NNS August 27th Episode: మేకప్‌లో కెమికల్- ప్రిన్సిపల్‌తో మనోహరి చెత్త ప్లాన్- ఉగ్రవాదుల చెరలో పిల్లలు- రంగంలోకి జేడీ
Nindu Noorella Saavasam August 27th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఆగస్ట్ 27వ తేది ఎపిసోడ్‌లో పిల్లలు పర్ఫామెన్స్ చేయకుండా ఉండేందుకు దురద పుట్టే కెమికల్ కలుపుతుంది మనోహరి. కానీ, అది ఫెయిల్ అవుతుంది. అమర్ పిల్లలను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి డిమాండ్స్ అడుగుతారు. దాంతో జేడీ ఎంట్రీ ఇస్తాడు.
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 27th August Episode) పిల్లలు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఇచ్చే ప్రదర్శనలు చెడగొట్టేందుకు ప్రిన్సిపల్‌తో కలిసి ప్లాన్ చేస్తుంది మనోహరి. పిల్లలకు వేసే మేకప్‌లో దురద వేసే కెమికల్ కలుపుతుంది. అది తెలియని మిస్సమ్మ పిల్లలకి మేకప్ వేస్తుంది.
పిచ్చి పట్టిన వాళ్లలా
మేకప్ పూర్తయిన తర్వాత పిల్లలను చూసి మిస్సమ్మ, అరుంధతి హ్యాపీగా ఫీలవుతారు. మనోహరి మాత్రం తాను చేసిన పని గుర్తు చేసుకుని నీ మేకప్ వేసుకుని పిల్లలు ఫర్మామెన్స్ చేయడం కాదే పిచ్చి పట్టిన వాళ్లలా గోక్కుంటారు. అప్పుడు అమర్ చేతిలో నీకుంటుంది కదా? అని మనసులో అనుకుంటుంది.
ఆ పొట్టి దాని కళ్లల్లో కన్నీళ్లు చూడటానికి నువ్వు నాకు హెల్ఫ్ చేస్తానన్నావు. ఏదైనా ప్లాన్ చేశావా? అంటుంది ప్రిన్సిపల్. చేశాను అంటూ థమ్స్అప్ సింబల్ చూపిస్తుంది మనోహరి. వాళ్లిద్దరి సైగలు చూసిన అరుంధతి అదెందుకు ఆవిడకు థమ్స్ అప్ చెప్తుంది. కొంపదీసి పిల్లల ఫర్మామెన్స్ చెడగొట్టడానికి ఇద్దరూ కలిసి ఏమైనా ప్లాన్ చేశారా? కచ్చితంగా ఏదో చేసినట్టు ఉన్నారు. ఈ రాక్షసి నా పిల్లల్ని ఎప్పుడూ ప్రశాంతంగా ఉండనివ్వదు అనుకుంటుంది అరుంధతి.
మరోవైపు ఉగ్రవాదులు బాంబులు పేల్చడానికి రెడీ అవుతుంటారు. అమరేంద్ర ఎక్కడున్నాడో కనుక్కోమని ఒక ఉగ్రవాదిని బయటకు పంపిస్తారు. మరోవైపు స్కూల్‌లో స్టేజీ ఫర్మామెన్స్ మొదలవుతుంది. అంజలిని భరతమాత డాన్స్ చేయడానికి స్టేజీ మీదకు పిలుస్తారు. పిల్లలు ఫర్మామెన్స్ బాగానే చేస్తుంటారు. మనోహరి ఇరిటేటింగ్‌గా ఫీలవుతుంది. ఏమైంది..? అంటుంది ప్రిన్సిపల్. అదే తెలియడం లేదు అంటుంది మనోహరి.
ఇదే కరెక్ట్ టైమ్
హమ్మయ్యా.. ఇది కంగారు పడుతుందంటే.. దీని ప్లాన్ ఫెయిల్ అయ్యిందన్నమాట. థాంక్ గాడ్ అనుకుంటుంది అరుంధతి. ఇంతలో అమర్ స్కూల్‌లోకి వస్తాడు. లోపల ఫంక్షన్ మొదలయ్యి ఎంత టైం అవుతుందని అక్కడ కాపలాగా ఉన్న సోల్జర్ని అడుగుతాడు. 40 నిమిషాలు అవుతుంది సార్ అనగానే అంటే ఇంకో రెండు గంటల్లో ఫ్రొగ్రాం మొదలవుతుంది కాబట్టి అటాక్ చేయడానికి ఇదే సరైన సమయం. ఈ పాటికే వాళ్లు వాళ్ల ప్లాన్ ఇంప్లిమెంట్ చేసేసి ఉంటారు. ఏ క్షణమైన అటాక్ చేసే చాన్స్ ఉంది. మనం వెంటనే లోపలికి వెళ్లాలి. రాథోడ్ బ్యాక్‌అప్ రమ్మని చెప్పు అంటాడు.
అమరేంద్ర పిల్లలు ప్రదర్శనలు ఇస్తున్నారంటే స్టేజీ ముందు వరుసల్లోనే కూర్చుంటారు వారిని తీసుకొస్తే సరిపొతుంది అని ప్లాన్ చేస్తారు ఉగ్రవాదులు. ప్లాన్ ప్రకారం ముగ్గురు ఉగ్రవాదులు పిల్లలను కిడ్నాప్ చేయడానికి స్టేజీ వైపు వెళ్తారు. ఇంతలో జగధాత్రి టీం అక్కడకు వస్తుంది. అమర్ తన టీంతో కలిసి టెర్రరిస్టులను పట్టుకోవడానికి స్కూల్‌లో వెతుకుతుంటారు. రూథర్‌ఫర్డ్ వేషం వేసిన బంటి గోక్కుంటూ స్టేజీ దిగి పారిపోతాడు.
బంటిని చూసిన మనోహరి ఫాలో అవుతుంది. రేయ్ ఎందుకు గోక్కుంటున్నావురా..? అని అడుగుతుంది. దురద వస్తే గోక్కోకుండా ఏం చేయాలి అంటాడు బంటీ. రేయ్ అది కాదురా అ దురద నీకెందుకు వస్తుంది అని ఆశ్చర్యపోతుంది మనోహరి. ఏం నేను మనిషిని కాదా? నాకు దురద రాకూడదా? అంటాడు బంటీ. అయ్యో రాకూడదని కాదురా? నీకెలా వస్తుంది అని.. కొంపదీసి అమ్ము వాళ్ల మేకప్ కిట్ ఏమైనా తీసుకున్నావా? అని మనోహరి అడగ్గానే బంటి షాక్ అవుతాడు.
పిల్లలు కిడ్నాప్
అది అని బంటి నసుగుతుంటే.. ఓరేయ్ నిజం చెప్పు లేదంటే నిన్ను చంపేస్తాను. అనగానే అవును తీసుకున్నాను ఇప్పుడేంటి అని ఎదురు ప్రశ్నించగానే మనోహరి ఇరిటేటింగ్‌గా ఫీలవుతుంది. పక్క నుంచి గమనిస్తున్న ఆరు నవ్వుకుంటుంది. స్టేజీ దగ్గర స్మోక్ బాంబు వేసిన ఉగ్రవాదులు పిల్లలను కిడ్నాప్ చేసి ఒక రూంలో బంధిస్తారు. ఇంతలో అమర్ స్కూల్ లాండ్ ఫోన్‌కు కాల్ చేస్తాడు. ఉగ్రవాదులను మీకేం కావాలని అడుగుతాడు.
మేము సేఫ్‌గా బార్డర్ దాటాలని డిమాండ్ చేస్తారు. ఉగ్రవాదులను ప్లాన్ తిప్పికొట్టి వాళ్లపై అటాక్ చేయడానికి అమర్, జేడీ కలిసి ప్లాన్ చేస్తారు. అప్పుడే అక్కడకు వచ్చిన భాగీ పిల్లల్ని కాపాడే ప్రయత్నంలో ఆయనకి ఏం ప్రమాదం జరగకుండా చూసుకోమని జేడీని వేడుకుంటుంది. పక్కనే ఉన్న అమర్ ఆ మాటలు వింటాడు.
అమర్, జేడీ పిల్లల్ని కాపాడటానికి స్కూల్ లోపలకు వెళ్తారు. ఉగ్రవాదుల బారి నుంచి పిల్లలు బయటపడతారా? మనోహరి తదుపరి ప్లాన్ ఏంటి? పిల్లల్ని కాపాడేందుకు మిస్సమ్మ ఏం చేయబోతోంది? అనే విషయాలు తెలియాలంటే ఆగస్ట్ 28న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!