తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns April 19th Episode: ఘోరా రేఖా బంధనంలో అరుంధతి.. బీహార్ గ్యాంగ్​‌కు డౌట్.. భయంతో మనోహరి​.. అయోమయంలో మిస్సమ్మ

NNS April 19th Episode: ఘోరా రేఖా బంధనంలో అరుంధతి.. బీహార్ గ్యాంగ్​‌కు డౌట్.. భయంతో మనోహరి​.. అయోమయంలో మిస్సమ్మ

Sanjiv Kumar HT Telugu

19 April 2024, 13:24 IST

google News
  • Nindu Noorella Saavasam April 19th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఏప్రిల్ 19వ తేది ఎపిసోడ్‌‌లో ఘోరా రేఖా బంధనం గీయడంతో అరుంధతి కల్యాణ మంటపంలోకి అడుగుపెట్టలేకపోతుంది. మరోవైపు బీహార్ గ్యాంగ్‌కు మనోహరిపై డౌట్ వస్తుంది. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఏప్రిల్ 19వ తేది ఎపిసోడ్‌‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఏప్రిల్ 19వ తేది ఎపిసోడ్‌‌

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఏప్రిల్ 19వ తేది ఎపిసోడ్‌‌

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 19th April Episode) పిల్లలు పరిగెత్తుకొచ్చి భాగమతిని హగ్ చేసుకుంటారు. మిస్సమ్మ.. మనోహరి ఆంటీకి డాడీకి పెళ్లి.. ఆ పెళ్లికి వెళ్లడం మాకు ఇష్టం లేదు అంటుంది అంజలి. నేనుండగా ఆ పెళ్లి జరగనివ్వను. మీకు అన్యాయం జరగనివ్వను. ఆరోజు కథ మధ్యలోనే ఆపేశాను కదా ఇప్పుడు పూర్తి చేస్తాను అంటుంది భాగమతి.

పాప గెలిచిందా?

ఏంటి ఆ చిన్న పాప కథా అంటుంది అంజలి. అవును తన జీవితం ముగిసిపోయిందని అనుకునేలోపు భగవంతుడు మళ్లీ ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఆ పాప ప్రశ్నగా మిగిలిపోయిన తన కుటుంబాన్ని జీవితాన్ని కాపాడడానికి మళ్లీ వచ్చింది. తనని పాతాళానికి తొక్కేసిన అమ్మాయితో యుద్ధం చేసైనా సరే తన కుటుంబాన్ని రక్షించుకోవాలని వచ్చింది అంటుంది భాగమతి. ఆ పాప గెలిచిందా అని అడిగిన అంజలితో తన ప్రాణం ఫణంగా పెట్టి గెలిచిందని చెబుతుంది మిస్సమ్మలో ఉన్న అరుంధతి.

పిల్లలకి కథ చెప్పడం పూర్తి చేసిన మిస్సమ్మ రూపంలో ఉన్న అరుంధతి, వాళ్లని తీసుకుని కళ్యాణ మండపానికి బయలుదేరుతుంది. వాళ్ల పెళ్లి అయిపోయింది కదా ఎలా ఆపగలం అని అడుగుతాడు రాథోడ్. పెళ్లి ఇంకా అవలేదు తాళి కట్టలేదు ఎలా అయినా ఆపుదామని అందరినీ బయలుదేరదీస్తుంది మిస్సమ్మలో ఉన్న అరుంధతి. అదే సమయానికి కల్యాణ మండపానికి బీహార్ గ్యాంగ్ చేరుకుంటారు. కోపంతో రగిలిపోతూ మనోహరి దగ్గరకు వెళ్లడానికి ప్రయత్నిస్తారు.

పెళ్లయ్యే వరకు ఉందాం

కానీ, అప్పటికే వాచ్‌మెన్ ద్వారా సమాచారం అందుకున్న మనోహరి బాగా ఆలోచించి పెళ్లికూతురు స్థానంలో తనతో ఉండే పని అమ్మాయిని కూర్చోబెడుతుంది. పెళ్లికూతురు పేరు మనోహరి. కానీ ఇద్దరూ ఒకటి కాదు అని తెలుసుకొని బయటకు వెళ్లిపోతాడు బీహార్ గ్యాంగ్ పెద్దమనిషి. కానీ, అతనికి అనుమానం మాత్రం ఉండిపోతుంది. పెళ్లయ్యే వరకు ఇక్కడే ఎక్కడో ఒక దగ్గర ఉండి మనోహరి పని పడదామని నిర్ణయించుకుంటారు.

