తెలుగు న్యూస్  /  Entertainment  /  Nikhil 18 Pages Streaming Now On Netflix And Aha Ott

18 Pages Streaming On OTT: ఓటీటీలోకి వ‌చ్చిన నిఖిల్ ల‌వ్ స్టోరీ - రెండు ప్లాట్‌ఫామ్‌ల‌లో స్ట్రీమింగ్‌

27 January 2023, 15:06 IST

  • 18 Pages Streaming On OTT: నిఖిల్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా న‌టించిన 18 పేజెస్ సినిమా శుక్ర‌వారం ఓటీటీలో రిలీజైంది. ఈ సినిమా రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల‌లో స్ట్రీమింగ్ కానుంది. ఆ ఓటీటీలు ఎవంటే...

నిఖిల్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్
నిఖిల్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్

నిఖిల్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్

18 Pages Streaming On OTT: నిఖిల్ 18 పేజెస్ సినిమా శుక్ర‌వారం ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఒకే రోజు రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల‌లో రిలీజైంది. నెట్‌ఫ్లిక్స్‌తో పాటు ఆహా ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు ద‌క్షిణాది భాష‌ల‌న్నింటిలో ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఆహాలో మాత్రం కేవ‌లం తెలుగులోనే విడుద‌ల‌చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Dhanraj: ఆ దర్శకులందరూ నా గురువులే.. అతను లేకుంటే డైరెక్టర్ అయ్యేవాన్ని కాదు: జబర్దస్త్ ధన్‌రాజ్

Manjummel Boys OTT release date: ఈ వారమే ఓటీటీలోకి అడుగుపెడుతున్న మలయాళ సూపర్ హిట్ సర్వైవల్ థ్రిల్లర్

OTT Releases: ఈ వారం ఓటీటీలోకి 2 బ్లాక్ బస్టర్ సినిమాలు.. రెండూ డిఫరెంట్ జోనర్స్.. మొత్తంగా 16 స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

Jr NTR Dinner: బాలీవుడ్ స్టార్లతో జూనియర్ ఎన్టీఆర్ డిన్నర్ నైట్.. బ్రహ్మాస్త్ర, వార్ 2 టీమ్‌తో కలిసి..

ప్యూర్ ల‌వ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమాలో నిఖిల్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. కార్తికేయ -2 త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రూపొందిన సినిమా ఇది. 18 పేజెస్ సినిమాకు టాప్ డైరెక్ట‌ర్‌ సుకుమార్ క‌థ‌తో పాటు స్క్రీన్‌ప్లే అందించారు. కుమారి 21 ఎఫ్ ఫేమ్ సూర్య‌ప్ర‌తాప్ ప‌ల్నాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ఓ అమ్మాయిని నేరుగా క‌ల‌వ‌కుండా ఆమె రాసిన డైరీ ద్వారా త‌న‌తో ప్రేమ‌లో ప‌డే ఓ యువ‌కుడి క‌థ ఇది. ఆ యువ‌తి ల‌క్ష్యాల‌ను అత‌డు ఏ విధంగా నెర‌వేర్చాడ‌న్న‌దే ఎమోష‌న‌ల్‌గా ద‌ర్శ‌కుడు ఈ సినిమాలో ఆవిష్క‌రించారు. ఇందులో సిద్ధు అనే యువ‌కుడిగా నిఖిల్ క‌నిపించ‌గా నందిని పాత్ర‌లో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టించింది.

డిసెంబ‌ర్ 23న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ సినిమా డీసెంట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ప‌దిహేను కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈసినిమా 22 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. జీఏ2 పిక్చ‌ర్స్‌తో క‌లిసి ద‌ర్శ‌కుడు సుకుమార్ ఈ సినిమాను నిర్మించారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.