తెలుగు న్యూస్  /  Entertainment  /  Naveen Polishetty Doing Naatu Naatu Step After Ram Charan Tweet

Naveen Polishetty on Ram Charan: చరణ్ ట్వీట్‌కు నాటు నాటు స్టెప్ వేస్తున్న హీరో.. ఫుల్ ఖుష్..!

05 May 2023, 17:52 IST

    • Naveen Polishetty on Ram Charan: అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి కలిసి నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మీవీ టీజర్ ఇటీవల విడుదలైంది. ఈ టీజర్ తనకు ఎంతగానో నచ్చిందని రామ్ చరణ్ ట్వీట్ చేయగా.. హీరో నవీన్ ఫుల్ ఖుషీ అవుతున్నాడు. ఈ ఆనందంలో నాటు నాటు స్టెప్ వేస్తున్నానని ట్వీట్ చేశాడు.
చరణ్ ట్వీట్‌కు నాటు నాటు స్టెప్ వేస్తున్న హీరో
చరణ్ ట్వీట్‌కు నాటు నాటు స్టెప్ వేస్తున్న హీరో

చరణ్ ట్వీట్‌కు నాటు నాటు స్టెప్ వేస్తున్న హీరో

Naveen Polishetty on Ram Charan: జాతిరత్నాలు తర్వాత నవీన్ పోలిశెట్టి నటిస్తున్న సరికొత్త చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. చాలా కాలం గ్యాప్ తర్వాత ఇందులో అనుష్క హీరోయిన్‌గా చేస్తోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబందించిన టీజర్‌ను విడుదల చేసింది. టీజర్ ఆకట్టుకోవడంతో సర్వత్రా మంచి రెస్పాన్స్ లభిస్తోంది. సెలబ్రెటీలు సైతం అనుష్క, నవీన్‌లను అభినందిస్తున్నారు. ఇందులో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ మూవీ టీజర్‌పై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశారు. దీంతో నవీన్ పోలిశెట్టి ఫుల్ ఖుషీ అవుతున్నాడు. చరణ్‌కు ధన్యవాదాలు చెప్పడమే కాకుండా వినూత్నంగా ధన్యవాదాలు తెలిపాడు.

ట్రెండింగ్ వార్తలు

Bharti Singh Hospitalised: హాస్పిటల్లో చేరిన ప్రముఖ కమెడియన్.. కంటతడి పెడుతూ వీడియో

Salaar TRP: ప్రభాస్ సలార్ మూవీకి టీవీలో దారుణమైన టీఆర్పీ.. ఆ రెండు సినిమాల కంటే తక్కువే.. కారణం ఇదేనా?

Kamal Haasan Linguswamy: కమల్ హాసన్ మోసం చేశాడు: నిర్మాతల మండలికి డైరెక్టర్ ఫిర్యాదు

Prasanth Varma PVCU: హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బంపర్ ఆఫర్.. జై హనుమాన్‌లో నటించే అవకాశం!

రామ్ చరణ్ మిస్టర్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ టీజర్‌ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. "మిస్టర్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి టీజర్ చాలా బాగుంది. చూసేందుకు చాలా రిఫ్రెషింగ్‌గా అనిపించింది. ఈ సినిమా టీమ్ మొత్తానికి గుడ్ లక్ చెబుతున్నాను" అంటూ చరణ్ తన స్పందనను మైక్రో బ్లాగింగ్ సైట్ ద్వారా తెలియజేశారు. చరణ్ తమ సినిమా గురించి పోస్టు పెట్టడంతో తెగ సంబరపడిపోయిన నవీన్ తన ఆనందాన్ని ట్వీట్ రూపంలో వ్యక్త పరిచాడు.

రామ్ చరణ్ గారు మీకు థ్యాక్స్. మీ ట్వీట్ చూసి మేమంతా నాటు నాటు స్టెప్ వేస్తున్నాం. గేమ్ ఛేంజర్ లాంటి సినిమాను ఎంచుకొని మాకు స్ఫూర్తి నింపుతున్న మీకు ధన్యవాదాలు. అంటూ నవీన్ పోలిశెట్టి తన సంతోషాన్ని తెలియజేశాడు. అనుష్క శెట్టి కూడా చరణ్‌కు ధన్యవాదాలు తెలిపింది. "సో స్వీట్ ఆఫ్ యూ చరణ్.. మీ భార్య ఉపాసనతో కలిసి మీరు మిస్టర్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీని చూడాలని కోరుతున్నాను" అంటూ ట్వీట్ చేసింది స్వీటీ.

నవీన్ పోలిశెట్టి, అనుష్క కలిసి నటించిన మిస్టర్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ టీజర్ ఇటీవలే విడుదలైంది. యూవీ క్రియేషన్స్ పతాకంపై మహేష్ బాబు పీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళంలోనూ ఈ మూవీ విడుదల కానుంది. జయసుధ, మురళీ శర్మ, తులసి తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. రాధన్ సంగీతాన్ని సమకూర్చారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.