పిల్లలతో కలిసి అరుంధతి కల్యాణ మండపానికి చేరుకుంటుంది. ఎందుకైనా మంచిది మరోసారి ఆలోచించమని చెబుతాడు చిత్రగుప్త. కానీ, అందుకు ససేమిరా అంటుంది అరుంధతి. నేను చేయాలనుకున్నది ఇప్పుడు చెయ్యకపోతే పక్కనే ఉండి కూడా పిల్లలను కాపాడుకోలేకపోయానని ఎప్పుడూ బాధపడుతూనే ఉంటాను అంటుంది. కానీ, ఆశ్చర్యకరంగా ఎంత ప్రయత్నించినా కల్యాణ మండపం లోపలికి వెళ్లలేక పోతుంది అరుంధతి.

ఘోరా బంధన రేఖ

ఏం జరిగిందో తెలిసేలోపే మిస్సమ్మ శరీరాన్ని వదిలేస్తుంది. గుప్తా గారు ఏం జరిగిందో చెప్పండి నేను ఎందుకు లోపలికి వెళ్లలేక పోతున్నాను. దయచేసి చెప్పండి అంటుంది అరుంధతి. ఆ ఘోర నువ్వు లోపలికి ప్రవేశించకుండా బంధన రేఖ గీశాడు అంటాడు గుప్త. అంటే నేనిప్పుడు లోపలికి వెళ్లలేనా అని అడుగుతుంది అరుంధతి.

లోపలికి రాలేదు. ఈ ఘోర గీసిన బంధనాన్ని దాటి లోపలికి రాలేదు. ఆత్మ రాలేదని అభయమిచ్చాను కదా ఇంకా ఎందుకు నీ మనసులో సందేహ పడుతున్నావు అని మనోహరిని అంటాడు ఘోరా. పెళ్లి పీటల మీదకి వచ్చేవరకు గెలుపు నాదేనని చాలా ధీమాగా ఉన్నాను. కానీ, కల్యాణ ఘడియలు దగ్గర పడే కొద్దీ నా మనసులో ఏదో భయం, ఆందోళన ఉన్నాయి ఘోరా.. గంట ముందు వరకు అంతా కరెక్ట్‌గానే ఉందనిపించినా మనసు మాత్రం ఎందుకో కీడు శంకిస్తోంది అంటుంది మనోహరి.

ఎలాగైనా ఆపాలి

ఎన్నాళ్ల నుంచో కన్న కల కదా. కళ్ల ముందుకు వస్తుంటే అది ఎప్పుడు కలగానే మిగిలిపోతుందేమోనని మనసు భయం అంతే. నీకు ఏ భయం అవసరం లేదు. నీ వు నిశ్చింతగా వెళ్లి పెళ్లి పీటల మీద కూర్చో. నీ పెళ్లి జరగకుండా ఎవరు ఆపలేరు అంటాడు ఘోర. నేను ఆపుతా, ఆపాలి గుప్తా గారు.. ఆపాలి. ఆయనతో మనోహరి పెళ్లిని ఎలా అయినా ఆపాలి. ఆపి తీరుతా అంటుంది అరుంధతి.

ఈ రేఖను నువ్వు దాటి వెళితే ఆపగలవు. కానీ, ఆ రేఖను దాటే శక్తి మాత్రం మీకు లేదు అంటాడు గుప్త. గుప్తా గారు మీరు ఏదైనా చేసి ఈ రేఖను చెరిపేయగలరా అని అడుగుతుంది అరుంధతి. ఈ రేఖ ఇక్కడ ఉండటం దైవ నిర్ణయం ఆ దైవ నిర్ణయాన్ని మీరు ధిక్కరించగలరా.. నీ మటుకు నువ్వు ఆ బాలిక శరీరంలో ప్రవేశించి, ఆ పిల్ల పిచ్చుకల దగ్గరకు వెళ్లి పెళ్లిని ఆపుతానని గొప్పగా చెప్పితివి. మీ వల్ల ఇప్పుడు ఆ బాలిక ఇరకాటంలో పడింది అంటాడు గుప్త.

అర్థం కానీ మిస్సమ్మ

మిస్సమ్మకి తెలివి వస్తుంది. తాను ఎక్కడున్నానో అర్థం కాదు . అప్పటికే కల్యాణమండపంలోకి వెళ్లిన పిల్లలు బయటకి వచ్చి మిస్సమ్మని ఆశ్చర్యంగా చూస్తారు. మనోహరి గతాన్ని బీహార్​ గ్యాంగ్ బయటపెడుతుందా? ఘోరా బంధన రేఖను దాటి అరుంధతి కల్యాణ మండపంలోకి అడుగుపెడుతుందా? అనే విషయాలు తెలియాలంటే ఏప్రిల్ 20న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!

తదుపరి వ్యాసం