NNS July 27th Episode: అస్థికల్ని మాయం చేసే పనిలో మనోహరి.. భాగీకి డౌట్.. అంజును కాపాడిన మిస్సమ్మ.. స్మశానంలో ఘోరా
27 July 2024, 6:35 IST
Nindu Noorella Saavasam July 27th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జూలై 27వ తేది ఎపిసోడ్‌లో అరుంధతి అస్థికలను మాయం చేసేందుకు కంగారుగా కారులో వెళ్తుంది మనోహరి. అది చూసిన మిస్సమ్మకు మనోహరిపై డౌట్ వస్తుంది. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జూలై 27వ తేది ఎపిసోడ్
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 27th July Episode) అరుంధతి అస్థికలు ఎక్కడ ఉన్నాయో కనుక్కున్నానని ఘోరాకి ఫోన్ చేసి చెప్తుంది మనోహరి. మంచి పని చేశావు అని సంబరపడతాడు ఘోరా.
అరుంధతి పీడతోపాటు
తొందరేం లేదు.. ఆ అస్థికల్ని గంగలో కలపడానికి నిర్ణయించుకున్నారు. ఆలోపు వాటి స్థానంలో వేరే అస్థికల్ని పెట్టి వాటిని ఎలాగైనా తీసుకోవచ్చు అంటుంది మనోహరి. సరే నేను నేరుగా అక్కడికే వచ్చి అస్థికలు తీసుకుంటాను అంటాడు ఘోరా. నువ్వు అరుంధతి పీడ వదిలించడంతోపాటు మరో పని చేసి పెట్టాలి అని అడుగుతుంది మనోహరి. ఏంటది అంటాడు ఘోరా.
నా మొగుడు.. వాణ్ని కూడా చంపేయాలి. వాడు బతికి ఉండగా నేను అనుకున్నది సాధించలేను అంటుంది. అప్పుడే మనోహరి రూమ్‌లోకి వస్తాడు రణ్వీర్. మాస్క్ పెట్టుకుని ఉన్న రణ్‌వీర్‌ని చూసి మనోహరి భయపడుతుంది. ఎవరు నువ్వు.. నా రూమ్‌లోకి ఎందుకు వచ్చావు అని కంగారు పడుతుంది. రూమ్ క్లీన్ చేయడానికి వచ్చాను అంటాడు రణ్వీర్.
అందుకే వదిలేస్తున్నా
ఓ క్లీనర్వా.. సరే క్లీన్చెయ్.. నాకు పనుంది బయటకు వెళ్తున్నా అంటూ బయటకు వెళ్లబోతుంది మనోహరి. వెనకాల నుంచి మనోహరిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు రణ్వీర్. కానీ, అప్పుడే రూమ్‌లో నుంచి బయటకు వెళ్తుంది మనోహరి. తప్పించుకోలేవు మనోహరి.. నాకు కావాల్సింది నీ ప్రాణం కాదు కాబట్టి వదిలేస్తున్నా అంటాడు రణ్వీర్.
అరుంధతి అస్థికల్ని మార్చేందుకు బయటకు వస్తుంది మనోహరి. తనని ఎవరూ చూడలేదని నిర్దారించుకుని కారులో బయల్దేరుతుంది. మనోహరి కంగారుగా కారులో వెళ్లడం చూసి ఆలోచనలో పడుతుంది మిస్సమ్మ. ఏంటి మిస్సమ్మ.. మనోహరి మేడమ్‌ని చూసి ఏదో ఆలోచిస్తున్నావు అంటాడు రాథోడ్. ఆ మనోహరి ఏదో చేస్తుంది రాథోడ్.. అదేంటో తెలుసుకోవాలి అంటుంది మిస్సమ్మ.
భయపడిన రాథోడ్
అస్థికల్ని ఏదైనా చేయాలనుకుంటుందా? మిస్సమ్మ అంటాడు రాథోడ్. ఏమో రాథోడ్.. ఏం చేయాలనుకుంటుంది? ఎందుకు చేయాలనుకుంటుంది అనేది తెలియట్లేదు.. కానీ అది కచ్చితంగా ఈ ఇంటికి ఏదో పెద్ద ముప్పే తెచ్చిపెడుతుంది అంటుంది మిస్సమ్మ. అమ్మో.. ఆవిడ అత్యాశకి ఈ కుటుంబం ఏమవుతుందోనని భయమేస్తుంది అంటాడు రాథోడ్.
