NNS February 23rd Episode: కాళీని తప్పించిన మనోహరి.. ఎదురుతిరిగిన మంగళ.. భాగీని ప్రేమగా తీసుకున్న అమర్!
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఫిబ్రవరి 23వ తేది ఎపిసోడ్‌లో షాపింగ్ మాల్‌లో కాళీని తప్పిస్తుంది మనోహరి. అయితే, ఈ పెళ్లి జరిగేలా నువ్వే చేయాలి అని మనోహరికి ఎదురుతిరుగుతుంది మంగళ. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
Nindu Noorella Saavasam 23rd February Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 23rd February Episode) మంగళ గారు మీ తమ్ముడు బ్రతికున్నాడో, చచ్చాడో తెలుసుకోవాలి కదా ఉండండి మేనేజ్మెంట్‌ని తీసుకొస్తాను అంటూ రాథోడ్ వెళుతూ ఉండగా కాళీ టైటైన షర్టు బటన్ పెట్టుకొని తల అందులో ఇరికించుకుని బయటికి వస్తాడు. అమర్ చూసావు కదా, మనం ఎందుకు ఇక్కడ. అతను వేరే షర్టు వేసుకొని వస్తాడు మనం బిల్ చేయిద్దాం పదండి అంటుంది మనోహరి. పదండి అంటూ వెళ్లిపోతారు.
తమ్ముడు రాగానే
బిల్లు ఎంత అయిందో చెప్పండి. ఇంకో షర్టు తీసుకుంటున్నాడు. అతను వచ్చాక అది కూడా కలిపి బిల్లు వేయండి అంటాడు అమర్. ఇప్పుడు బయటికి రాలేను ఎలా అని కాళీ ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎలారా దొరికిపోయేలా ఉన్నాం అని మంగళ సైగ చేస్తుంది. ఈ మనోహరి కూడా సమయానికి ఎటు వెళ్లిందో ఏమో అని మంగళ టెన్షన్ పడుతూ ఉంటుంది. సార్ మా తమ్ముడు రాగానే నేను తీసుకొని వస్తాను బిల్లు కట్టి మీరు వెళ్లండి అంటుంది మంగళ.
అన్నీ వస్తేనే బిల్లేస్తారు పిన్ని అంటుంది భాగమతి. ఆ డ్రెస్ కి నేను డబ్బులు కడతాను అమ్మ మీరు ఎందుకు ఇబ్బంది పడడం వెళ్లండి అంటుంది మంగళ. బిల్లేదండి కట్టేసి వెళ్దాం అంటూ పైకి చూస్తాడు అమర్. పైన సిసి కెమెరాలు కనబడతాయి. ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ చూడొచ్చా అంటాడు. కస్టమర్‌కి చూపించడం కుదరదు సార్ అంటాడు మేనేజర్. నేను లెఫ్టినెంట్‌ని ఒక క్రిమినల్ ని పట్టుకోడానికి అడుగుతున్నాను అంటాడు అమర్.
అంజలి గుర్తు పట్టగలవా
అంజలి అతని ఫేస్ చూస్తే గుర్తుపట్టగలవా అని అడుగుతాడు అమర్. గుర్తుపడతాను డాడీ అంటుంది అంజలి. మేనేజర్ సిసి టీవీ ఫుటేజ్ ఓపెన్ చేస్తే ఓపెన్ కాదు. సారీ సార్ హార్డ్ డిస్క్ మార్చారు. కొత్త హార్డ్ డిస్క్ లో ఇంకా ఏమి రికార్డు కాలేదు మేనేజర్ చెబుతాడు. నువ్వు ఇలాంటిదేదో చేస్తావని నా జాగ్రత్తలో నేను ఉన్నాను అనుకుంటుంది మనోహరి. తప్పించుకోడానికి అతను ఇలా కూడా ప్లాన్ చేశాడా. ఎలాగైనా సరే అతని పట్టుకుని తీరుతాను అనుకుంటాడు అమర్.
