనే విషయాలు తెలియాలంటే ఆగస్ట్ 30న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!