NNS March 1st Episode: రూమ్‌లో అంజలిని కట్టేసిన కాళీ.. కనిపెట్టిన పిల్లలు.. నిజం చెప్పేసిన అంజు.. గుడిలోకి రామ్మూర్తి
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మార్చి 1వ తేది ఎపిసోడ్‌లో కాళీని అంజలి గుర్తు పడుతుంది. అది చూసిన కాళీ తన రూమ్‌లో అంజలినీ తాళ్లతో కట్టేసి బంధిస్తాడు. తర్వాత అంజలిని కనిపెట్టి తీసుకొస్తారు పిల్లలు. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
Nindu Noorella Saavasam March 1st Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 1st March Episode) పెళ్లి కొడుకుని తీసుకురమ్మని పంతులు చెప్పడంతో.. నేను తీసుకొస్తాను అంటూ మంగళ వెళుతుంది. పిల్లలు మిస్సమ్మ దగ్గరికి పరిగెత్తుతారు. ఇన్ని గదులు ఉన్నాయి ఎక్కడ ఉందో తెలియదు మీరు ఇటు వెళ్లి వెతకండి నేను అటు వెళ్లి వెతుకుతాను అంటుంది అంజలి.
తాతయ్య దగ్గర ఉన్నది
మిగతా ముగ్గురు పిల్లలు ఒకవైపు వెళ్తారు. అంజలి వేరే గదికి వెళుతుంది. పిల్లలు ముగ్గురు మిస్సమ్మ డోర్ కొడతారు. అంజలి మాత్రం కాళీ రూమ్ డోర్ కొడుతుంది. భాగమతి డోర్ ఓపెన్ చేస్తుంది. కాళీ డోర్ ఓపెన్ చేస్తాడు. భాగమతిని చూసి పిల్లలు ముగ్గురు కౌగిలించుకుంటారు. అంజలి మాత్రం కాళీని చూసి షాక్ అయిపోతుంది. అంజలిని చూసిన కాళీ షాకవుతాడు. అంకుల్ మీరు హాస్పిటల్లో తాతయ్య దగ్గర ఉన్నది మీరే కదా ఉండండి మా డాడీకి చెప్తాను అంటూ అంజలి వెళుతూ ఉండగా కాళీ అంజలిని పట్టుకుంటాడు.
నన్ను వదలండి అంకుల్ అని అరుస్తుంది అంజలి. అంజలిని కాళీ లోపలికి తీసుకువెళ్లి చేతులకి కాళ్లకి తాడు కట్టేస్తాడు. మాట్లాడకుండా నోటికి కూడా క్లాత్ కడతాడు. ఇంతలో మంగళ వచ్చి డోర్ కొడుతుంది. భయపడుతూ కాళీ డోర్ ఓపెన్ చేసేసరికి మంగళ కనపడుతుంది. అక్కని చూసి లోపలికి రమ్మంటాడు. ఏమైందిరా ఎందుకు అలా ఉన్నావ్ అని అడుగుతుంది మంగళ. అటు చూడు అక్క అని అంజలిని చూపెడతాడు కాళీ.
పెళ్లి పీటల మీద కాళీ
ఈ అమ్మాయి ఏందిరా నీ గదిలో ఉంది. పెళ్లయ్యేదాకా తన కంట పడుద్దన్నాను కదరా. తెచ్చుకొని గదిలో ఉంచుకున్నావ్ ఏంటి అంటుంది మంగళ. తనే నా గదికి వచ్చింది అక్క. నన్ను చూసి పెళ్లి ఆపుతానని వెళుతూ ఉంటే నేనే తీసుకొచ్చి కట్టి పడేసాను చెబుతాడు కాళీ. చాలా మంచి పని చేసావ్. పెళ్లి అయ్యేదాకా ఇక్కడే ఉండనిరా పంతులుగారు రమ్మంటున్నారు అని మంగళ కాళీని తీసుకొని వెళ్లిపోతుంది. కాళీ పెళ్లి పీటల మీద కూర్చుంటాడు.
ఏంటి మీ తమ్ముడిని ఇంత ధైర్యంగా తీసుకొచ్చి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టావు అని మంగళని అడుగుతుంది మనోహరి. అంజలిని నా తమ్ముడు గదిలో బంధించాడు అందుకే వచ్చి కూర్చున్నాడు అని మంగళ చెబుతుంది. పెళ్లికూతుర్ని తీసుకురండి అమ్మ అని పంతులుగారు చెబుతారు. నేను తీసుకొస్తాను అంటూ మంగళ వెళుతుంది. ఇంతలో పిల్లలు ముగ్గురు భాగమతిని తీసుకొని వస్తూ ఉంటారు. మంగళ వాళ్లతో కలిసి భాగమతిని తీసుకొచ్చి పెళ్లి పీటల మీద కూర్చోబెడుతుంది.
రెండు నిమిషాల్లో గుడి దగ్గర
భాగమతిని చూసి అమర్ మౌనంగా తలకిందికి వంచుకుంటాడు. భాగమతి మాత్రం పీటల మీద కూర్చొని అమర్‌ని చూస్తూ ఉంటుంది. కారు త్వరగా పోనీ బాబు అని రామ్మూర్తి రాథోడ్‌తో అంటాడు. వెళ్తున్నాం సార్ ఇంకో రెండు నిమిషాలలో గుడి దగ్గరే ఉంటాం అంటాడు రాథోడ్. పిల్లలు ముగ్గురే ఉన్నారు అంజలి ఎక్కడ అని అరుంధతి అనుకుంటుంది. అంజలి లేదని గమనించిన అమర్ అమ్మూ.. అంజలి ఎక్కడ అని అడుగుతాడు.
