తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Neethone Dance Launch Date: స్టార్ మాలో నీతోనే డ్యాన్స్.. లాంచ్ డేట్ అనౌన్స్ చేసిన ఛానెల్

Neethone Dance Launch Date: స్టార్ మాలో నీతోనే డ్యాన్స్.. లాంచ్ డేట్ అనౌన్స్ చేసిన ఛానెల్

Hari Prasad S HT Telugu

06 June 2023, 19:38 IST

    • Neethone Dance Launch Date: స్టార్ మాలో నీతోనే డ్యాన్స్ రియాల్టీ షో రాబోతోంది. ఈ షో లాంచ్ డేట్ ను ఆ ఛానెల్ అనౌన్స్ చేసింది. సోమవారం (జూన్ 5) సరికొత్త ప్రోమో ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.
స్టార్ మాలో రానున్న నీతోనే డ్యాన్స్ షో
స్టార్ మాలో రానున్న నీతోనే డ్యాన్స్ షో

స్టార్ మాలో రానున్న నీతోనే డ్యాన్స్ షో

Neethone Dance Launch Date: తెలుగులోని టాప్ ఛానెల్ స్టార్ మా సరికొత్త డ్యాన్స్ రియాల్టీ షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ రియాల్టీ షో పేరు నీతోనే డ్యాన్స్ (Neethone Dance). కొన్ని రోజుల కిందటే ఈ డ్యాన్స్ షోని ప్రారంభించబోతున్నట్లు స్టార్ మా అనౌన్స్ చేసింది. అయితే తాజాగా సోమవారం (జూన్ 5) ఈ రియాల్టీ షో లాంచ్ డేట్ ను కూడా వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు

Samantha: ‘అది ఫేక్’: సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమంత ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..

Chitram Choodara OTT: నేరుగా ఓటీటీలోకి వస్తున్న వరుణ్ సందేశ్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Aditya Kapur Ananya Panday: బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆదిత్య కపూర్, అనన్య పాండే బ్రేకప్ చేసుకున్నారా? వివరాలివే

Aa Okkati Adakku Collections: బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్కటి అడక్కు మూవీ జోరు.. తొలి రోజు కంటే రెండో రోజు ఎక్కువగా..

ఓ సరికొత్త ప్రోమోలోను తమ ట్విటర్ లో పోస్ట్ చేస్తూ నీతోనే డ్యాన్స్ లాంచ్ డేట్ ను స్టార్ మా ప్రకటించింది. ఈ రియాల్టీ షో వచ్చే ఆదివారం (జూన్ 11) సాయంత్రం 6 గంటలకు ఘనంగా ప్రారంభం కానుంది. ఆ తర్వాత ప్రతి శని, ఆదివారాలు రాత్రి 9 గంటలకు ఈ షో టెలికాస్ట్ అవనున్నట్లు కూడా స్టార్ మా తెలిపింది. ఈ కొత్త ప్రోమోలో నీతోనే డ్యాన్స్ అంటూ ఓ ప్రత్యేకమైన పాటను కూడా రూపొందించడం విశేషం.

వెల్కమ్ టు ద బిగ్గెస్ట్ డ్యాన్స్ రియాల్టీ షో అంటూ ఈ ప్రోమో ప్రారంభమవుతుంది. నాచో నాచో రే.. మన జోడీ సూపరే.. సీటీ కొట్టాలే.. నీతోనే డ్యాన్స్ అంటూ ఈ సాంగ్ లిరిక్స్ సాగిపోతుంటాయి. ఎన్నో జంటలు స్టైలిష్ స్టెప్పులతో అలరించాయి. మొదట నిఖిల్, కావ్య జోడీ స్టెప్పులేసింది. ఆ తర్వాత పవన్, అంజలి.. అమర్‌దీప్, తేజస్విని.. సందీప్, జ్యోతిరాజ్.. శివకుమార్, ప్రియాంకా.. నటరాజ్, నీతూ.. యాదమ్మ రాజు, స్టెల్లా.. సాగర్, దీపా జోడీలు స్టెప్పులేయడం చూడొచ్చు.

ఇన్నాళ్లూ సీరియల్స్ తోనే తెలుగులో టాప్ లో నిలిచిన స్టార్ మా ఛానెల్ ఇక ఇప్పుడు డ్యాన్స్ రియాల్టీ షోతోనూ అదరగొట్టడానికి సిద్ధమైంది. ఇప్పటికే ఈటీవీ, జీ తెలుగులాంటి ఛానెల్స్ లోనూ డ్యాన్స్ షోలు వస్తున్నాయి. ఇప్పుడు వాటికి పోటీగా స్టార్ మా ఈ నీతోనే డ్యాన్స్ తో రాబోతోంది. మరి ప్రేక్షకులను ఈ రియాల్టీ షో ఎంత వరకూ ఆకట్టుకుంటుందో చూడాలి.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.