NNS August 23rd Episode: మనోహరికి షాక్ ఇచ్చిన మంగళ.. బ్లాక్‌మెయిలర్ గుట్టు రట్టు.. అమర్‌కి ఉగ్రవాదుల బాంబు బెదిరింపులు
Nindu Noorella Saavasam August 23rd Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఆగస్ట్ 23వ తేది ఎపిసోడ్‌లో తనను ఇన్ని రోజులు బ్లాక్‌మెయిల్ చేసింది మంగళ అని తెలుసుకుని పెద్ద షాక్‌కు గురి అవుతుంది మనోహరి. మరోవైపు అమర్‌కు ఉగ్రవాదుల నుంచి బాంబు బెదిరింపులు వస్తాయి. ఇలా నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో..
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 23rd August Episode) పిల్లలు తినే ఆహారంలో మనోహరి విషం కలిపిన వీడియో అమర్‌కు పంపిస్తానని బెదిరిస్తాడు బ్లాక్‌మెయిలర్. అమర్‌కి ఎట్టిపరిస్థితుల్లో ఆ విషయం తెలియకూడదని, నీకేం కావాలన్నా ఇస్తాను అంటుంది మనోహరి.
వీడియో డిలీట్ చేయాలి
అయిదు కోట్లు నేను చెప్పిన చోటుకి తీసుకుని రా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు బ్లాక్‌మెయిలర్. చేసేదేం లేక డబ్బు తీసుకుని వస్తుంది మనోహరి. ఆ సూట్ కేసు అక్కడ పెట్టేసి నువ్వు అక్కడి నుంచి వెళ్లిపో అని బ్లాక్‌మెయిలర్ అనడంతో ఏయ్ సూట్ కేసు అక్కడ పెట్టేసి వెళ్లిపోవడం ఏంటి? నేను నీకు డబ్బులు ఇవ్వాలంటే నా కళ్ల ముందే నువ్వు ఆ వీడియో డిలీట్ చేయాలి అంటుంది మనోహరి.
ఏంటి మనోహరి వాయిస్ పెరుగుతుంది. నేను చెప్పింది చేయడం తప్పా ప్రశ్నించే హక్కు నీకు లేదు. కాదు కూడదు అంటే నేనేం చేస్తాను నీకు తెలుసు కదా? అంటూ ఆ వ్యక్తి బెదిరించడంతో మనోహరి డబ్బుల అక్కడ పెట్టి వెళ్లిపోతుంది. తర్వాత బుర్ఖా వేసుకున్న ఒక మహిళ ఆటోలో వచ్చి ఆ సూటుకేసు తీసుకెళ్తుంది. అంతా గమనించిన మనోహరి ఆటోకు అడ్డుగా వెళ్లి నిలబడుతుంది.
వీడియో తీశాను
మనోహరి నుంచి ఆ బుర్ఖా వేసుకున్న వ్యక్తి తప్పించుకుని పారిపోతుంది. పారిపోయిన వ్యక్తిని పట్టుకుని బుర్ఖా తీసి చూసి షాక్ అవుతుంది మనోహరి. బుర్ఖాలో ఉన్నది మంగళ. నువ్వా.. నన్ను ఇన్నాళ్లు బెదిరించింది అని షాకవుతుంది మనోహరి. అవును.. ఆరోజు మీ ఇంటికి వచ్చాను. నువ్వు విషం కలపడం చూసి వీడియో తీశానని ఒప్పుకుంటుంది మంగళ.
మరోవైపు మిస్సమ్మ చెప్పిన మాటలు గుర్తు చేసుకుని ఆకాష్ చెస్‌లో గెలుస్తాడు. ఆనంద్ కూడా బాడ్మింటన్‌లో గెలుస్తాడు. అమ్ము స్పీచ్ విభాగంలో పాల్గొంటుంది. తన టాపిక్ అమ్మ గురించి అని చెప్తుంది. తన అమ్మ గురించి గొప్పగా చెప్తుంది. దీంతో మిస్సమ్మ, అరుంధతి ఎమోషనల్ అవుతారు. పిల్లలు తనని అమ్మస్థానంలో చూస్తున్నందుకు సంతోషపడుతుంది మిస్సమ్మ.
వేడుకల్లో ప్రమాదం
కనీసం అమ్ము అయినా మిస్సమ్మ ప్రేమను అర్థం చేసుకుందనుకుంటుంది అరుంధతి. పిల్లలు అన్ని గేమ్స్‌లో గెలవడంతో సంతోషంగా ఉంటారు. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా చేయాలని స్కూల్ లీడర్‌గా అమ్ము ప్లాన్ చేస్తుంది. చీఫ్ గెస్ట్‌గా ఎవర్ని పిలుద్దామా? అని ఆలోచిస్తారు పిల్లలు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఏదో ప్రమాదం జరగబోతోందని అమర్‌కి ఇన్ఫర్మేషన్ రావడంతో అలర్ట్ అవుతాడు.
స్కూల్ చుట్టూ బందోబస్త్ ఏర్పాటు చేస్తాడు. ఉగ్రవాది అలీని పోలీసుల నుంచి విడిపించడమే ఎజెండాగా స్కూల్లో బాంబు పేలుళ్లకి ప్లాన్ వేస్తారు ఉగ్రవాదులు. ఏకంగా అమర్‌కి ఫోన్ చేసి లెఫ్టినెంట్ సార్ బాంబ్ ఎక్కడ పెట్టాలో చెప్తారా? అని అడుగుతారు. ఆ గొంతు విన్న అమర్ వెంటనే రాథోడ్‌కి చెప్పి ఆ నెంబర్ని ట్రేస్ చెయ్యమని చెబుతాడు.
బాంబులు ఎక్కడ పెట్టారో
తన కంట్రోల్లో ఉన్న అలీని తీసుకుని ఇండియా బార్డర్ కాదుకదా.. హైదరాబాద్ కూడా దాటలేవని చాలెంజ్ చేస్తాడు అమర్. బాంబులు ఎక్కడెక్కడ పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారో తెలుసుకోవాలని వెంటనే గన్ తీసుకుని బయల్దేరతాడు అమర్.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఏం జరగబోతోంది? ముఖ్య అతిథిగా ఎవరు వస్తున్నారు? అమర్ ఉగ్రవాదుల ప్లాన్‌ని ఎలా ఎదుర్కొంటాడు? అనే విషయాలు తెలియాలంటే ఆగస్ట్ 24న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!