ఇందాక గది దగ్గరే ఉంది డాడీ అని అమృత చెబుతుంది. సరే నేను తీసుకొస్తాను అని అమర్ వెళ్తూ ఉండగా నేను తీసుకొస్తాను ఉండు అని మనోహరి వెళ్తుంది. ఇంకా అంజుని తీసుకొని రాలేదేంటి అని అరుంధతి వెళ్లి చూసేసరికి ఫోన్‌లో వీడియోలు చూస్తూ నవ్వుతూ ఉంటుంది మనోహరి. ఏం మను నువ్వు అసలు మనిషివేనా ఎందుకే ఇలా చేస్తున్నావ్ అని అంటుంది అరుంధతి. అంజలి పెళ్లి అయ్యేదాకా ఇక్కడే ఉండు పెళ్లయ్యాక కాళీ నిన్ను పైకి పంపిస్తాడొ. ఇంటికి పంపిస్తాడో చూద్దాం అని మనోహరి అంటుంది.
పెళ్లి కొడుకు గది కదా
ఇంకా అంజు రాలేదేంటి అని పిల్లలు చూద్దామని వెళ్తారు. మనోహరి అక్కడి నుంచి పెళ్లి దగ్గరికి వస్తుంది. పిల్లలు వెళుతూ ఉండగా కాళీ ఉన్నా రూమ్ కనిపిస్తుంది. ఆనంద్ అంజలి ఈ గదిలోనే ఉన్నట్టుంది నాకెందుకు అలాగే అనిపిస్తుంది అని అమృత అంటుంది. అది పెళ్లి కొడుకు గది కదా దాంట్లో ఎందుకు ఉంటుంది అని ఆకాష్ అంటాడు. ఏమో చూద్దాం అని అమృత వెళ్లి ఖాళీనీ తాళం చెయ్యి ఇవ్వండి అంకుల్ అని అడుగుతుంది.
గది తాళాలు ఎందుకు అని అంటాడు కాళీ. ఆ గదిలో మా అంజలి ఉందేమో చూద్దాం ఇవ్వండి అని అమృత అంటుంది. తన గదిలో ఎందుకు ఉంటుంది అమ్మూ.. అంటాడు అమర్. చూద్దాం డాడీ అంటుంది అమృత. మామయ్య తాళాలు అంట ఇవ్వు అని భాగమతి అంటుంది. తాళాలు నా దగ్గర లేవు ఇందాక ఎక్కడో పెట్టాను అని అంటాడు కాళీ. ఎక్కడో పెట్టడమేంటి నీ జేబులో చూడవయ్యా అని శివరామ్ అంటాడు. లేదండి ఎక్కడో పెట్టాను అని అంటాడు కాళీ.
రామ్మూర్తిని తీసుకుని
అంకుల్ ఈ జేబులో చూడండి కనిపిస్తుంది అని ఆనంద్ అంటాడు. ఓ మర్చిపోయాను అని కాళీ తాళం చెవి ఇస్తాడు. పిల్లలు వెళుతూ ఉండగా నేను వస్తాను అని అమర్ అంటాడు. నువ్వు ఉండు అమర్ నేను వెళ్లి చూస్తాను అని శివరామ్ వెళ్తాడు. రాథోడ్ వాళ్లు గుడి దగ్గరికి వస్తారు. రామ్మూర్తి గబగబా కారు దిగి పరిగెత్తుతూ ఉండగా ఉండండి సార్ నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను అని భుజం మీద చేయి వేసుకొని రామ్మూర్తిని తీసుకు వెళుతూ ఉంటాడు రాథోడ్.
పిల్లలు వెళ్లి తాళం ఓపెన్ చేసి చూసేసరికి అంజలి అక్కడ కనబడుతుంది. అంజలి ఎవరమ్మా నిన్ను ఇలా కట్టిపడేసింది అని శివరామ్ కట్లన్నీ విప్పేస్తాడు. పెళ్లి అయిపోయిందా తాతయ్య అని అంజలి అడుగుతుంది. కాలేదమ్మా అని శివరామ్ అంటాడు. అంజలి వెంటనే గబగబా పరిగెత్తుకుంటూ పెళ్లి పీటల దగ్గరికి వచ్చి డాడీ ఆరోజు సరస్వతి ఆంటీని లారీతో గ్గుద్ది చంపేసింది ఈ అంకుల్ డాడీ అని చెబుతుంది అంజలి.
మంగళ మనోహరి టెన్షన్
మంగళ మనోహరి టెన్షన్ పడుతూ ఉంటారు. అంజు నువ్వు చూసింది ఈ అంకుల్ నా. ఈ అంకుల్ మిస్సమ్మని పెళ్లి చేసుకోబోతున్నాడు సరిగ్గా చూసి చెప్పు అని అమరేంద్ర అంటాడు. సరస్వతి మేడంని చంపింది కాళీనా అని అరుంధతి షాక్ అవుతుంది. నేను నిజమే చెప్తున్నాను డాడీ ఆరోజు ఈ అంకులే సరస్వతి ఆంటీ ని లారీతో గుద్దేసి చంపేశాడు నా కళ్లతో చూశాను అని అంజలి చెబుతుంది. తాళి కట్టబోతున్న కాళీకి చేతులు వణుకుతూ భయంతో ఒళ్లంతా చెమటలు పడతాయి.
కాళీ గురించి తెలుసుకున్న అమర్ ఏం చేస్తాడు? మిస్సమ్మనే ఆర్జే భాగీ అని అమర్ కుటుంబానికి తెలుస్తుందా? అనే విషయాలు తెలియాలంటే మార్చి 2న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!
టాపిక్