కట్ చేస్తే, అక్క పెళ్లి అయ్యేదాకా ఈ టార్చర్ నేను భరించలేను ఏదో ఒకటి చేయి అంటాడు కాళీ. మనోహరి గారిని రమ్మన్నాను కదరా తను ఏదో ఒకటి చేస్తుందిలే ఆగు అని మంగళ అంటుంది. నేనేం చేయగలను. ఈ పెళ్లి గనుక ఆగిపోతే మీ ఇద్దరి అంతు చూస్తాను అంటుంది మనోహరి. ఈ పెళ్లి ఆగిపోతే మీరేం చేస్తారో మాకు తెలియదు. కానీ మీరే ఈ ప్రాబ్లం మా నెత్తిమీదకి తెచ్చి పెట్టారు కాబట్టి పెళ్లి మండపానికి ఆ పాప రాకూడదు మీరే ఏదో ఒకటి చేయండి అని మంగళ వాళ్ల తమ్ముని తీసుకుని వెళ్లిపోతుంది.
కలిసి భోజనం చేద్దాం
నీలా అందరికీ అన్నం వడ్డిస్తుంది. అమ్మ పిల్లలు భోజనం చేశారా అంటాడు అమర్. మిస్సమ్మ ఉంది కదా నాన్న తను చూసుకుంటుందిలే అంటుంది నిర్మల. తను భోజనం చేసిందా. అమర్ తనను కూడా పిలుద్దాం అని శివరామ్ భాగమతిని పిలుస్తాడు. ఏంటి అంకుల్ అంటుంది భాగమతి. రా అమ్మా.. కలిసి భోజనం చేద్దాం అంటాడు శివరామ్. మీరు తినండి అంకుల్ నేను తర్వాత తింటాను అని భాగమతి అంటే, అదేంటమ్మా ఇది కూడా నీళ్లే అనుకోరా వచ్చి కూర్చో కలిసి భోజనం చేద్దాం అంటాడు. భాగమతి వచ్చి కూర్చుంటుంది.
అది చూసిన మనోహరి టెన్షన్ పెరిగిపోతుంది. ఈ సీట్లో మనోహరి మేడం కూర్చుందాం అనుకునే లోపు అక్క చెల్లెలు కూర్చుంటున్నారు. మా అమ్మగారి పరిస్థితి ఏంటి అనుకుంటుంది నీల. ఏంటండీ మిస్సమ్మ వంట చేసిందనా అలా లాగించేస్తున్నారు అంటుంది నిర్మల. మిస్సమ్మ ఈ ఆనందం నీవల్లే వచ్చింది మా ఇంటికి నువ్వు లేనప్పుడు బాధతో నిండిపోయిన మా ఇల్లు మళ్లీ నీ రాకతో నవ్వులు మొదలయ్యాయి. పెళ్లయిన తర్వాత కూడా జాబ్ చేస్తావా మా ఇంట్లోనే అంటాడు శివరామ్. భాగమతి అమర్ వంక చూస్తుంది.
అక్రమ సంబంధం
అదేంటి అంకుల్ అలా అంటారు తన జీవితం మున్నాళ్ల ముచ్చటగా మిగిలిపోవాలనుకుంటున్నారా అని మనోహరి అంటుంది. మిస్సమ్మ మన ఇంట్లో పని చేయడానికి తన కాపురం కూలిపోవడానికి ఏంటమ్మా సంబంధం అని శివరామ్ అంటాడు. మొన్న నా పెళ్లి చూపుల్లో ఏం జరిగిందో చూశారు కదా ఒకే ఇంట్లో ఉండడం వల్ల అమరేంద్రకి నాకు అక్రమ సంబంధం అంటగట్టారు. చదువుకొని అన్నీ తెలిసిన వాడే అలా మాట్లాడాడు అంటే భాగమతి పెళ్లి అయ్యాక ఇక్కడే పని చేస్తే చదువులేని ఆమె భర్త అమర్ మిస్సమ్మకి సంబంధం అంట కడితే అప్పుడు ఏం చేస్తాం. అందుకనే మిస్సమ్మ వేరే జాబ్ చూసుకుంటుంది. మనం వేరే కేర్ టేకర్‌ని చూసుకుందాం అని మనోహరి అంటుంది.
పది నిమిషాల ముందు ఇల్లంతా సంతోషంతో నిండిపోయింది. ఒక్క మాటతో అందరినీ ఎలా విషాదంలోకి నెట్టేసావమ్మా నువ్వు ఉంటే ఇల్లు నాశనమే అని నీలా అనుకుంటుంది. అమర్ రేపు ముత్తైదుల్ని పిలిచి అమ్మాయికి పసుపు రాయిదాము అనుకుంటున్నాను. అలాగే మెహందీ ఫంక్షన్ కూడా జరిపించాలి అనుకుంటున్నాను నువ్వేమంటావు రా అని నిర్మల అడుగుతుంది. మీరేదనుకుంటారో అది చేయండి ఏం కావాలన్నా రాథోడ్ తో తెప్పిస్తాను అని అమరేంద్ర అంటాడు. కట్ చేస్తే, ఇల్లంతా పూలు మావిడాకులతో అలంకరిస్తూ ఉంటారు.
