తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nawazuddin Siddiqui Tollywood Debut: వెంకటేష్ సైంధవ్‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న న‌వాజుద్ధీన్ సిద్ధిఖీ

Nawazuddin Siddiqui Tollywood Debut: వెంకటేష్ సైంధవ్‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న న‌వాజుద్ధీన్ సిద్ధిఖీ

26 January 2023, 10:57 IST

  • Nawazuddin Siddiqui Tollywood Debut: వెంక‌టేష్ సైంధ‌వ్ సినిమాలో బాలీవుడ్ వెర్స‌టైల్ యాక్ట‌ర్ కీల‌క పాత్ర‌లో న‌టించ‌బోతున్నాడు. ఆ న‌టుడు ఎవ‌రంటే...

న‌వాజుద్ధీన్ సిద్దిఖీ
న‌వాజుద్ధీన్ సిద్దిఖీ

న‌వాజుద్ధీన్ సిద్దిఖీ

Nawazuddin Siddiqui Tollywood Debut: వెంక‌టేష్ 75వ సినిమా సైంధ‌వ్‌ను ఇటీవ‌లే అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు. హిట్‌, హిట్ -2 ఫేమ్ శైలేష్ కొల‌ను ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. వ‌రుస‌గా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ను రిలీజ్ చేస్తూ అభిమానుల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోన్న చిత్ర యూనిట్ తాజాగా మ‌రో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను గురువారం రివీల్ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Prithviraj Sukumaran: ‘సలార్’పై ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన పృథ్విరాజ్ సుకుమారన్.. ఎగ్జైట్ అవుతున్న ఫ్యాన్స్

Janhvi Kapoor: తిరుపతిలో పహారియాతో జాన్వీ కపూర్ పెళ్లి అంటూ రూమర్.. స్పందించిన హీరోయిన్

Rajamouli: అలాంటి సినిమా తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా.. చేస్తా: రాజమౌళి.. ఆర్ఆర్ఆర్‌పై ఆ ప్రశ్నకు నో కామెంట్

Netflix OTT top movies: నెట్‍ఫ్లిక్స్‌లో టాప్‍కు దూసుకొచ్చేసిన హారర్ థ్రిల్లర్ సినిమా.. రెండో ప్లేస్‍లో కామెడీ మూవీ

సైంధ‌వ్ సినిమాలో బాలీవుడ్ వెర్స‌టైల్ యాక్ట‌ర్‌ న‌వాజుద్ధీన్ సిద్ధిఖీ కీల‌క పాత్ర‌లో న‌టించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. క‌థ‌లో న‌వాజుద్ధీన్ సిద్దిఖీ పాత్ర కీల‌కంగా ఉంటుంద‌ని చిత్ర యూనిట్ తెలిపింది. ఫుల్ లెంగ్త్‌రోల్‌లో న‌వాజుద్ధీన్ క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలిపారు.

ఈ సినిమాతోనే న‌వాజుద్ధీన్ సిద్ధిఖీ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. సైంధ‌వ్‌లో వెంక‌టేష్, న‌వాజుద్ధీన్ పాత్ర‌లు పోటాపోటీగా ఉండ‌బోతున్న‌ట్లు స‌మాచారం. వెంక‌టేష్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్ సినిమాగా ప‌వ‌ర్‌ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సైంధ‌వ్ రూపొందుతోంది.

పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో ద‌క్షిణాది భాష‌ల‌తో పాటు బాలీవుడ్‌లోనూ ఈ సినిమాను రిలీజ్ చేయ‌బోతున్నారు. సైంధ‌వ్ సినిమాకు సంతోష్ నారాయ‌ణ‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఎఫ్ -3 స‌క్సెస్ త‌ర్వాత వెంక‌టేష్ అంగీక‌రించిన సినిమా ఇది. ప్ర‌స్తుతం స‌ల్మాన్‌ఖాన్ హీరోగా న‌టిస్తోన్న బాలీవుడ్ సినిమా కిసి కా భాయ్ కిసి కి జాన్ లో వెంక‌టేష్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. అలాగే వెంక‌టేష్‌, రానా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన రానా నాయుడు వెబ్‌సిరీస్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.