NNS 31st August Episode: భాగీని కాపాడిన నిర్మల.. నిరాశలో మంగళ.. నిజం తెలుసుకోనున్న మిస్సమ్మ!
NNS 31st August Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ శనివారం (ఆగస్ట్ 31) ఎపిసోడ్లో భాగీని అమర్ తిట్టకుండా నిర్మల కాపాడుతుంది. ప్లాన్ ఫెయిలైనందుకు మనోహర్ ఫీలవగా.. తన కూతురి గురించి మరోసారి రామ్మూర్తికి నిరాశే ఎదురవతుంది.
NNS 31st August Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (ఆగస్ట్ 31) ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అమర్, భాగీ దగ్గరగా ఉండటం చూసి తట్టుకోలేని మనోహరి.. భాగీని చంపేందుకు ప్లాన్ చేస్తుంది. కిచెన్లోకి వెళ్లి గ్యాస్ లీక్ చేస్తుంది. గ్యాస్ వాసన రావడంతో అందరూ హాల్‌లోకి వస్తారు. అమర్ కిచెన్ లోకి వెళ్లి గ్యాస్ ఆఫ్ చేస్తాడు.
మిస్సమ్మను కాపాడిన నిర్మల
మిస్సమ్మ కొంచెమైనా సెన్స్ ఉందా? ఇంట్లో పెద్దవాళ్లు పిల్లలు ఉన్నారు కొంచెమైనా బాధ్యత ఉండక్కర్లేదా? జస్ట్ మిస్.. అమర్ ఆఫ్ చేశాడు. అదే అంజు లాంటి వాళ్లు కిచెన్‌లోకి వెళ్లుంటే.. అమర్ నువ్వేం మాట్లాడవేంటి? అంటుంది మనోహరి. మిస్సమ్మ స్టవ్ ఆన్ లో ఉంచింది నువ్వేనా? అని అడుగుతాడు అమర్. అమర్ కిచెన్ లోకి తను తప్పా ఇంకెవరు వెళ్లరు కదా? అంటుంది మనోహరి.
అది తనని చెప్పనివ్వు.. అంటాడు అమర్. కాఫీ పెట్టింది నేనేనండి. కానీ స్టవ్ ఆఫ్ చేసింది నాకు బాగా గుర్తు ఉంది అంటుంది మిస్సమ్మ. చిన్న తప్పును పట్టుకుని అమర్ కు కోపం పెంచేలా ఉందేంటి ఈ పిల్ల అనుకుంటూ నాన్నా.. అమర్ ఇందులో మిస్సమ్మ తప్పేం లేదు. ఇందాక మీ నాన్నకు వేడి నీళ్లు పెడదామని ఆన్ చేసి ఆఫ్ చేయడం మర్చిపోయాను అంటుంది నిర్మల.
ఆంటీ మీరు వెళ్లారా? నేను చూడలేదే? అంటుంది మనోహరి. ఏమ్మా.. ఇలా గ్యాస్ లీక్ అవుతుందని ముందే ఊహించి కిచెన్ లోకి వెళ్లే వాళ్లను వచ్చే వాళ్లను చూడటమేనా నీ పని అంటాడు శివరామ్. గ్యాస్ లాంటి విషయాల్లో ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి అమ్మా.. అని చెప్పి అమర్ వెళ్లిపోతాడు.
వార్డెన్ దగ్గరికి రామ్మూర్తి
ఇంతలో శివరాం రేపు పిక్నిక్ కు మీరు మాత్రమే వెళ్లాలని మేము ఇంట్లోనే ఉంటామని చెప్తాడు. మిస్సమ్మ.. మనోహరిని పిలిచి వార్నింగ్ ఇస్తుంది. రామ్మూర్తి తన కూతురు గురించి తెలుసుకోవడానికి ఆశ్రమానికి వెళ్తాడు. వార్డెన్ ను కలిసి వివరాలు అడుగుతాడు. వార్డెన్ అమర్ చెప్పిన నిజం గుర్తుకు చేసుకుంటుంది. అమర్ ను అడిగి ఇతనికి నిజం చెప్పాలని అనుకొని అతనికి ఫోన్ చేస్తుంది.
రామ్మూర్తికి నిజం చెప్పొద్దని ఆయనకు సర్జరీ అయిందని నిజం తెలిస్తే ఆయన తట్టుకోలేడని అమర్ చెప్పగానే వార్డెన్ సరే అంటుంది. తర్వాత రామ్మూర్తికి ఏమీ తెలియలేదని చెప్తుంది. తన ప్రయత్నం మళ్లీ విఫలమైనందుకు నిరాశతో వెనుదిరుగుతాడు రామ్మూర్తి. ఎంతకీ రామ్మూర్తి ఫోన్ చేయకపోవడంతో తనే ఫోన్ చేసి ఏమైందని అడుగుతుంది మంగళ. ఆ వార్డెన్ తనకి తెలియదని చెప్పిందంటాడు రామ్మూర్తి. అసలేమై ఉంటుందని ఆలోచనలో పడిన మంగళ అమర్ కావాలనే అరుంధతి గురించి తెలియనివ్వడం లేదని తెలుసుకుంటుంది.
భాగీకి నిజం తెలుస్తుందా?
మీ నాన్నని కొన్ని రోజులు మన ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకోమని చెప్పు అని భాగీతో అంటాడు అమర్. ఆయన రారండి.. ఇప్పటికే మీతో ఎక్కువ ఖర్చు పెట్టించానని, మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నానని ఫీలవుతున్నారు అంటుంది మిస్సమ్మ. ఏం ఫర్లేదు.. ఫోన్ చేసి కన్విన్స్ చేసి రమ్మను అంటాడు అమర్. సరేనని ఫోన్ చేస్తుంది మిస్సమ్మ.
రామ్మూర్తి గొంతు నీరసంగా ఉండటంతో ఏమైందని అడుగుతుంది భాగీ. అక్క విషయంలో మళ్లీ నిరాశే ఎదురైందని రామ్మూర్తి చెప్పడంతో బాధపడుతుంది. ఆ మాటలు విన్న అమర్ కూడా బాధపడతాడు. అక్క మనకు తప్పకుండా దొరుకుతుంది నాన్నా.. ఆయన మిమ్మల్ని ఇక్కడకు రమ్మంటున్నారు అంటుంది భాగీ. నేను రాలేనమ్మా.. అంటాడు రామ్మూర్తి.
అమర్ ఫోన్ తీసుకుని వెంటనే ఇంటికి రమ్మని అంటాడు. ఏం మాట్లాడలేక సరే అంటాడు రామ్మూర్తి. భాగీకి నిజం తెలియనుందా? అరుంధతికి తన తండ్రి గురించి ఎలా తెలుస్తుంది? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు ఆగస్ట్ 31న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!