అరుంధతి అస్థికల గురించి మనోహరి అమర్‌ని అడిగిన సంగతి గుర్తుకు తెచ్చుకుని.. రాథోడ్.. అక్క అస్థికలు ఎక్కడున్నాయో నీకు తెలుసా అని అడుగుతుంది మిస్సమ్మ. తెలుసు అంటాడు రాథోడ్. పిల్లలు స్కూల్‌కి వెళ్లగానే నన్ను అక్కడకు తీసుకెళ్లు అంటుంది మిస్సమ్మ. ఎందుకు అని రాథోడ్ అడగగానే.. అక్క గుర్తుగా ఆయనకు మిగిలింది ఆ అస్థికలే రాథోడ్ వాటిని ఆ మనోహరి చేతికి చిక్కకుండా కాపాడుకోవాలి అంటుంది మిస్సమ్మ.
పిల్లలను స్కూల్‌లో దించి
సరే మిస్సమ్మ.. పిల్లల్ని స్కూల్లో దింపేసి వచ్చి మనం వెళ్దాం అంటాడు రాథోడ్. మిస్సమ్మ, రాథోడ్ మాటలు విన్న అరుంధతి ఇన్నేళ్లు స్నేహం ముసుగులో నన్ను నా కుటుంబాన్ని మోసం చేస్తుందని తెలుసుకోలేక పోయాను. కానీ, దాని బండారం బయటపెట్టేది భాగీ అని దానికి తెలియదు అనుకుంటుంది. పిల్లలు స్కూల్‌కి వెళ్లడానికి కిందకి వస్తారు. కానీ, అంజు స్కూల్‌కి రెడీ అవకుండా రూమ్‌లోనే ఉంటుంది.
అంజు ఏదని అమర్ అడుగుతాడు. పిల్లలు ఏం చెప్పాలో అర్థంకాక సతమతమవుతుంటే ఇక్కడే ఉన్నాను డాడ్.. అంటూ బయటకు వచ్చేస్తుంది. ఎక్స్‌ట్రాలు చేసింది చాలుగానీ ప్రిన్సిపల్ చెప్పిన పేరెంట్స్ విషయం మర్చిపోయావా అంటుంది అమ్ము. పదండి.. మిమ్మల్ని డ్రాప్ చేసి ఆఫీస్‌కి వెళ్తానంటాడు రాథోడ్. కంగారు పడుతున్న అంజలిని చూసి స్కూల్లో కచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది అనుకుంటుంది అరుంధతి.
అంజుని మిస్సమ్మ కాపాడింది
పిల్లల్ని తాను డ్రాప్ చేస్తానంటుంది మిస్సమ్మ. అదేంటి.. దార్లోనే కదా.. నేను డ్రాప్ చేస్తాలే అంటాడు అమర్. అంటే.. ఇందాకే ప్రిన్సిపల్ కాల్ చేసి రమ్మని చెప్పింది అంటుంది మిస్సమ్మ. అంజు బాగా ఇంప్రూవ్ అయ్యిందట అంటుంది. కానీ, ఇద్దర్నీ వెళ్లమంటుంది నిర్మల. వద్దని నచ్చజెప్పి తాను దింపుతానంటుంది మిస్సమ్మ. సరేనని అమర్ వెళ్లిపోతాడు. హమ్మయ్య.. మిస్సమ్మ అంజుని సేవ్ చేసింది. ఇప్పటికైనా అంజు మిస్సమ్మని అర్థం చేసుకుంటే చాలు అనుకుంటుంది.
మిస్సమ్మ పిల్లల్ని తీసుకుని స్కూల్‌కి బయల్దేరుతుంది. మరోవైపు స్మశానం దగ్గర వేచిఉన్న ఘోరాను కలవడానికి వెళ్తుంది మనోహరి. పద.. తొందరగా వెళ్లి దాని అస్థికలు తీసుకుని దాని పీడ విరగడ చేద్దామంటుంది. నాకు లోపలకు ప్రవేశం లేదు నువ్వు ఒక్కదానివే వెళ్లి ఆ అస్థికల్ని తీసుకుని రా అంటాడు ఘోరా. బయల్దేరుతున్న మనోహరిని ఆపి తనవెంట తెచ్చిన డూప్లికేట్ అస్థికల్ని ఇచ్చి వాటి స్థానంలో వీడిని పెట్టమని చెబుతాడు ఘోరా.
అనుమానంతో అరుంధతి
వాటిని తీసుకుని లోపలకు వెళ్తుంది మనోహరి. అసలు తనేం చేయబోతోందనే అనుమానంతో వెంట వెళ్తుంది అరుంధతి. మనోహరి అరుంధతి అస్థికల్ని తీసుకుంటుందా? అస్థికల్ని తీసుకోకుండా మనోహరిని మిస్సమ్మ అడ్డుకుంటుందా? అనే విషయాలు తెలియాలంటే జులై 29న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!
టాపిక్