పెళ్లి గడియలు
అమ్మగారు పెళ్లి మామూలుగా జరిపిస్తారు అనుకుంటే ఇల్లు ఏంటమ్మా ఇంత అందంగా డెకరేషన్ చేస్తున్నారు అంటుంది నీల. చేసుకోనియ్యవే మనకేంటి ప్రాబ్లం రెండు రోజుల్లో పెళ్లి జరిగిపోతుంది. ఎలాగూ అది ఇక్కడికి రాదు కదా అని మనోహరి అంటుంది. అమ్మగారు అమరేంద్రయ్యకి పెళ్లి ఘడియలు వచ్చాయనే పంతులుగారు చెప్పారు. ఆ పెళ్లి గడియలు మిస్సమ్మ తోటే జరుగుతుందేమో అని నీలా అంటుంది. పెళ్లి గడియలు ఎవరితోటైనా రానీయే కానీ అమర్ తాళి కట్టేది మాత్రం నా మెడలోనే. ఈసారి మిస్ అవ్వనివ్వను అని మనోహరి అంటుంది.
ఏ మాటక ఆ మాట చెప్పాలి అమ్మగారు మిస్సమ్మ కుందనపు బొమ్మలా ఉంది రెండమ్మ చూదురుగానే అని నీలా అంటుంది. కట్ చేస్తే, భాగమతిని చూసి ఆశ్చర్య పోతుంది మనోహరి. అమ్మాయి ఎంత అందంగా ఉన్నావ్ మా దిష్టే తగిలేలా ఉంది మెహందీ ఫంక్షన్ అయిపోయిన తర్వాత దిష్టి తీయించుకో అని ముత్తైదువులు అంటారు. ఇంతలో నిర్మల వచ్చి ఎంత అందంగా ఉన్నావు మిస్సమ్మ. కుందన బొమ్మలా ఉన్నావ్ నా దిష్టే తగిలేలా ఉంది అని అంటుంది. మిస్సమ్మ ఈ నాగ వేసుకో అని నిర్మల అరుంధతి నగ ఒకటి ఇస్తుంది.
అమరే ఇచ్చాడు
ఆంటీ అనగా అరుంధతిది కదా ఈ విషయం అమర్ కి తెలిస్తే ఇంట్లో యుద్ధమే జరుగుతుంది అని మనోహరి అంటుంది. ఈ నగ మిస్సమ్మకి ఇవ్వమని వాడే ఇచ్చాడమ్మా అని నిర్మల అంటుంది. కట్ చేస్తే, ఆరు నువ్వు బ్రతికుంటే ఏం చేసేదానివో నేను అదే చేస్తున్నాను అని అమరేంద్ర అరుంధతి ఫోటో పట్టుకొని బాధపడతాడు. మీరు ఇలా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. కానీ భాగీకి ఇష్టం లేకుండా పెళ్లి జరుగుతుంది అది తెలిసి కూడా నేను ఏం చేయలేకపోతున్నాను అని అరుంధతి బాధపడుతుంది.
ఆంటీ ఇప్పటికీ నాకు చాలా ఇచ్చారు ఇంకా నగలు వద్ద ఆంటీ అని భాగమతి అంటుంది. మరి అలా మొహమాట పడతావ్ ఏంటి అని నిర్మల మనోహర్ని జడ పట్టుకోమని తన మెడలో ఆ నాగవేస్తుంది. చూడు మిస్సమ్మ ఈ నగ అచ్చం మా కోడలు మెడలో ఎంత అందంగా ఉందో నీ మెడలో అంతే అందంగానే ఉంది నీకోసమే చేయించినట్టుంది హుందాగా అని నిర్మల అంటుంది. అది చూసి టెన్షన్ పడుతుంది మనోహరి.
అందంగా ముస్తాబైన భాగమతిని చూసిన అమర్ ఏం చేస్తాడు? భాగమతి పెళ్లి జరుగుతుందా? అనే విషయాలు తెలియాలంటే ఫిబ్రవరి 24న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!
టాపిక్