NNS August 28th Episode: అమర్ జేడీ సీక్రెట్ ప్లాన్- తీవ్రవాదులకు అబద్ధం చెప్పిన అంజు- మనోహరికి మిస్సమ్మ వార్నింగ్
Nindu Noorella Saavasam August 28th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఆగస్ట్ 28వ తేది ఎపిసోడ్‌లో రాఖీ భాయ్‌ను విడిపించేందుకు ప్రభుత్వం ఒప్పుకుందని తీవ్రవాదులకు అమర్ వాళ్లు చెబుతారు. తర్వాత వాళ్లకు తెలియకుండా అమర్ జేడీ కలిసి సీక్రెట్‌గా ప్లాన్ అమలు చేస్తారు. తీవ్రవాదులకు అంజు అబద్ధం చెబుతుంది.
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 28th August Episode) ఉగ్రవాదులు పిల్లల్ని కిడ్నాప్ చేయడంతో అందరూ కంగారు పడుతుంటారు. ఏం చేద్దామని అమర్‌ను అడుగుతుంది జేడీ. ఏదిఏమైనా రాఖీని వదిలే ప్రసక్తే లేదు అంటాడు అమర్.
ఫైట్ చేస్తామని
పై ఆఫీసర్‌కు ఫోన్ చేసి అక్కడి పరిస్థితి వివరిస్తాడు అమర్. రాఖీని మనం అప్పగిస్తున్నామని.. అతన్ని అక్కడికి తీసుకుని రావడానికి 8 గంటలు అవుతుందని చెప్పండని అంటాడు పై అధికారి. మేము ఫైట్ చేస్తామని పై అధికారిని అడిగితే ఆయన పర్మిషన్ ఇస్తాడు. మరోవైపు మిస్సమ్మ పిల్లల కోసం ఏడుస్తుంది.
ఇప్పుడు కానీ ఇది పిల్లల్ని కాపాడటానికి ఏమైనా చేస్తే అమర్ దృష్టిలో ఇది మంచిదై పోతుంది. ఏదో ఒకటి చేసి దీన్ని ఇంటికి తీసుకెళ్లాలి. బాధపడకు మిస్సమ్మ. అమర్ ఏదో ఒకటి చేసి పిల్లల్ని ఇంటికి తీసుకొస్తాడు. మనం ఇంటికి వెళ్దాం రా.. అంటుంది మనోహరి. నీ ముసలి కన్నీళ్లు, నాటకాలు వేరే వారి దగ్గర చూపించు నా దగ్గర కాదు. నా పిల్లలు నాతో పాటు వచ్చే వరకు నేను ఇక్కన్నుంచి కదలను. నీకు అంతగా వెల్లాలని ఉంటే నువ్వు వెళ్లు అని వార్నింగ్ ఇస్తుంది మిస్సమ్మ.
బాధ్యతను అర్థం చేసుకోగలను
రాథోడ్‌ను పిలిచి తనను ఒక్కసారి ఆయన దగ్గరకు తీసుకెళ్లమని అడుగుతుంది. రాథోడ్, అమర్ దగ్గరకు వెళ్లి చెప్పగానే వద్దని చెప్తాడు. దీంతో మిస్సమ్మ ఏడుస్తుంది. జేడీ మిస్సమ్మ దగ్గరకు వెళ్తుంది. హలో భాగమతి.. ఐ యామ్ జేడీ. ఒక ఆడపిల్లగా మీ బాధని. పిల్లల గురించి మా భయాన్ని అర్థం చేసుకోగలను. అలాగే ఒక ఆఫీసర్‌లా ఆయన బాధ్యతను కూడా అర్థం చేసుకోగలను. ఇప్పుడు మీరొచ్చి ఆయనతో మాట్లాడటం వల్ల ఆయన ఎమోషనల్ అవుతారు అంటుంది జేడీ.
థాంక్యూ.. అయినా నేను ఆయన్ని కలవాలన్నది. పిల్లల కోసమే కాదు. లోపల ఉన్నది పిల్లలు మాత్రమే కాదు. ఆయన ప్రాణం. పిల్లలకు చిన్న గీత పడకుండా తీసుకొస్తారని తెలుసు అని మిస్సమ్మ చెప్తుంటే.. అమర్ వింటాడు. ఎమోషనల్‌గా ఫీలవుతాడు. తీవ్రవాదులు పిల్లలను వచ్చి అమర్ పిల్లలు ఎవరని అడిగితే అంజు లేచి నేనే అని ధైర్యంగా చెప్తుంది. మీరు నన్నేం చేయలేరని.. మా మీద చిన్న గీత కూడా పడకుండా మమ్మల్ని తీసుకెళ్తారని చెప్తుంది.
అరుంధతి కన్నీళ్లు
ఇంతలో అమర్ ఫోన్ చేసి మీ కండీషన్స్‌కు ప్రభుత్వం ఒప్పుకుందని ఇంకో మూడు గంటల్లో ఇక్కడికి వస్తాడని అమర్ చెప్తాడు. మీరు చెప్పినట్టు చేయకపోతే ముందు చంపేది అమర్ పిల్లల్నే అని తీవ్రవాది వార్నింగ్ ఇస్తాడు. అయితే సీక్రెట్ ఆపరేషన్ చేయడానికి అమర్, జేడీ ప్లాన్ చేస్తుంటారు. మరోవైపు ఆరు ఏడుస్తూ కూర్చుని ఉంటుంది. ఆరు పక్కనే మిస్సమ్మ వచ్చి మీ పిల్లలు కూడా లోపలే ఉన్నారా అక్క అని అడగ్గానే అవును అని ఏడుస్తుంది.
మరేం పర్వాలేదక్కా.. మరికాసేపట్లో ఆయన జేడీ అనే పెద్ద ఆఫీసర్‌తో కలిసి పిల్లల్ని కాపాడేస్తారు అంటుంది మిస్సమ్మ. ప్రిన్సిపల్‌ని అడిగి స్కూల్లో సీక్రెట్ ప్లేసేస్ గురించి కనుక్కొని ఒక ప్లాన్ వేస్తారు అమర్, జేడీ. అంజుకి ఆరోగ్యం బాలేదని, అస్తమా ఉందని చెప్తారు. అది నమ్మని వాళ్లు అంజుని అడుగుతారు. అంజు తెలివిగా అవునని అబద్ధం చెబుతుంది.
అమర్ జేడీ ప్లాన్ ఏంటీ?
అమర్, జేడీల ప్లాన్ ఏంటి? అమర్, జేడీ పిల్లల్ని కాపాడతారా? రాఖీ భాయ్‌ని వదిలేస్తారా? అనే విషయాలు తెలియాలంటే ఆగస్ట్ 29న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!