తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Neethone Dance In Star Maa: స్టార్ మాలో సరికొత్త డ్యాన్స్ షో "నీతోనే డ్యాన్స్" ఎప్పటి నుంచంటే?

Neethone Dance in Star Maa: స్టార్ మాలో సరికొత్త డ్యాన్స్ షో "నీతోనే డ్యాన్స్" ఎప్పటి నుంచంటే?

Hari Prasad S HT Telugu

24 May 2023, 21:58 IST

    • Neethone Dance in Star Maa: స్టార్ మాలో సరికొత్త డ్యాన్స్ షో "నీతోనే డ్యాన్స్" ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఈటీవీ, జీ తెలుగులాంటి ఛానెల్స్ లో వస్తున్న డ్యాన్స్ షోలు అలరిస్తుండగా.. ఇప్పుడు స్టార్ మా కూడా మరో కొత్త షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
స్టార్ మాలో రానున్న నీతోనే డ్యాన్స్ షో
స్టార్ మాలో రానున్న నీతోనే డ్యాన్స్ షో

స్టార్ మాలో రానున్న నీతోనే డ్యాన్స్ షో

Neethone Dance in Star Maa: తెలుగులో నంబర్ వన్ ఛానెల్ స్టార్ మాలో సరికొత్త డ్యాన్స్ షో ప్రారంభం కాబోతోంది. ఈ డ్యాన్స్ షో పేరు నీతోనే డ్యాన్స్. దీనికి సంబంధించిన ప్రోమోను బుధవారం (మే 24) స్టార్ మా రిలీజ్ చేసింది. కొత్త షో అనౌన్స్‌మెంట్ ను ఆ ఛానెల్ కాస్త వెరైటీగా చేయడం విశేషం. ఈ డ్యాన్స్ షో త్వరలోనే ప్రారంభం కానున్నట్లు ఆ ఛానెల్ వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు

Suriya Hit List: హీరోగా తమిళ డైరెక్టర్ విక్రమన్ కొడుకు క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్.. సూర్య చేతులమీదుగా హిట్ లిస్ట్ టీజర్

Prabhas: నా బుజ్జిని చూస్తారా: కల్కి 2898 ఏడీపై ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వైరల్

Prasanna Vadanam OTT Release date: ప్రసన్న వదనం ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ఇలా చేస్తే 24 గంటలు ముందుగానే చూడొచ్చు..

Devara fear song promo: దేవర ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ ప్రోమో చూశారా.. అదిరిపోయిన బీజీఎం

ద బిగ్గెస్ట్ డ్యాన్స్ రియాల్టీ షో అంటూ ఈ ప్రోమోను స్టార్ మా ట్విటర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. కళ్లు చెదిరే పర్ఫార్మెన్స్‌లు, నోరెళ్లబెట్టి చూసే స్టెప్పులు, అద్భుతమైన టాలెంట్ తో ఈ షో రాబోతున్నట్లు చెప్పింది. సీరియల్స్ విషయంలో ఎప్పుడూ ముందుండే స్టార్ మా.. రియాల్టీ షోలలోనే ఈటీవీ, జీ తెలుగు కంటే కాస్త వెనుకబడినట్లు కనిపించేది.

అయితే సిక్త్స్ సెన్స్ లాంటి షోతో రియాల్టీ షోలలోనూ టాప్ లోకి దూసుకెళ్లినా ఆ ఛానెల్.. తాజాగా డ్యాన్స్ షోను కూడా తీసుకొస్తోంది. నీతోనే డ్యాన్స్ ప్రోమో చూస్తే.. నిఖిల్, కావ్య అనే ఇద్దరు రోడ్డుపై నడుచుకుంటూ ఐస్‌క్రీమ్ తింటూ నడుస్తుంటారు. అప్పుడు నిఖిల్ తో కావ్య ఇలా అంటుంది. "నీకు గుర్తుందా.. మనం ఫస్ట్ టైమ్ కలిసినప్పుడు కూడా ఐస్ క్రీమ్ తిన్నాం. ఇలాగే వర్షం పడింది. ఈ జర్నీ ఇక్కడిదాకా వచ్చింది. ఇప్పుడు మళ్లీ వర్షం పడితే ఇంకేం జరుగుతుందో" అని కావ్య అనగానే వర్షం మొదలవుతుంది.

ఇంకేం జరుగుతుంది.. మ్యాజికల్ గా మ్యూజికల్ జర్నీ స్టార్ట్ అవుతుంది అని నిఖిల్ ఆమెతో అంటాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి అదిరిపోయే స్టెప్పులు వేస్తారు. ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా అనే సాంగ్ పై వీళ్లు డ్యాన్స్ చేస్తారు. బిగ్గెస్ట్ డ్యాన్స్ రియాల్టీ షో నీతోనే డ్యాన్స్ త్వరలోనే అంటూ ఈ ప్రోమో ముగుస్తుంది. ఇప్పటికే ఈటీవీలో ఢీ, జెమిని టీవీలో డ్యాన్స్ ఐకాన్, జీ తెలుగులో డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ షోలు టెలికాస్ట్ అవుతున్న విషయం తెలిసిందే.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం